అనుష్క ప్రస్తుతం హాట్ కేక్‌లాంటి హీరోయిన్. ఎవరి నోట విన్నా అనుష్క అంటే సో స్వీట్.. దటీజ్ అనుష్క. అనుష్క కాబట్టే అలాంటి క్యారెక్టర్స్ చేయగలదు..ఇలాంటి మాటలు విన్పిస్తున్నాయి. హీరోయిన్‌గా అంతటి అభిమానాన్ని సంపాదించుకుంది హాట్ స్వీటీ బ్యూటీ అనుష్క. అలాంటి అనుష్క అనుకోకుండా సినిమాల్లోకి వచ్చి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా హీరోయిన్ అయిపోయింది కానీ..నిజానికి సినిమాలు చూడడం అంటే అనుష్కకి అస్సలు ఇష్టం ఉండదట.అందుకే ఆమె సినిమాల్లోకొచ్చిన తొలి రోజుల్లో కథలను ఎంపిక చేసుకోవడంలో అంతగా ఆశక్తి చూపించేది కాదంట. 'అరుంధతి' సినిమాలో ఆమెకు వచ్చిన క్రేజ్‌తో అప్పటి నుండీ సినిమాలను ఆస్వాదించడం మొదలు పెట్టిందట.
ఈ సినిమాతోనే ఆమెకు లైఫ్ టర్న్ అయ్యిందనే కూడా చెప్పాలి. అప్పటినుండీ కేవలం అనుష్క అంటే గ్లామర్ డాల్ మాత్రమే అని చూసే ప్రేక్షకులు అనుష్క అంటే ఇలాంటి డిగ్నిటీ ఉన్న పాత్రలకు కూడా న్యాయం చేయగలదు అనే నమ్మకం కుదిరింది. అప్పటినుండీ అనుష్క తన కథల ఎంపికలో కొంచెం కేర్ తీసుకోవడం మొదలుపెట్టింది. ఆ ఛేంజ్‌తోనే అనుష్క కెరీర్‌లో 'బాహుబలి', రుద్రమదేవి' 'సైజ్ జీరోలాంటి గొప్ప విలక్షణ చిత్రాలు ప్రాణం పోసుకున్నాయి. ప్రస్తుతం 'సైజ్‌జీరో' విజయాన్ని ఆస్వాదిస్తున్న అనుష్క 'బాహుబలి 2' కోసం సన్నధ్దమవుతోంది.
|