Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cinechuraka

ఈ సంచికలో >> సినిమా >>

సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ఇంటర్వ్యూ

interview with sai dharm tej
అమ్మాయిలు ఇప్పుడిప్పుడే ట‌చ్‌లోకి వ‌స్తున్నారు  - సాయిధ‌ర‌మ్ తేజ్‌

చిరంజీవిలా డాన్సులు వేస్తాడు
ప‌వ‌న్ క‌ల్యాణ్‌లా డైలాగులు చెబుతాడు
చ‌ర‌ణ్‌, బ‌న్నీలో క‌నిపించే ఈజ్ ఉంది
ఇంకేం కావాలి??  అందుకే ఈ మెగా మిక్చ‌ర్ పొట్లం లాంటి సాయిధ‌ర‌మ్ తేజ్ బిజీ అయిపోయాడు. పిల్లా నువ్వులేని జీవితం, సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ చిత్రాల‌తో హిట్టుకొట్టి... యంగ్ హీరోల‌కు పోటీగా నిలిచాడు. ఇప్పుడు సుప్రీమ్ అంటూ థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తున్నాడు. ఈ సంద‌ర్భంగా సాయిధ‌ర‌మ్ తేజ్ తో గో తెలుగు డాట్ కామ్ చేసిన చిట్ చాట్ ఇది.

* మొత్తానికి సుప్రీమ్ హీరో అయిపోయారు..
- (న‌వ్వుతూ) భ‌లేవారే. అది మావ‌య్య‌గారికి అభిమానులు ఇచ్చిన బిరుదు.  ఎంతో క‌ష్ట‌ప‌డితే ఆయ‌న ఆస్థాయికి చేరుకొన్నారు. నేను నాలుగో సినిమాకే సుప్రీమ్ హీరో అయిపోవాల‌నుకోవ‌డం అత్యాసే క‌దా?

* సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్ టైటిల్ కార్డ్స్‌లో మిమ్మ‌ల్ని సుప్రీమ్ హీరో అనేశారు క‌దా..
- అది కావాల‌ని పెట్టుకొన్న‌ది కాదు. దిల్‌రాజు, హ‌రీష్ శంక‌ర్‌లు క‌ల‌సి బ‌ల‌వంతంగా ఇరికించేశారు. అందులో నా ప్ర‌మేయం ఏమీ లేదు. ఇప్పుడు ఈ సినిమాకి సుప్రీమ్ అని పేరు పెట్టిన‌ప్పుడు కూడా భ‌య‌ప‌డ్డా. అదే విష‌యం మావ‌య్య‌తో చెప్పా. 'కంగారేం ప‌డ‌కు గోహెడ్‌' అన్నారు. ఆయ‌న ఇచ్చిన ధైర్యంతోనే టైటిల్ ఫిక్స్ చేశాం. సుప్రీమ్ అని పేరు పెట్టుకొన్నాక అందం ఇందోళం అన్న పాట రీమిక్స్ చేయ‌క‌పోతే బాగోద‌ని.. అదీ జోడించాం.

* మావ‌య్య‌ల పేర్లు సినిమాల్లో ప్ర‌స్తావించ‌డం, వాళ్ల బిరుదుల్ని, పాట‌ల్నీ వాడుకోవ‌డం... ఇలా ఎంత‌కాలం?
- చిరంజీవిగారు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు.. ఆకాశం అంత ఇమేజ్ సంపాదించుకొన్న హీరోలు. వాళ్ల పేరు చెబితే చాలు థియేట‌ర్లో పూన‌కం వ‌చ్చేస్తుంది. అదృష్టం కొద్దీ నాకూ వాళ్ల పోలిక‌లు వ‌చ్చాయి. నేను స్టెప్పులేసినా, డైలాగ్ చెప్పినా మావయ్య‌ల‌నే గుర్తు చేసుకొంటారు. అందుకే...నేనూ కంటిన్యూ చేస్తున్నా.  

* ఇంత‌కీ సుప్రీమ్ రిజ‌ల్ట్ ఏంటి?
-  విడుద‌లైన రోజే సంధ్య థియేటర్లో అభిమానుల‌తో క‌ల‌సి ఈ సినిమా చూశా. వాళ్ల రెస్పాన్స్ చూస్తుంటే.. - ఇందుకే క‌దా ఇంత‌క‌ష్ట‌ప‌డింది అనిపిస్తోంది. ఈ విజిల్స్‌, గోల‌... వాటి కోసం ఎంతైనా చేయొచ్చు.

* ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల‌తో పోలిస్తే... సుప్రీమ్ ఎలా డిఫ‌రెంట్‌గా అనిపించింది?
- నా కెరీర్‌లో ఇదే పూర్తిస్థాయి క‌మ‌ర్షియ‌ల్ సినిమా అనిపించింది. క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేస్తే వ‌చ్చే కిక్ ఎలా ఉంటుందో అర్థ‌మైంది.

