Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
will people buy 3D tvs

ఈ సంచికలో >> సినిమా >>

నటించే ఆలోచన లేదనుకుంటా

not thinking about acting

ఆమె పాట ఎంత అందంగా వుంటుందో.. ఆమె డబ్బింగ్‌ చెబితే తెరపై కన్పించే నటి అంత అందంగా కనిపిస్తుంది. తెలుగు సినీ పాటల ప్రస్తానంలో ఆమె తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. పరిచయం ప్రత్యేకంగా అక్కర్లేదు ఆమె గురించి. ఆమె ఎవరో కాదు, సింగర్‌ సునీత.

మధురమైన పాటలతో, తెలుగు సినీ పాటల ప్రేమికుల మనసు కొల్లగొట్టిన సునీత, పలువురు హీరోయిన్లకు డబ్బింగ్‌ చెప్పి, ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో సందేహం లేదు. ఇప్పటి హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందం ఆమెది. అయినా ఎప్పుడూ సింపుల్‌గా వుండడానికే ఆమె ఇష్టపడ్తుంది తప్ప, తెరపై కన్పించాలనే ఇష్టం ఆమె ప్రదర్శించలేదు.

టీవీ యాంకర్లు కూడా వెండితెరపై కన్పించాలని ఉబలాటపడ్తోంటే, వెండితెరపై తన పాటల ప్రయాణం.. తన మాటల ప్రయాణం తప్ప.. తాను కనిపించాలనుకోలేదు సింగర్‌ సునీత. ఎందుకలా.? అంటే ఇష్టం లేకనే.. అని సమాధానమిస్తుంది సునీత.

మరిన్ని సినిమా కబుర్లు
ramajogayya shastry patience