Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
run team comming

ఈ సంచికలో >> సినిమా >>

నాని హీరోయిన్‌ ఆ ఛాన్స్‌ కొట్టేసింది

nani's heroin got a chance

పూరీ జగన్నాధ్‌ సినిమాల్లో హీరోయిన్లకి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన సినిమాల్లో నటించడానికి అందుకే ముద్దుగుమ్మలు ఎగబడతారు. అవకాశం చిక్కిందాచ ఇంక అంతే ఎగిరి గంతేస్తారు. ఇప్పుడు ఆ ఛాన్స్‌ నాని హీరోగా వచ్చిన 'కృష్ణగాడి వీర ప్రేమగాధ' సినిమా హీరోయిన్‌ మెహరీన్‌కు దక్కింది. పూరీ జగన్నాధ్‌ దర్శకత్వంలో కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తెరక్కెబోతోన్న సినిమాలో మెహరీన్‌ను హీరోయిన్‌గా ఎంచుకున్నట్లు సమాచారం. మొదటి సినిమాతోనే అందంతోనూ, నటనతోనూ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. నేచురల్‌ ఫీచర్స్‌తో ఉన్న అమ్మడు అందుకే పూరీ దృష్టిలో పడింది. మే నెలలో ఈ సినిమా సెట్స్‌ మీదికెళ్లనుంది.

పూరీ సినిమా అంటే వీలైనంత తొందరగా షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకుని ప్రేక్షకుల ముందుకు వస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ సినిమా దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే యోచనలో పూరీ ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకు కళ్యాణ్‌రామ్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తొలి సినిమా 'కృష్ణగాడి వీర ప్రేమగాధ'ని చిన్న దర్శకుడితో ఓ మోస్తరు హీరోతో చేసిన మెహ్రీన్‌, రెండో సినిమానే టాలీవుడ్‌లో టాప్‌ డైరెక్టర్స్‌లో ఒకరైన పూరి జగన్నాథ్‌తో చేసే అవకాశం రావడం గొప్ప విషయమే. పూరి డైరెక్షన్‌లో చేసిన ఎందరో ముద్దుగుమ్మలు హీరోయిన్‌గా టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. అలాంటి అద్భుతం మెహ్రీన్‌ విషయంలోనూ జరుగుతుందేమో చూడాలిక. 
 

మరిన్ని సినిమా కబుర్లు
beauty ready for mega hit