Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

మంజిమా మోహ‌న్‌ తో ఇంటర్వ్యూ

interview with manjima mohan
అలాంటి సినిమాల‌కు నేను ప‌నికిరాను! - మంజిమా మోహ‌న్‌
 
తెలుగు తెర ని వారానికి ఓ కొత్త‌మ్మాయి 'ఇదే నా మొద‌టి సినిమా' అంటూ ప‌రిచ‌యం చేసుకొంటుంటుంది.
అలా.. మంజిమా మోహ‌న్ కూడా డెబ్యూ ఇస్తోంది.
మామూలుగా అయితే మంజిమ‌ను గుంపులో గోవింద‌మ్మ అనుకొని కొట్టి పారేయొచ్చు. కాక‌పోతే ఇది గౌత‌మ్ మీన‌న్ సినిమా. ఆయ‌న హీరోయిన్ల‌ను ఎలా చూపిస్తారో తెలిసిందే క‌దా?  ఏమో ఆయ‌న్నుంచి మ‌రో స‌మంత రావొచ్చేమో.. అనే ఆశ‌లు చిగురిస్తుంటాయి. మంజిమ‌ని చూస్తుంటే అదే అనిపిస్తోంది. గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సాహ‌సం శ్వాస‌గా సాగిపో చిత్రంతో క‌థానాయిక‌గా తెలుగు తెర‌పైకొస్తోంది. ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌ల‌కు సిద్ద‌మైంది. ఈ సంద‌ర్భంగా మంజిమ‌తో గో తెలుగు చిట్ చాట్‌.
 
*  హాయ్ మంజిమ‌..
- హాయ్‌...
 
* తెలుగుతో ఓకేనా?
-  కొంచెం కొంచెం అర్థ‌మ‌వుతుంది. తెలుగులో స‌మాధానం ఇవ్వ‌లేనంతే.
 
* ఇంత త్వ‌ర‌గా తెలుగు అర్థం చేసుకోగ‌లిగారంటే గొప్ప విష‌య‌మే..
- అవునా..??  (న‌వ్వుతూ)  తెలుగు సినిమా చేస్తున్నా అన‌గానే ముందు చేసిన ప‌ని అదే. ఓ ట్యూట‌ర్‌ని పెట్టుకొన్నా. త‌న నాతో తెలుగులోనే మాట్లాడుతుంది. ముందు కొంచెం క‌ష్టం అనిపించినా.. ఒక్కో ప‌దానికీ అర్థం తెలుసుకోగ‌లిగా. ఇప్పుడు కంఫ‌ర్ట్‌గానే ఉంది. 
 
* గౌత‌మ్ మీన‌న్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ..  ఎప్పుడైనా క‌ల్లోనైనా ఊహించారా?
- మీరు చెబితే న‌మ్మ‌రు గానీ... 'గౌత‌మ్ మీన‌న్ సినిమాలో నేను హీరోయిన్ అయితే ఎలా ఉంటుంది' అని చాలాసార్లు ఊహ‌ల్లోకి వెళ్లిపోయేదాన్ని. ఎందుకంటే హీరోయిన్ల‌ను అందంగా చూపించడంలో ఆయ‌న మాస్ట‌ర్‌. నేను హీరోయిన్ అవుతాన‌ని తెలియ‌ని రోజుల్లోనే నా ఫ్రెండ్స్‌తో స‌ర‌దాగా అనేదాన్ని. ఇప్పుడు అదే నిజ‌మైపోయింది.  ఏమాయ చేసావే విడుద‌లైన కొత్త‌లో ఓ కేఫ్‌కి వెళ్లా. అక్క‌డ గౌత‌మ్‌సార్ అనుకోకుండా క‌నిపించారు. ఆయ‌న్ని చూసి... ఎంత మురిసిపోయానో. క‌ట్ చేస్తే.. ఆయ‌న సినిమాలో నేనే హీరోయిన్ అయిపోయా. నిజంగా చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది.
 
* ఈ సినిమాతో మ‌రో స‌మంత వ‌చ్చింద‌నుకోవ‌చ్చా..?
- అమ్మో.. స‌మంత‌తో నాకు పోలికా..?  మ‌రీ టూమ‌చ్‌గా ఉంటుంది. కాక‌పోతే.. గౌత‌మ్ సర్ సినిమాలో న‌టించ‌డ‌మే గొప్ప వ‌రం. అంత‌కు మించి ఏం కోరుకోవ‌డం లేదు.
 
* శింబు, నాగ‌చైత‌న్య వీళ్లిద్ద‌రితో ఒకేసారి క‌ల‌సి న‌టించారు క‌దా... వీళ్ల‌లో మీకు క‌నిపించిన ప్ర‌త్యేక ల‌క్ష‌ణాలేంటి?
- నాగ‌చైత‌న్య డౌన్ టూ ఎర్త్‌. చాలా పెద్ద ఫ్యామిలీ నుంచి వ‌చ్చారు. సెట్లో చాలా కూల్‌గా ఉంటారు. శింబు ఫైర్ బ్రాండ్‌.. హుషారుగా ఉంటారు. ఇద్ద‌రూ ఇద్ద‌రే.
 
* తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఒకేసారి తెర‌కెక్కిన సినిమా ఇది. ఒకే సీన్ రెండు సార్లు న‌టించ‌డం బోర్ కొట్ట‌లేదా?
- బోర్ ఏమీ లేదు. హీరో మారిపోతాడు, డైలాగులు మారిపోతాయి.. అక్క‌డ ఎమోష‌న్స్ కూడా మార‌తాయి. కాబ‌ట్టి.. బోర్ ఏమీ అనిపించ‌లేదు. అయితే ద్విభాషా చిత్రాల్లో న‌టించ‌డం అనుకొన్నంత సుల‌భం కాదు. క‌ష్ట‌ప‌డాల్సిందే. 
 
* ఇంత‌కీ ఇది లవ్ స్టోరీ?  యాక్ష‌న్ సినిమానా?
- రెండూ ఉంటాయి. ఫ‌స్ట్ ఆఫ్ అంతా ల‌వ్ స్టోరీ న‌డుస్తుంది. సెకండాఫ్‌లోయాక్ష‌న్ ఉంటుంది. అయితే ఆ యాక్ష‌న్ కూడా చాలా థ్రిల్లింగ్‌గా సాగుతుంది.
 
* తెలుగు సినిమాలు చూస్తున్నారా..?
- ఇప్పుడిప్పుడే చూడ‌డం మొద‌లెట్టా. ఈమ‌ధ్య విడుద‌లైన ప్ర‌తీ సినిమా చూశా. తెలుగులో స్టార్స్ చాలామంది ఉన్నారు. ఇక్క‌డి సినిమాలు వైవిధ‌ద్యంగా, భారీగా ఉంటాయి. నేనూ తెలుగు హీరోయిన్ అనిపించుకోవ‌డం గ‌ర్వంగా అనిపిస్తోంది.
 
* బాల‌న‌టిగా న‌టించిన అనుభ‌వం ఉంది క‌దా? ఆ అనుభ‌వం ప‌నికొచ్చిందా?
-  ఊహ తెలియ‌ని స‌మ‌యంలో కెమెరా ముందుకొచ్చా. 8 సినిమాల వ‌ర‌కూ న‌టించా. అయితే.. అప్ప‌ట్లో ఏం తెలిసేది కాదు. న‌ట‌న‌, కెమెరా, డైలాగులు వీటిపై దృష్టి ఉండేది కాదు. ఆ సినిమాల‌న్నీ ఇప్పుడు చూస్తే... న‌వ్వొస్తుంది.
 
* సినిమాల్లోకి వెళ్లానంటే, అందునా హీరోయిన్‌గా చేస్తానంటే ఇంట్లో వాళ్లు అభ్యంత‌రం చెప్ప‌లేదా?
- మానాన్న‌గారు కెమెరామెన్‌. ఆయ‌న‌కు సినిమా ప‌రిశ్ర‌మ గురించి బాగా తెలుసు. అందుక‌నేనేమో అడిగిన వెంట‌నే వ‌ద్దు అన్నారు. ఆ త‌ర‌వాత మెల్లిమెల్లిగా నా ఇష్టాన్ని అంగీక‌రించాల్సివ‌చ్చింది. అయితే కొన్ని కండీష‌న్స్ పెట్టారు..
 
* ఏమిటా కండీష‌న్స్‌..
- బీఎస్సీ మాథ్స్ చ‌దువుతున్నా. డిగ్రీ పూర్త‌యిన త‌ర‌వాత కూడా చ‌ద‌వాల్సిందే అన్నారు. నేనూ కూడా ఓకే అన్నా. కానీ సినిమాల్లోకి వ‌చ్చాక చ‌దువుపై మ‌న‌సు ల‌గ్నం చేయ‌లేక‌పోయా. ఇప్పుడు నా దృష్టంతా సినిమాల‌పైనే.
 
* సినిమా అంటే గ్లామ‌ర్ ఫీల్డ్‌. క‌థానాయిక‌లు ఈ విష‌యంలో కాస్త లిబ‌ల‌ర్‌గా ఉండాల్సిందేనా?
- సినిమా అంటే గ్లామ‌ర్ ఫీల్డే.. ఆ విష‌యం ఒప్పుకొంటా. అయితే కంప‌ల్స‌రీ గ్లామ‌ర్ పాత్ర‌లు చేయాల్సిందే అని రూల్ లేదు. ప‌ద్ద‌తిగా ఉన్నంత వ‌ర‌కూ నేనూ గ్లామ‌ర్‌గానే క‌నిపిస్తా. కేవ‌లం గ్లామ‌ర్ కోస‌మే హీరోయిన్ పాత్ర‌లు సృష్టిస్తే... అలాంటి సినిమాల‌కు నేను ప‌నికిరానేమో..?
 
* తెలుగులో ఎవ‌రితో న‌టించాల‌ని వుంది?
- ఆ పేర్లు చెబితే.. పెద్ద లిస్టే త‌యార‌వుతుంది. మెగా హీరోలంటే నాకు చాలా ఇష్టం. వాళ్లంద‌రితో న‌టించే అకాశం వ‌స్తే.. హ్యాపీ.
 
* త‌దుప‌రి సినిమా ఏమిటి?
- నాలుగు క‌థ‌లు విన్నా. అయితే ఏదీ ఫైన‌ల్ కాలేదు. త్వ‌ర‌లోనే కొత్త సినిమా ఏమిట‌న్న‌ది చెబుతా..
 
* ఓకే.. ఆల్ ద బెస్ట్‌
- థ్యాంక్యూ...  

-
కాత్యాయని 
 
మరిన్ని సినిమా కబుర్లు
sahasam svasagaa sagipo movie review