Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
green tea uses

ఈ సంచికలో >> శీర్షికలు >>

18-11-2016 నుండి 24-1-2016 వరకు వారఫలాలు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తంమీద తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తయి. పెద్దల నుండి ఆశించిన సహకారం రావడం వలన సంతోషాన్ని కలిగి ఉంటారు. నలుగురిలో చక్కటి గుర్తింపు లభిస్తుంది దూరప్రదేశ ప్రయాణాలు కలిసి వస్తాయి. క్రీడాకారులకు మంచి సమయం నూతన ఆలోచనలు చేయుట లాభిస్తుంది. సోదరులతో కలిసి చేసే పనులు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. సంతానపరమైన విషయాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుటకు అవకాశం ఉంది. వారిమూలన గౌరవం పెరుగుతుంది. భోజనం విషయంలో మాత్రం మీకంటూ ఒక ఇష్టాన్ని కలిగి ఉంటారు దానికి ప్రాధాన్యం ఇస్తారు.

 వృషభ రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో స్వల్ప మార్పులకు అవకాశం ఉంది. కుటుంబసభ్యుల నుండి వచ్చు సూచనల విషయంలో కాస్త తడబాటు ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులకు ఆస్కారం ఉంది కావున వేచిచూసే దొరని మంచిది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ప్రయాణాలకు అధికసమయం కేటాయిస్తారు. సంతానం విషయంలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో ఊహించని ఖర్చులను పొందుతారు. విందులలో పాల్గొనే అవకాశం ఉంది. గత కొంత కాలంగా ఎదురుచూస్తున్నా ఫలితాలు మీకు అనుకూలంగా రావడం మంచిది. తల్లి తరుపు బంధువుల నుండి ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్త. రుణపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి.

మిథున రాశి : ఈవారం మొత్తంమీద సమయానికి భోజనం చేయుట అలాగే ఆరోగ్యం విషయంలో మంచి శ్రద్దతీసుకోవడం అవసరం. ఊహించని ఖర్చులను పొందుతారు వాటిని తగ్గించుకొనే ప్రయత్నం చేయుట మేలు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు ఉంటాయి. పనులలో పనిభారం ఉంటుంది నిదానంగా వాటిని పూర్తిచేసే ప్రయత్నం చేయుట మేలు. పెట్టుబడులు అలాగే వ్యాపారపరమైన విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వలన లబ్దిని పొందుటకు అవకాశం కలదు. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకొనే ప్రయత్నం చేయుట మంచిది. అనవసరమైన విషయాల్లో తలదూర్చడం వలన మాటపడవలసి వస్తుంది జాగ్రత్త. కుటుంబసభ్యుల తీరు మిమ్మల్ని కాస్త ఆందోళనకు గురిచేసే అవకాశం ఉంది నిదానం అవసరం.

కర్కాటక రాశి :  ఈవారం మొత్తంమీద మీ ఆలోచనల్లో నూతన మార్పులకు ఆస్కారం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం కలదు,మిత్రులతో కలిసి నూతన పనులను చేపడుతారు. పెద్దలను కలుస్తారు వరితో కలిసి చర్చాసంబంధమైన విషయాలకు సమయం ఇస్తారు. కుటుంబంలో పెద్ద ఆలోచనలను గౌరవించుట అవసరం. ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం మీకు సంతోషాన్ని కలిగించే వార్తను వింటారు. కొత్తగా చేపట్టిన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. విదేశేప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ విషయంలో ఒక నిర్ణయానికి రావడం అన్నివిధాల మేలుచేస్తుంది ఆలోచన చేయుట మంచిది. కుటుంబంలో సభ్యుల నుండి సహకారం కోరుకుంటారు. వ్యాపారపరమైన విషయాలో మాత్రం కొంచం వెసలుబాటు లబిస్తుంది ఏది ఊరట నిచ్చే విషయం.

