Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష

movie review

చిత్రం: కథకళి 
తారాగణం: విశాల్‌, కేథరీన్‌ ట్రెసా, మధుసూధన్‌, కరుణాస్‌, మైమ్‌ గోపి, శ్రీజిత్‌ రవి, శతృ తదితరులు 
సంగీతం: హిప్‌ హోప్‌ తమిళ 
ఛాయాగ్రహణం: బాలసుబ్రహ్మణ్యం 
నిర్మాణం: విశాల్‌ ఫిలిం ఫ్యాక్టరీ 
దర్శకత్వం: పాండిరాజ్‌ 
నిర్మాత: విశాల్‌ 
విడుదల తేదీ: 18 మార్చి 2016

క్లుప్తంగా చెప్పాలంటే 
ప్రేమించిన అమ్మాయి మల్లీశ్వరి (కేథరీన్‌)ని పెళ్ళి చేసుకోవడానికి విదేశాల నుంచి వస్తాడు కమల్‌ (విశాల్‌). సాంబ (మధుసూధన్‌) అనే వ్యక్తి కారణంగా తన కుటుంబం ఇబ్బందుల్లో పడినా, తన పెళ్ళికి కమల్‌, సాంబని ఆహ్వానిస్తాడు. అనుకోకుండా సాంబ హత్యకు గురవుతాడు. సాంబకు చాలామంది విరోధులుంటారు గనుక, ఆ మర్డర్‌ మిస్టరీగా మారుతుంది. అయితే తన స్నేహితుడు సత్యం, సాంబ దగ్గర పనిచేస్తాడు. ఆ సత్యం, సాంబ హత్య కేసులో కమల్‌పై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేస్తాడు. కేసు విచారిస్తున్న హరిశ్చంద్రప్రసాద్‌ (శ్రీజిత్‌ రవి), కమల్‌పై ఫోకస్‌ పెడ్తాడు. ఇంతకీ సాంబ హత్య ఎలా జరిగింది? కమల్‌కి సాంబ హత్యతో సంబంధం వుందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే 
విశాల్‌ మరోసారి అద్భుతమైన నటనా ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అన్నయ్య కోసం విలన్‌తో పోటీ పడే తమ్ముడిగా, కుటుంబాన్ని కాపాడుకోవడంలో, లవర్‌ పాత్రలో డిఫరెంట్‌ షేడ్స్‌తో పెర్ఫామెన్స్‌, యాక్షన్‌తో అలరించాడు. కేథరీన్‌ తన పాత్ర వరకూ బాగానే చేసింది. క్యూట్‌గా, నేచురల్‌ లుక్స్‌తో ఆకట్టుకుంది. పోలీస్‌ అధికారి పాత్రలో శ్రీజిత్‌ రవి బాగా చేశాడు. సాంబ పాత్రలో మధుసూధన్‌ నటన బాగుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర నటించారు.

లవ్‌స్టోరీ రొటీన్‌ అయినా, ఇందులో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ని బాగా ప్లాన్‌ చేశారు. డైలాగ్స్‌ బాగానే ఉన్నాయి. మరీ డిఫరెంట్‌ అనిపించదుగానీ, కాస్త కొత్తగా అనిపిస్తుంది. తెలుగు ఆడియన్స్‌ టేస్ట్‌కి తగ్గట్టుగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోవడం కొంచెం మైనస్‌. కథ, కథనం బాగున్నాయి. మ్యూజిక్‌ ఆకట్టుకుంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ సినిమాకి ప్లస్‌ అయ్యింది. సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా పెద్ద ప్లస్‌. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ తమ పని చేసుకుపోయాయి. నిర్మాణపు విలువలు బాగున్నాయి. 
మర్డర్‌ మిస్టరీ, లవ్‌ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌ ఇలా అన్నీ కలగలిపి దర్శకుడు సినిమాని తెరకెక్కించాడు. తమిళం నుంచి తెలుగులోకి వచ్చిన డబ్బింగ్‌ సినిమా ఇది. ఇలాంటి సినిమాలకి తమిళనాడులో ఉన్నంత క్రేజ్‌ ఇక్కడ ఉంటుందా? అన్నది ప్రశ్నే. ఎంటర్‌టైన్‌మెంట్‌ లేకపోవడం, కమర్షియల్‌ అంశాలైన గ్లామర్‌ వంటివి లేకపోవడం ఇవన్నీ మైనస్‌ పాయింట్స్‌. రొటీన్‌కి భిన్నంగా సినిమాల్ని ఎంజాయ్‌ చేసేవారికి మాత్రం నచ్చుతుంది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ మాత్రం బాగున్నాయి. ఫీల్‌ ప్లస్‌ థ్రిల్లింగ్‌ అంశాల వరకూ ఆడియన్స్‌ నుంచి మంచి మార్కులు పడతాయి.

ఒక్క మాటలో చెప్పాలంటే 
ఎంటర్‌టైన్‌మెంట్‌ లేదుగానీ, డిఫరెంట్‌ సినిమా

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
interview with tamanna