Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sirasri question

ఈ సంచికలో >> శీర్షికలు >>

కోడి పలావ్ - బన్ను

కావలిసినపదార్ధాలు: చికెన్ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, బియ్యం, నూనె, లవంగాలు, యాలకులు, దాల్చినచెక్క, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పలావు ఆకు, కరివేపాకు, నిమ్మకాయ, 


తయారుచేసే విధానం : ముందుగా చికెన్ ముక్కలని నీళ్ళల్లో వేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఉడకబెట్టాలి. ఉడికిన తరువాత నీటిని తీసేసి వాటిని వేరేగా వుంచాలి. తరువాత బాణలిలో నూనె వేసి లవంగాలు, యాలకులు, పలావు  ఆకు, దాల్చినచెక్క, కరివేపాకు వేసి  ఉడకబెట్టిన చికెన్ ముక్కలను వేసి కలిపి బియ్యం , తగినన్ని నీళ్ళు పోసి పసుపు, ఉప్పు, కొద్దిగా నిమ్మకాయ రసం పిండి  మామూలుగా మనం అన్నం వండినట్టుగా మూత పెట్టేయాలి. అంతేనండీ. చాలా సులువుగా చికెన్ పలావు రెడీ..   

మరిన్ని శీర్షికలు
sravana sri