Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

అనసూయతో ఇంటర్వ్యూ

interview with anasuya
ఇంత‌ పాపులారిటీ రావ‌డానికి ఎంత క‌ష్ట‌ప‌డ్డానో తెలుసా? - అన‌సూయ‌
 
హీరోయిన్లు సైతం అసూయ ప‌డేంత క్రేజ్ అన‌సూయ సొంతం!
ఇంత‌కీ త‌నేం చేసింది?
ఎన్ని సినిమాల్లో క‌నిపించింది?
ఐటెమ్ సాంగులేమైనా చేసిందా?
లేదే.. జ‌స్ట్ జ‌బ‌ర్‌ద‌స్త్‌లో అలా - మెరిసింది. మ‌న మ‌న‌సుల్లో కోటి కాంతుల బ‌ల్బులు వెలిగించింది. అన‌సూయ అంటే... తెలుగోళ్లంద‌రికీ తెలుసు. ఆ క్రేజ్‌ని సినిమావాళ్లు ఇప్పుడు వాడుకోవ‌డం మొద‌లెట్టారు. సినిమాల్లోకి అడుగుపెట్ట‌క మునుపే.. అన‌సూయ‌పై బోల్డ‌న్ని హాట్ హాట్ క‌బుర్లు. ఇప్పుడు మ‌రింత ఎక్కువ‌వ్వ‌డం ఖాయం. వీట‌న్నింటి గురించీ అన‌సూయ ఏమ‌నుకొంటోంది. త‌న కెరీర్‌ప‌ట్ల‌, త‌న పాపులారిటీ ప‌ట్ల అన‌సూయ సంతృప్తిగా ఉందా?  ఈ విష‌యాల్ని గో.తెలుగు ఆరా తీసింది. అవ‌న్నీ మీ కోసం.
 
* మీ నేప‌థ్యం గురించి తెలుసుకోవాల‌ని వుంది..
- (న‌వ్వుతూ) మాది మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబం. నాన్న పేరు సుద‌ర్శ‌న్‌. బిజినెస్‌మేన్‌. న‌న్ను ఆర్మీలో చేర్పించాన‌ల్న‌ది నాన్న కోరిక‌. అందుకే నేను ఎన్‌సీసీలో చేరా. ఏంబీయే ప‌ట్టా పుచ్చుకొన్నా త‌ర‌వాత హెచ్ ఆర్ మేనేజ‌ర్‌గా ప‌నిచేశా. ఆ త‌ర‌వాత టీవీ యాంక‌ర్‌గా అవ‌కాశం వ‌చ్చింది.  ఆ త‌ర‌వాత జ‌బ‌ర్‌ద‌స్త్‌. మిగిలిన‌దంతా మీకు తెలిసిందే.

* మీద ప్రేమ వివాహ‌మా?
- అవును. ఎన్‌సీసీ స‌మ‌యంలోనే భ‌ర‌ద్వాజ్‌తో నాకు ప‌రిచ‌య‌మైంది. పెద్ద‌ల అంగీకారంతో పెళ్లి చేసుకొన్నాం. మాకు ఇద్ద‌రు పిల్ల‌లు. వారి స‌హ‌కారం లేక‌పోతే నేను ఇంత దూరం వ‌చ్చేదాన్ని కాదు.

* టీవీ, సినిమా ఏది క‌ష్టం అనిపించింది?
- నేనింకా నేర్చుకొనే ద‌శ‌లోనే ఉన్నా. అయినా ఏం సాధించాన‌ని.. ఇది క‌ష్టం, అది సుఖం అని చెప్ప‌డానికి. రెండింట్లోనూ క్ర‌మ‌శిక్ష‌ణ చాలా అవ‌స‌రం. టీవీలో అయితే.... దాదాపుగా సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ నేనే. కార్య‌క్ర‌మ‌మంతా నా భుజాల‌పై ఉంటుంది. సినిమా అలా కాదు. కాబ‌ట్టి... సినిమాల్లోనే రిలాక్సేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది.

* మ‌ధ్య‌లో కొన్ని సినిమా అవ‌కాశాలు వ‌దులుకొన్నారు.. కార‌ణం ఏమిటి?
- దానికి నా ద‌గ్గ‌ర కూడా స‌మాధానం లేదు. టీవీ షోల విష‌యంలోనూ నేను ఇంతే సెల‌క్టీవ్‌గా ఉండేదాన్ని. సినిమాల విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఆలోచించాలి క‌దా?  నా పాత్ర ఎలా డిజైన్ చేస్తారు, దాని ప్రాముఖ్యత ఎంత‌? ఇవ‌న్నీ నేను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొంటా. ఇంకో మాట చెప్ప‌నా... సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాలో న‌టించాలా, వ‌ద్దా అనే విష‌యంలోనూ చాలా ఆలోచించా. నాది చిన్న పాత్ర చేయాలా? వ‌ద్దా అనుకొన్నా. నాగార్జున సార్ ఉన్నార‌నే... ఈ సినిమా చేశా. ఎందుకంటే నేను ఆయ‌న ఫ్యాన్‌ని.