* క‌మ‌ర్షియ‌ల్ హీరో అయిపోయిన‌ట్టేనా?
- అది ఒక్క సినిమాతో వ‌చ్చేయ‌దు. క‌ష్ట‌ప‌డుతూ ప‌డుతూ ఉండాలి. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంటే అనుకొన్నంత సుల‌భం కాదు. బాధ్య‌త‌లు పెరుగుతాయి. ఫైట్లు, డాన్సులు వీటిలో లోటు రాకూడ‌దు. రెట్టింపు వినోదం అందించాలి. దాంతో పాటు క‌థ‌లో కొత్త పాయింట్ ఉండాలి. ఇవ‌న్నీ చూసుకోవాల్సిందే. వేటిలో తేడా వ‌చ్చినా.. ఫ‌లితం మారిపోతుంది.

* సినిమా విడుద‌ల‌య్యాక ఫ‌లితం ఎలా ఉంటుందా అన్న టెన్ష‌న్ ఉంటుందా?
- ఎందుకుండ‌దండీ. భ‌లేవారే. కాక‌పోతే ఇది వ‌ర‌కు కాస్త ఎక్కువ‌గా ఆలోచించేవాడ్ని. ఇప్పుడు కాస్త త‌గ్గింది. ఫ‌లితం అన్న‌ది మ‌న చేతుల్లో ఉండ‌దు. దాన్ని ఆడియ‌న్స్‌కి వ‌దిలిపెట్టాల్సిందే.

* సినిమాల్లోకి వ‌చ్చాక మీలో మీరు గ‌మ‌నించిన మార్పు..
- ఓపిక పెరిగిందండీ. ఇది వ‌ర‌కు ఓ ప‌నిచేస్తే రిజ‌ల్ట్ వెంట‌నే వ‌చ్చేయాల్సిందే అనుకొనేవాడ్ని. స‌హ‌నంగా ఎదురుచూడాలి అన్న సంగ‌తి సినిమాల్లోకి వ‌చ్చాక అర్థ‌మైంది. 

* సెల‌బ్రెటీ అయిపోయాక గాసిప్పుల దాడి నుంచి త‌ప్పించుకోవ‌డం క‌ష్టం. అలాంటి వార్త‌ల్ని చ‌దివేట‌ప్పుడు ఏమ‌నిపిస్తుంది?
- ముందు చాలా సీరియ‌స్‌గా తీసుకొనేవాడ్ని. ఇప్పుడు అల‌వాటైపోయింది. నాకు పెళ్లి కుదిరింద‌ని, అమ్మాయిల‌తో డేటింగ్ చేస్తున్నాన‌ని ఏవేవో రాస్తున్నారు. నేను ఇష్ట‌ప‌డిన అమ్మాయిలంతా ఇప్పుడిప్పుడే ట‌చ్‌లోకి వ‌స్తున్నారు. ఎలా ఉన్నావ్‌?  ఏం చేస్తున్నావ్‌?  అంటూ ప‌ల‌క‌రిస్తున్నారు. ఇలాంటి వార్త‌ల వ‌ల్ల‌.. వాళ్లూ దూర‌మైపోతారేమో? (న‌వ్వుతూ)

* అది స‌రే... వ‌రుస‌గా దిల్‌రాజుగారి సినిమాలే చేస్తున్నారు రిజ‌న్ ఏంటి?
- ఆయ‌న పారితోషికం బాగా ఇస్తున్నారండీ. దానికి తోడు.. నాకు స‌రిప‌డే క‌థ‌లు వెదికి ప‌ట్టుకొస్తున్నారు. అందుకే న‌న్ను ఆయ‌న‌... ఆయ‌న్ని నేను వ‌ద‌ల్లేక‌పోతున్నాం.

* చిరంజీవి 150 వ సినిమా మొదలైంది. అందులో మీకూ ఛాన్సుందా?
- మావ‌య్య సినిమాలో ఒక్క ఫ్రేములో క‌నిపించినా ఆనంద‌మే. అందుకే నేను అప్లికేష‌న్ పెట్టేశా. చ‌ర‌ణ్ ఏం చేస్తాడో చూడాలి.

* క‌థానాయ‌కుడిగా ల‌క్ష్యాలేమైనా నిర్దేశించుకొన్నారా?
- నా స్ఫూర్తి చిరంజీవిగారే. చిన్న చిన్న పాత్ర‌లు చేసుకొంటూ మెగా స్టార్‌గా ఎదిగారు. నేనూ ఆయ‌న దారిలోనే న‌డుస్తా. 

* ఒకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ 

- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
supreme movie review