Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
atttracts guntur Talkies

ఈ సంచికలో >> సినిమా >>

తమిళ్‌పై కన్నేసిన నాగార్జున

Nagarjuna reentry in tamil indurstry l

అక్కినేని నాగార్జున తమిళ్‌పై కన్నేశాడు. 'ఊపిరి' సినిమా తమిళంలో, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో నాగార్జునతోపాటు తమిళనటుడు కార్తీ నటిస్తున్నాడు. తమన్నా హీరోయిన్‌. 'బృందావనం', 'ఎవడు' చిత్రాల ఫేం వంశీ పైడిపల్లి దర్శకుడు. తెలుగులో తన పాత్రకు నాగార్జున ఎలాగూ డబ్బింగ్‌ చెప్పుకుంటాడు. ఈ చిత్రం తమిళ వెర్షన్‌ కోసం తమిళంలో నాగార్జున డబ్బింగ్‌ చెప్పడమే ఇక్కడ విశేషం. తమిళ హీరో కార్తి, నాగార్జునతో డబ్బింగ్‌ చెప్పించాలని సరదా పడ్డాడట. డబ్బింగ్‌ అయితే చెప్పానుగానీ, నచ్చితే ఉంచండి లేదంటే ఎవరితోనైనా చెప్పించండి అని నాగ్‌, దర్శకుడు వంశీ పైడిపల్లికి సూచించాడట. వంశీ పైడిపల్లి సహా కార్తీ కూడా నాగార్జున తమిళ డబ్బింగ్‌ చాలా బాగుందని అన్నారట. నాగార్జున చాలాకాలం క్రిందట ఓ తమిళ సినిమా చేశాడు. తెలుగు, తమిళంలో ఆ సినిమా విడుదలైంది. 'రక్షకుడు' ఆ సినిమా పేరు. తమిళ, తెలుగు భాషల్లో వచ్చిందా సినిమా. అలా తమిళ ప్రేక్షకులక్కూడా నాగార్జున సుపరిచితుడే. ఈ 'ఊపిరి' సినిమాతో నాగార్జున తమిళ ప్రేక్షకులకు ఇంకా దగ్గరవడం ఖాయం. వారిని ఎట్రాక్ట్‌ చేయడానికి నాగార్జున సొంత డబ్బింగ్‌ కూడా తమిళంలో చెప్పాడు గనుక, తమిళ సినీ ప్రేక్షకులూ నాగ్‌ని తమవాడిగా స్వీకరించేయొచ్చు. 

మరిన్ని సినిమా కబుర్లు
no selfish