* అంత పెద్ద సినిమా చేసిన త‌ర‌వాత‌.. క్ష‌ణం ఒప్పుకొన్నారు..
- నిజానికి సోగ్గాడే కంటే ముందు చేసిన సినిమా ఇది. కాస్త ఆలస్యంగా విడుద‌ల అవుతోంది. ఈ సినిమాలో నా పాత్ర నాకే షాకింగ్‌గా అనిపించింది. అందుకే  చేశా.

* ఇక టీవీని వ‌దిలేసిన‌ట్టేనా?
- ఎంత మాట‌..??  ఈ రోజు నేనీ స్థితిలో ఉండ‌డానికి కార‌ణం.. టీవీ షోలే. దాన్ని వ‌ద‌ల‌ను.

* టీవీ అంటే సింగిల్ హ్యాండ్‌తో నెట్టుకొచ్చేస్తారు.. సినిమాల్లో అలా కాదు క‌దా?
- అవును. ఆ స్వార్థంతోనే నేను సినిమాల్లోకి అడుగుపెట్ట‌డానికి జంకాను. కానీ.. సినిమాల ద్వారా ల‌భించే గుర్తింపు, కిక్ వేరు. చిన్న పాత్ర చేసినా జ‌నం గుర్తించుకొంటారు.

* మీపై బోల్డ‌న్ని రూమ‌ర్లు.. చ‌దువుతుంటారా?
- (న‌వ్వుతూ) త‌ప్ప‌కుండా. లేదంటే నిద్ర‌ప‌ట్ట‌దు. నామీద వార్త‌లు రాసేవాళ్లంతా నా వీరాభిమానుల‌ని నా ఫీలింగ్‌. నా అభిమానులు రాసింది చ‌ద‌వ‌క‌పోతే... వాళ్లు ఫీల‌వుతారు క‌దా?

* మ‌రి ఇవ‌న్నీ మీవారూ చ‌దువుతారా?
- నేను చ‌ద‌వ‌డ‌మే ఆయ‌న‌కు న‌చ్చ‌దు. ఇవ‌న్నీ మ‌న‌కు అవ‌స‌ర‌మా? అని అడుగుతారు. నేనేంటో ఆయ‌న‌కు బాగా తెలుసు. అందుకే ఇలాంటి గాసిప్పుల విష‌యంలో మా ఇద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావు.

* హీరోయిన్ కంటే నేనే అందంగా ఉంటా.. అని ఎప్పుడైనా అనిపించిందా?  హీరోయిన్ గా ట్రై చేయ‌రా?
- లేదండీ. నా అందం ఏంటో, ఎంతో నాకు తెలుసు. నేను అందానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వ‌ను. నా స్నేహితులంతా మోడ‌లింగ్ చేయ‌మ‌ని ప్రోత్స‌హించేవారు. కానీ నేనే ట్రై చేయ‌లేదు.

* పెళ్ల‌యినా సినిమాల్లో రాణించ‌డం క‌ష్టంగా అనిపించ‌డం లేదా?
- నా వ్య‌క్తిగ‌తాన్ని సినిమాల్నీ లింకు పెట్టి చూడ‌కండి. నేను సినిమాల్లో ఎలా క‌నిపిస్తున్నా?  నా న‌ట‌న మీకు న‌చ్చుతుందా, లేదా అన్న‌దే ముఖ్యం. మిగిలిన విష‌యాల గురించి ఇంత చ‌ర్చ ఎందుకు?  బాలీవుడ్‌లో చూడండి. అక్క‌డ పెళ్ల‌యిన‌వాళ్లు కూడా హీరోయిన్లుగా చ‌లామ‌ణీ అవుతున్నారు. ప్ర‌తిభే ముఖ్యం. పెళ్ల‌య్యిందా, లేదా అనేది కాదు.

* త‌క్కువ స‌మ‌యంలోనే అన‌సూయ ఎక్కువ గుర్తింపు తెచ్చుకొంది అంటుంటారంతా. దీనిపై మీ కామెంట్‌?
- నేనెంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఈ గుర్తింపు రావ‌డం వెనుక నా శ్ర‌మేంటో నాకే తెలుసు. ఏ విజ‌యం సుల‌భంగా రాదు.

* భ‌విష్య‌త్తులో ఎలాంటి పాత్ర‌ల్లో క‌నిపిస్తారు?
- నా కెరీర్ ఇలా ఉండాలి అని నేనెప్పుడూ డిజైన్ చేసుకోలేదు.. చేసుకోను. మ‌న‌సుకి న‌చ్చిన పాత్ర ఏదైనా చేస్తా. అది గ్లామ‌రా, డీ గ్లామ‌రా అనేది ప‌ట్టంచుకోను.
మరిన్ని సినిమా కబుర్లు
movie review