Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Nagarjuna reentry in tamil indurstry l

ఈ సంచికలో >> సినిమా >>

ఆ ముద్దుగుమ్మకి అస్సలు స్వార్ధం లేదంట

no selfish

ప్రస్తుతం నెంబర్‌ వన్‌ హీరోయిన్‌గా చలామణీ అవుతున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కు అస్సలు స్వార్ధం లేదంట. ఎందుకంటే తన తోటి నటీమణులందరితోనూ సఖ్యంగా మెలగుతూ, తాను మాత్రమే ఎదగాలని కాకుండా, అందరి బాగు గురించీ ఆలోచిస్తుందట ఈ ముద్దుగుమ్మ. అబ్బా రకుల్‌ది ఎంత పెద్ద మనసో కదా. సినీ ఇండస్ట్రీలో ఒక మంచి నటిని మాత్రమే అనిపించుకోవడం కాదు, మనిషిగా పుట్టినందుకు సాటి మనిషిని అర్ధం చేసుకోవడం కూడా తప్పనిసరి అంటోంది స్మైలీ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఇక నటన విషయానికొస్తే, నా కారంణంగా నాకిచ్చిన పాత్రకు ఎంత మేర న్యాయం చేయగలనో అంత మేర న్యాయం చేయడానికి శతవిధాలా కష్టపడతానంటోంది ఈ ముద్దుగుమ్మ. కష్టాన్ని నమ్ముతాను కాబట్టే జయాపజాయలతో నాకు సంబంధం ఉండదు. సక్సెస్‌ అయినా, ఫెయిల్యూర్‌ అయినా ఒకేలా స్వీకరిస్తాను అంటోంది. రకుల్‌ చాలా ప్రాక్టికల్‌ కదా.. గ్లామర్‌ ఉన్నంత వరకూ హీరోయిన్‌కు విలువ. అందుకే వచ్చిన ఏ అవకాశాన్ని వదలకుండా ముందుకు దూసుకుపోవడమే నా లక్ష్యం అంటోంది ముద్దుగుమ్మ రకుల్‌. ప్రస్తుతం ఈ భామ అల్లు అర్జున్‌తో 'సరైనోడు' సినిమాలో నటిస్తోంది. 

మరిన్ని సినిమా కబుర్లు
ramgopalvarma route supperate