Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview with manjima mohan

ఈ సంచికలో >> సినిమా >>

సాహసం శ్వాసగా సాగిపో చిత్ర సమీక్ష

sahasam svasagaa sagipo movie review

చిత్రం: సాహసం శ్వాసగా సాగిపో 
తారాగణం: నాగచైతన్య, మంజిమ మోహన్‌, బాబా సెహగల్‌, రాకేందుమౌళి, సతీష్‌ కృష్ణన్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: డాన్‌ మెకార్థర్‌ 
నిర్మాణం : ద్వారక క్రియేషన్స్‌ 
నిర్మాత: మిర్యాల రవీందర్‌రెడ్డి 
దర్శకత్వం: గౌతమ్‌ మీనన్‌ 
సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌ 
విడుదల తేదీ: 11 నవంబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 
సరదా సరదాగా వుండే కుర్రాడు రజనీకాంత్‌ (నాగచైతన్య), తన సోదరి స్నేహితురాలు లీల (మంజిమ మోహన్‌)తో ప్రేమలో పడతాడు. ఇద్దరూ లాంగ్‌ డ్రైవ్‌కి వెళతారు. అనుకోకుండా ఆ డ్రైవ్‌లోనే వారు ప్రమాదానికి గురవుతారు. ఆ ప్రమాదం తర్వాత వారి జీవితాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటాయి. వారిని ఓ గ్యాంగ్‌ వెంటాడుతుంది. ఆ గ్యాంగ్‌ ఎవరు? ఆ గ్యాంగ్‌ బారి నుంచి ఈ జంట ఎలా తప్పించుకుంది? అనేది తెరపై చూడాల్సిందే. 

మొత్తంగా చెప్పాలంటే 

సినిమా సినిమాకీ మెచ్యూరిటీ లెవ్స్‌ పెంచుకుంటూ పోతున్నాడు నాగచైతన్య. రజనీకాంత్‌ పాత్రలో జీవించేశాడు. రొమాంటిక్‌, యాక్షన్‌ సన్నివేశాల్లో అదరగొట్టేశాడు. ఈ సినిమాకి నాగచైతన్య యాక్టింగ్‌ పెద్ద ప్లస్‌ పాయింట్‌. హీరోయిన్‌ మంజిమ మోహన్‌ అందంగానూ ఉంది, నటన కూడా బాగుంది. తెలుగు సినీ పరిశ్రమకు మరో అందమైన, మంచి నటి దొరికిందనే అనుకోవచ్చు. హీరో హీరోయిన్ల మధ్య ఇలాంటి సినిమాల్లో కెమిస్ట్రీ ముఖ్యం. అది బాగా పండింది. 

మిగతా పాత్రల విషయానికొస్తే, బాబా సెహగల్‌ విలన్‌గా డిఫరెంట్‌ పాత్రలో కనిపించి మెప్పించాడు, రాకేందు మౌళి ఓకే. మిగతా పాత్రలంతా తమ పాత్ర పరిధి మేర మమ అనిపించేశారు. 

ఓ సాధారణ ప్రేమకథ, అందులో ఓ ట్విస్ట్‌ ఇలా సాగిపోతుంది కథ. కాస్త కొత్తగానే అనిపిస్తుంది. రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంలో కథ నడుస్తుండడం కొత్తగా అనిపించకుండా ఎలా ఉంటుంది? మాటలు బాగున్నాయి. స్క్రీన్‌ప్లే ఆకట్టుకుంటుంది. అక్కడక్కడా హిక్కప్స్‌ కనిపిస్తాయి. ఎడిటింగ్‌ ఓకే, అక్కడక్కడా ఇంకాస్త అవసరం అనిపిస్తుంది. పాటలు బాగున్నాయి, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ అలరిస్తుంది. తెరపై చూడ్డానికి కూడా పాటలు బాగున్నాయంటే అది సినిమాటోగ్రఫీ ప్రతిభే. సినిమా చాలా రిచ్‌గా కనిపించింది. కెమెరా డిపార్ట్‌మెంట్‌ సినిమాకి బాగా హెల్పయ్యింది. నిర్మాణపు విలువలు చాలా బాగున్నాయి. ఆర్ట్‌, కాస్ట్యూమ్స్‌ సినిమాకి అవసరమైన ఉపయోగపడ్డాయి. 

సరదా సరదాగా సాగిపోతున్న కథలోకి ఓ ట్విస్ట్‌ తీసుకురావడం, ఆ ట్విస్ట్‌ తర్వాత సినిమా యాక్షన్‌ మూడ్‌లోకి మారడం ఇదంతా ఇంట్రెస్టింగ్‌గానే అనిపిస్తుంది. సినిమాలో ప్రేక్షకులు లీనమయ్యేలా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. కావాల్సినంత రొమాన్స్‌, తగినంత ఎంటర్‌టైన్‌మెంట్‌, న్యూ మూడ్‌లోకి తీసుకెళ్ళే యాక్షన్‌ ఎపిసోడ్స్‌, వీటన్నిటికీ తోడు రోడ్‌ జర్నీ కాన్సెప్ట్‌ ఇవన్నీ యూత్‌ని బాగా అలరిస్తాయి. టార్గెట్‌ ఆడియన్స్‌ యూత్‌ కావడంతో సినిమా బాగానే కనెక్ట్‌ అవుతుంది. ఫస్టాఫ్‌, సెకెండాఫ్‌ రెండూ ఓకే. ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ బాగుంది. గౌతమ్‌ మీనన్‌ సినిమాల్లో కన్పించే డిఫరెంట్‌ యాక్షన్‌తోపాటు, డిఫరెంట్‌ ఫీల్‌ ఉన్న రొమాంటిక్‌ సన్నివేశాలకు కొదవ లేదు. నాగచైతన్య, మంజిమ మోహన్‌ కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. చివరి 15 నిమిషాలు ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉండడంతో సినిమా బాగుందనే మూడ్‌లో థియేటర్‌ నుంచి ఆడియన్స్‌ బయటకు రావొచ్చు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 

రొమాంటిక్‌గా కొంచెం యాక్షన్‌తో సాగిపో! 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
hrithik roshan balam  paublisity in tollywood