'ఊపిరి' సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న కార్తీ ఇప్పుడు 'కాష్మోరా'గా వస్తున్నాడు. ఈ సినిమా కోసం కార్తీ డిఫరెంట్ లుక్ ట్రై చేశాడు. సినిమా కథ కూడా కొత్తగా ఉండడంతో కార్తీ ఈ సినిమాలో నటించేందుకు ఆశక్తి చూపించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదల అయ్యింది. ఆ లుక్‌లో కార్తీ ఒక పవర్ ఫుల్ యుద్ధ వీరుడిలా కనిపిస్తున్నాడు. నున్నటి గుండు, భారీ గెడ్డం, చేతిలో కత్తి, బళ్లాలతో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు.
కార్తీ ఇది నువ్వేనా అన్నట్లుగా ఉంది ఆ లుక్. కార్తీ న్యూలుక్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. గోకుల్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా తమిళ్, తెలుగు భాషల్లో విడుదల కానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని పీవీపీ సంస్థ విడుదల చేయనుంది. హారర్ అండ్ థ్రిల్లర్ నేపధ్యంలో సాగే ఈ సినిమాలో ముద్దుగుమ్మలు నయనతార, శ్రీదివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఫస్ట్‌లుక్‌తోనే ఇంత రెస్పాన్స్ అందుకుంటోన్న కార్తీ ఇక ట్రైలర్‌తో, సినిమాతో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తాడో. కార్తీ కెరీర్‌లో భారీ బడ్జెట్‌గా మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. కార్తీ ఈ సినిమాలో త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. మూడు పాత్రలూ ఒకదానికొకటి సంబంధం లేనివిగా ఉంటాయట. ఏ పాత్ర ఇచ్చినా అందులో జీవించే కార్తీ 'కాష్మోరా' సినిమాని ఇంకా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడని సమాచారమ్. కార్తీ నటన ఈ సినిమాలో నభూతో న భవిష్యతి అనే రేంజ్‌లో ఉంటుందంటున్నారు కోలీవుడ్ వర్గాలు.
|