Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Verma introduced one more  Beauty

ఈ సంచికలో >> సినిమా >>

యమ ఫాస్ట్‌గా వచ్చేస్తోన్న 'తుంటరోడు'

tuntarodu  comming fast

నారా రోహిత్‌, లతా హెగ్దే జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'తుంటరి'. కుమార్‌ నాగేంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నారా రోహిత్‌ తన బాడీ లాంగ్వేజ్‌ పూర్తిగా మార్చేసి మాస్‌ లుక్‌లో కనిపించనున్నాడు. అంతేకాదు ఫుల్‌గా నవ్వులు కూడా పండిస్తానంటున్నాడు. ఆవారాగా తిరిగే ఓ కుర్రాడు సడెన్‌గా బాధ్యత తెలిసి పట్టుదలతో తాను అనుకున్నది సాధించే ప్రయత్నమే ఈ చిత్ర కథ. ఈ సినిమాలో నారా రోహిత్‌ నటన, చెప్పే డైలాగులు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉంటాయంటున్నారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇంతవరకూ రోహిత్‌ చేసిన సినిమాల కన్నా ఈ చిత్రం భిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ తెల్పుతోంది.

డైలాగ్స్‌ చెప్పడంలో ఇప్పటి వరకూ చూసిన రోహిత్‌ స్టైల్‌ వేరు. ఈ సినిమాలో రోహిత్‌ స్టైలే వేరు అని డైరెక్టర్‌ కుమార్‌ నాగేంద్ర తెలిపారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమాలో మాంచి జోరుగా, ఫుల్‌ ఎనర్జిటిక్‌గా నారా రోహిత్‌ కనిపించనున్నాడట. ఇన్ని స్పెషల్స్‌ ఉన్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేసిన చిత్ర యూనిట్‌, సెన్సేషనల్‌ హిట్‌ కొట్టేందుకు సమాయత్తమవుతోంది. ఆల్‌ ది బెస్ట్‌ టు 'తుంటరి' టీమ్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
srutihasan involves in hot sceans