Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చుట్టాలబ్బాయ్ చిత్రసమీక్ష

chuttalabbay movie review

చిత్రం: చుట్టాలబ్బాయి 
తారాగణం: ఆది, నమితా ప్రమోద్‌, సాయికుమార్‌, అశుతోష్‌ రాణా, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, బ్రహ్మానందం, కృష్ణభగవాన్‌, అభిమన్యుసింగ్‌, 
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌ 
సినిమాటోగ్రఫీ: ఎస్‌.అరుణ్‌కుమార్‌ 
నిర్మాతలు: రామ్‌ తలారి, వెంకట్‌ తాళ్ళూరి 
దర్శకత్వం: వీరభద్రమ్‌ 
విడుదల తేదీ: 19 ఆగస్ట్‌ 2016

క్లుప్తంగా చెప్పాలంటే

ఓ బ్యాంకులో రికవరీ ఏజెంటుగా పనిచేసే యంగ్‌ అండ్‌ డైనమిక్‌ కుర్రాడు బాబ్జీ (ఆది). మొండి బాకీల్ని వసూలు చేయడంలో బాబ్జీ దిట్ట. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు అయిన ఎసిపి (అభిమన్యుసింగ్‌) చెల్లెలు కావ్య (నమితా ప్రమోద్‌). అనుకోకుండా బాబ్జీ, కావ్య ఓ సందర్భంలో ఎసిపి దృష్టిలో పడతాడు. అప్పటికి బాబ్జీ, కావ్య మధ్య ఏ పరిచయమూ ఉండదు. కానీ వారిద్దరూ ప్రేమపక్షులన్న అనుమానంతో ఎసిపి, తన పోలీసు బలగాన్ని బాబ్జిపై, కావ్యలపై ప్రయోగిస్తాడు. ఇంకో వైపు మరో ముఠా కావ్య కోసం వెతుకుతుంటుంది. అనుకోని సందర్భంలో దొరబాబు (సాయికుమార్‌) మనుషులు బాబ్జీతోపాటు, కావ్యని కిడ్నాప్‌ చేస్తారు. దొరబాబు ఎవరు? ఎసిపి అనుమానం నిజమైందా? అనేది తెరపై చూడాలి.

మొత్తంగా చెప్పాలంటే

బాబ్జి పాత్రలో బాగానే చేశాడు ఆది. డాన్సుల్లో, యాక్షన్‌లో తన మార్క్‌ చూపించాడు. ఈజ్‌ ప్రదర్శించి ఆట్టుకున్నాడు. డైలాగ్‌ డెలివరీ, బాడీ లాంగ్వేజ్‌ అన్నీ బాగానే ఉన్నాయి. నమితా ప్రమోద్‌ గ్లామరస్‌గానే కనిపించింది. నటన పరంగా పెద్దగా ఆమె గురించి మాట్లాడుకోడానికి ఏమీ లేదు. జస్ట్‌ ఓకే అంతే.

పృధ్వీ తనదైన కామెడీతో మరోసారు సత్తా చాటాడు. దొరబాబు పాత్రలో సాయికుమార్‌ ఒదిగిపోయాడు. ఆది - సాయికుమార్‌ తండ్రీ కొడుకులు గనుక ఇద్దరి మధ్యా ఇంకా బలమైన సీన్లు ఉంటే బాగుండేదనిపిస్తుంది. విలన్‌ పాత్రధారుల్ని ఇంకా బాగా వాడుకుంటే బాగుండేది. అభిమన్యుసింగ్‌ వేస్టయ్యాడు. మిగతా పాత్రధారులంతా తమ పాత్ర పరిధి మేర బాగానే చేశారు.

దర్శకుడు రొటీన్‌ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకున్నాడు. ఎక్కడా రిస్క్‌ చేయలేదు. ఎంటర్‌టైన్‌మెంట్‌ని నమ్ముకుని, బలమైన ట్విస్టులు ఏవీ లేకుండా కానిచ్చేశాడు. ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్‌ వరకూ బాగానే ఉంటుంది. డైలాగ్స్‌ బాగానే ఉన్నాయి. సంగీతం ఓకే. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. నిర్మాణపు విలువలు బాగున్నాయి. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ అవసరం అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి అవసరమైనంత మేర ఉపయోగపడ్డాయి. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.

కమర్షియల్‌ ఎంటర్‌టైనర్స్‌తో హిట్లు కొట్టిన దర్శకుడే అయినా కొన్ని సినిమాలతో కాస్త నీరసించాడు వీరభద్రమ్‌. దాంతో ఈ సినిమాకి రిస్క్‌ చేయలేదు. తనకు తెలిసిన విద్యనే నమ్ముకున్నాడు. మేగ్జిమమ్‌ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్‌ చెయ్యాలనుకున్నాడు. పృధ్వీని బాగా వాడుకున్నాడు. ఎక్కువగా కామెడీ చుట్టూనే సినిమాని తిప్పేశాడు. ప్రథమార్థంలో దర్శకుడి స్ట్రాటజీ కుదిరిందిగానీ, సెకెండాఫ్‌లో కామెడీ తగ్గింది. ఇంటర్వెల్‌లో క్రియేట్‌ చేసిన హైప్‌ని, సెకెండాఫ్‌లో చల్లార్చేశాడు. ఓవరాల్‌గా సినిమా బాగానే అనిపిస్తుంటుంది. పైసా వసూల్‌ అని ఆడియన్స్‌ ఫీలయ్యేందుకు తగిన కంటెంట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ రూపంలో ఉంది. ఆది డాన్సులు, హీరోయిన్‌ గ్లామర్‌, కాసిన్ని నవ్వులు ఇవన్నీ సినిమా ఓకే అనిపిస్తాయి. ఈగోరెడ్డి పాత్రలో పృధ్వీ ఈ సినిమాకి పెద్ద ప్లస్‌.

ఒక్క మాటలో చెప్పాలంటే
చుట్టాలబ్బాయ్‌ ఫర్వాలేదండోయ్‌?

అంకెల్లో చెప్పాలంటే: < 3 / 5

మరిన్ని సినిమా కబుర్లు
nagachaitanya sung