Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: శంకరాభరణం 
తారాగణం: నిఖిల్‌, నందిత, అంజలి, సంపత్‌, పృధ్వి, రావు రమేష్‌, సప్తగిరి, సుమన్‌, సితార తదితరులు. 
చాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌ 
సంగీతం: ప్రవీణ్‌ లక్కవరపు 
కథ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌ 
దర్శకత్వం: ఉదయ్‌ నందనవనం 
బ్యానర్‌: ఎంవివి సినిమా 
నిర్మాత: ఎంవివి సత్యనారాయణ 
విడుదల తేదీ: 4 డిసెంబర్‌ 2015 

క్లుప్తంగా చెప్పాలంటే 
అమెరికాలో హ్యాపీగా లైఫ్‌ లీడ్‌ చేసే కుర్రాడు గౌతమ్‌ (నిఖిల్‌). అతను ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కొడుకు. కొన్ని కారణాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి గౌతమ్‌కి. ఆ ఇబ్బందుల నుంచి బయటకు రావాలంటే ఇండియాలోని తన తల్లికి చెందిన ఆస్తిని అమ్మేసుకోవడమొక్కటే మార్గమని తెలుసుకుని గౌతమ్‌; స్వదేశానికి వస్తాడు. బీహార్‌లోని తమకు చెందిన ప్యాలెస్‌ని అమ్మాలనుకున్న నిఖిల్‌కి అక్కడి పరిస్థితులు షాక్‌ ఇస్తాయి. ఓ గ్యాంగ్‌ గౌతమ్‌ని కిడ్నాప్‌ చేస్తుంది. ఆ కిడ్నాప్‌ నుంచి గౌతమ్‌ ఎలా బయటపడ్డాడు? ప్యాలెస్‌ని అమ్ముకుని, విదేశలకు గౌతమ్‌ వెళ్ళిపోతాడా? అసలేం జరుగుతుంది అనేది తెరపై చూస్తేనే బాగుంటుంది. 

మొత్తంగా చెప్పాలంటే 
అమెరికా నుండొచ్చిన కుర్రాడిగా నిఖిల్‌ పెర్‌ఫెక్ట్‌గా సూటయ్యాడు. సినిమా సినిమాకీ నటనలో ఈజ్‌ పెంచుకుంటున్నాడు అఖిల్‌. తన పాత్రకు పూర్తి న్యాయం చేసిన నిఖిల్‌, లాంగ్వేజ్‌ యాక్సెంట్‌ నుంచి బాడీ లాంగ్వేజ్‌దాకా అన్ని విధాలా కొత్తగా కనిపిస్తాడు. నందిత ఓకే. ఆమె ఐడెంటిటీ చాటుకునేందుకు సరైన అవకాశం దక్కలేదు. అంజలి తెరపై కనిపించేది 20 నిమిషాలే అయినా, అందులో ఓ పాట కూడా ఉంది. ఆ పాట ఆకట్టుకుంటుంది. సంపత్‌ రాజ్‌ బాగా చేశాడు. పృధ్వీ తనదైన కామెడీతో ఆకట్టుకున్నాడు. సప్తగిరి కూడా నవ్వించాడు. రావు రమేష్‌, సుమన్‌ తదితరులంతా ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర ఓకే అనిపిస్తారు. 

కథ మరీ కొత్తది కాదు. కథకి ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించడంలో కోన వెంకట్‌ తన మార్కు చాటుకున్నాడు. అయితే కొత్త ప్రయోగం అని చెప్పి, కోన వెంకట్‌ తన పాత ఫార్మాట్‌లో వెళ్ళడం నిరాశపర్చుతుంది. డైలాగ్స్‌ బాగున్నాయి. మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. సినిమాటోగ్రఫీ బాగుంది. డిఫరెంట్‌ కలర్‌లో సినిమా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేస్తుంది. డిఫరెంట్‌ ఫీల్‌ని ఇస్తుంది. ఎడిటింగ్‌ ఇంకా అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. 

కొత్త కథ, కొత్త ఫార్మాట్‌ అని కోన వెంకట్‌ అనడంతో తన స్కూల్‌ మార్చాడని అందరూ ఎదురుచూశారు. అయితే కోన వెంకట్‌ అలాంటి సాహసం ఏమీ చేయలేదు. దాంతో సినిమా రొటీన్‌గా అనిపిస్తుంది. విదేశాల నుంచి ఓ యువకుడు ఆస్తి కోసం స్వదేశానికి రావడం అనే కాన్సెప్ట్‌ చాలా సినిమాల్లో చూసేసింది. కోన వెంకట్‌ సినిమాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ మామూలే. అది కూడా రొటీన్‌ అనిపిస్తుంది. అక్కడక్కడా కోన వెంకట్‌ మార్క్‌ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఆకట్టుకుంటుంది. కొన్ని పంచ్‌ డైలాగులు బాగా పేలాయి. పబ్లిసిటీ బాగా చేయడం సినిమాకి ప్లస్‌ అయ్యింది. ఫస్ట్‌ హాఫ్‌ ఓకే అనిపిస్తుంది. సెకెండాఫ్‌లోనూ పెద్దగా ట్విస్ట్‌లు ఏమీ కనిపించవు. ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచే సన్నివేశాలు లేకపోవడం కొంచెం ఇబ్బందికరం. కామెడీ వరకూ ఓకే. అది కూడా కొన్నిసార్లు నిరాశపరుస్తుంది. ఓవరాల్‌గా సినిమా డిఫరెంట్‌గా లేదు, అద్భుతంగా కూడా లేదు. జస్ట్‌ ఓకే అనిపించే చిత్రమిది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
శంకరాభరణం జస్ట్‌ ఓకే. 

అంకెల్లో చెప్పాలంటే: 2/5

మరిన్ని సినిమా కబుర్లు
anushka enjoys