Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
karthi comming as kashmora

ఈ సంచికలో >> సినిమా >>

బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన రెజీనా

rezina  entry in   tolly wood

అందాల తార రెజీనా తెలుగులో 'ఎస్సెమ్మెస్‌' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అందంతోనే కాదు అభినయంతోనూ ఆకట్టుకుంది ఈ సినిమాలో ముద్దుగుమ్మ రెజీనా. కెరీర్‌ స్లోగానే ఉన్నా, అడపాదడపా విజయాలతో అలా నెట్టుకొచ్చేస్తూ ఉంది. అవకాశాలు అయితే కొదవ లేదు. కానీ అమ్మడికి బెస్ట్‌ హీరోయిన్‌ ప్లేస్‌ మాత్రం దక్కడం లేదు. అయితే ప్రస్తుతం రెజీనా బాలీవుడ్‌లో ఏకంగా బిగ్‌బి అమితాబ్‌తో నటించే గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసింది. 'ఆంకేన్‌ 2' సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్‌తో పాటు, అనిల్‌ కపూర్‌, జాన్‌ అబ్రహాం తదితరులు నటిస్తున్నారు.

క్రైమ్‌, సస్పెన్స్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధానాంశంగా తెరకెక్కుతోంది ఈ సినిమా. బాలీవుడ్‌లో తొలి ఎంట్రీనే బిగ్‌బితో నటించే అవకాశం రావడం అంటే మాటలు కాదు. తెలుగులో నటన పరంగా మంచి నటి అన్పించున్న రెజీనా బాలీవుడ్‌లో కూడా నిలదొక్కుకుంటుందేమో చూడాలి. అనీజ్‌ బజ్మీ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్‌ మీట్‌లో రెజీనా హాట్‌ హాట్‌ అందాలతో అలరించింది. సినిమా ప్రమోషన్‌లోనే ఇంతలా ఉంటే, ఇక సినిమాలో రెజీనా అందాలకు బాలీవుడ్‌లో కేక పుట్టించడం ఖాయం అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. తెలుగులో నటిగా మంచి పేరు తెచ్చుకున్న రెజినా, అందాల విందులో కూడా ఏమాత్రం తగ్గలేదు. తమిళ సినిమాల్లో కూడా రెజినా నటించింది. ఇప్పుడు బాలీవుడ్‌లోకి అడుగు పెడుతోంది. మొత్తానికి రెజీనా బాలీవుడ్‌ ఎంట్రీకి సంతోషిస్తూ ఆమె నటిస్తోన్న ఈ సినిమా హిట్‌ అవ్వాలని ఆశిద్దాం! 

మరిన్ని సినిమా కబుర్లు
megastar 15oth movie shooting speed up