Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nani's heroin got a chance

ఈ సంచికలో >> సినిమా >>

మెగా హిట్‌కి రెఢీ అంటున్న ముద్దుగుమ్మ

beauty ready for mega hit

మెగా హీరోలతో కాజల్‌కి బాగా కలిసొచ్చింది. ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయినప్పటికీ, 'మగధీర' సినిమాతోనే సెన్సేషనల్‌ హీరోయిన్‌ అయ్యింది కాజల్‌ అగర్వాల్‌. ఆ తర్వాతి నుంచీ ఆమె కెరీర్‌ జెట్‌ స్పీడుతో దూసుకెళ్లిపోతోంది. ఆ తర్వాత చరణ్‌తో వచ్చిన 'నాయక్‌' కూడా బిగ్గెస్ట్‌ హిట్‌ సాధించి పెట్టింది ఆమెకు. తరిగిపోని అందంతో వర్ధమాన హీరోయిన్లకు గట్టి పోటీగా నిలబడుతోంది కాజల్‌. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. సూపర్‌ స్టార్‌ మహేష్‌తో 'బ్రహ్మూెత్సవం' సినిమాలో సందడి చేయబోతోంది.

ఇక 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో తొలిసారిగా జతకడుతోంది కాజల్‌. 'గబ్బర్‌ సింగ్‌' సినిమా తర్వాత 'శృతిహాసన్‌ రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ సినిమా కాజల్‌ కెరీర్‌లో 'మగధీర' అంతటి హిట్‌ అవుతుందని అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమాపై 100 కోట్ల మార్కెట్‌ దాటిందని సమాచారం. సమ్మర్‌లో 'సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌' ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' టీజర్స్‌ విడుదలై అభిమానుల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతున్నాయి. టీజర్స్‌తోనే సినిమాపై అంచనాలు పదింతలయ్యాయి. సో ఆల్రెడీ కాజల్‌ ఖాతాలో సగం హిట్‌ నమోదైపోయినట్లే. 

మరిన్ని సినిమా కబుర్లు
nag says about her sons