Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
who will get lucky chance with balayya

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌కి మరో యంగ్‌ విలన్‌

one more young villain comming to tollywood

ప్రస్తుతం యంగ్‌హీరోలు కొత్త కొత్తగా ఆలోచిస్తున్నారు. కేవలం హీరోలుగానే కాకుండా అమ్మాయిలు మెచ్చే విలన్లుగా కూడా మెప్పించడానికి ఆశక్తి చూపిస్తున్నారు. వారిలో మొదటి స్థానం ఆరడుగుల ఆజానుబాహుడు రానా. తాజాగా యంగ్‌ హీరో ఆది పినిశెట్టి 'సరైనోడు' సినిమాతో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అదే కోవలో మరో యంగ్‌ హీరో సుధీర్‌బాబు కూడా చేరిపోయాడు. బాలీవుడ్‌లో సుధీర్‌ నటించిన 'బాఘీ' చిత్రం విజయం సాధించింది. ఈ సినిమాలో సుధీర్‌ పాత్రకు మంచి రెస్పాన్స్‌ లభించింది. దాంతో అక్కడితో ఆగనంటున్నాడు ఈ కుర్రహీరో. తెలుగులో కూడా అవకాశమొస్తే విలన్‌గా నటించడానికి రెఢీ అంటున్నాడు.

అంతేకాదు ఒక పక్క హీరోగా నటిస్తూనే విలన్‌గా కూడా మెప్పిస్తానంటున్నాడు. త్వరలో బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ పుల్లెల గోపీచంద్‌ జీవిత కథ ఆధారంగా రూపొందబోతోన్న సినిమాలో సుధీర్‌ హీరోగా కన్పించబోతున్నాడు. సుధీర్‌కు బ్యాడ్మింటన్‌ క్రీడంటే చాలా ఇష్టం. అందుకే ఈ కథ వినగానే ఆ సినిమాలో నటించడానికి వెంటనే ఓకే చెప్పేశాడట. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌ పైకి వెళ్లనుంది. 'బాగీ' తర్వాత తెలుగులో సుధీర్‌బాబుని విలన్‌గా నటించమంటూ చాలామంది అడుగుతున్నారట. ఓ ప్రముఖ హీరో నటించే సినిమాలో సుధీర్‌బాబు విలన్‌గా నటించనున్నాడని సమాచారమ్‌. అది ఓకే అయితే టాలీవుడ్‌కి పదహారణాల అచ్చ తెలుగు హ్యాండ్సమ్‌ విలన్‌ దొరికినట్లే. 

మరిన్ని సినిమా కబుర్లు
sunil's heroin fixed for kollywood