 సింహ రాశి : ఈవారం మొత్తంమీద అనుకున్నదే తడవుగా పనులను చేపట్టాలనే ఆలోచన కలిగి ఉంటారు. నలుగురిలో ఉన్నప్పుడు వారియొక్క ఆలోచనలకు అనుగుణంగా మెలగటం మూలాన అనుకోకుండా సహాయం అందే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మీ విధానాలు మిశ్రమఫలితాలను కలుగజేస్తాయి. కుటుంబంలో పెద్దల సహకారం లభిస్తుంది,వారినుండి ఆశించిన సహకారం లభిస్తుంది. సంతానపరమైన విషయాల్లో మార్పులను ఆశిస్తారు. మిత్రులతో కలిసి సమయాన్ని విందులలో గడుపుతారు. ఉద్యోగంలో మిశ్రమఫలితాలు పొందుతారు,కొంత వ్యతిరేకవర్గం మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించుట సూచన.

కన్యా రాశి : ఈవారం మొత్తంమీద కుటుంబంలో కీలకమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. చేపట్టిన పనులను ముందుగానే పూర్తిచేయుట వలన నలుగురిలో కొత్త గుర్తింపును పొందుతారు. స్త్రీ / పురుష సంబంధమైన విషయాల్లో నూతన నిర్ణయాలు వాయిదా వేయుట మేలు. ప్రయాణాలు ఫలితాలను ఇస్తాయి కాకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుట ఉత్తమం. మొండిఆలోచనలు చేయకండి అందరితో సరదాగా గడిపే ప్రయత్నం మేలుచేస్తుంది. సోదరిమూలన కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది కావున ఈ విషయంలో మీరుకూడా ద్వందవైకరి కలిగి ఉండుట మీకు అవసరం. ఉద్యోగప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం కలదు. కుటుంబంలో పెద్దలతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేస్తారు.

తులా రాశి : ఈవారం మొత్తంమీద ఆరంభంలో మాటపట్టింపులకు పోకండి. లేకపోతే అనవసరమైన ఇబ్బందులను తెచ్చుకొన్న వారు అవుతారు. ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. ఇష్టమైన వ్యక్తుల నుండి నుండి ఆశించిన సమాచారం రావడం వలన కొంత ఊరట చెందుతారు. స్వల్పప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది కొంత శారీరకపరమైన అలసటను కలిగి ఉంటారు. నూతన లావాదేవీల విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. నూతన ప్రయత్నాలు ఆరంభించుట కన్నా గతంలో చేపట్టిన పనులను పూర్తిచేసే ప్రయత్నం చేయుట అన్నివిధాల మంచిది. సోదరులకు అనుగుణంగా వ్యవహరించుట సూచన. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి ప్రయత్నం పెంచుట మంచిది

వృశ్చిక రాశి : ఈవారం మొత్తంమీద సంతానం విషయంలో కాస్త ఆందోళన చెందుతారు ఈ విషయంలో అనుభవజ్ఞుల సూచనల మేరనడుచుకోండి. చేపట్టిన పనులను నిదానంగా పూర్తిచేసే అవకాశం ఉంది. మిత్రుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ధనమునకు స్మబధించిన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. అనవసరమైన ఖర్చులు పెరుగుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో జీవితభాగస్వామి తో నూతన ఒప్పందాలు చేసుకొనే అవకాశం ఉంది. పూజల్లో పాల్గొనే ప్రయత్నం చేయండి. తండ్రితరుపు బంధువులతో సత్సంభందాలు కలిగి ఉండాలనే ప్రయత్నం మిశ్రమఫలితాలను ఇస్తుంది. ప్రయాణాలు వాయిదావేయుట అనేది సూచన. మాటతీరు విషయంలో కాస్త సర్దుబాటు అవసరం. 

ధనస్సు రాశి : ఈవారం మొత్తంమీద మీయొక్క మాటతీరు మూలాన తోటివారు ఇబ్బందులు పడకుండా చూసుకోవడం మంచిది. నూతన ప్రయత్నాల విషయంలో మాత్రం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు. చిననాటి మిత్రులను కల్సి నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది అలాగే నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ప్రణాళికా ప్రకారం ముందుకువెళ్ళుట వలన మేలుజరుగుతుంది. ఉద్యోగంలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఊహించని మార్పులకు అవకాశం ఇస్తాయి.  ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులు కలుగుటకు అవకాశం ఉంది. విలువైనవస్తువులను కొనుగోలు చేసుకొనే అవకాశం ఉంది ఈ విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదిమానసికపరంగా కొంత ఆందోళన తగ్గించుకొనే ప్రయత్నం చేయుట సూచన.

మకర రాశి : ఈవారం మొత్తంమీద బంధువర్గంతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం అనుభవజ్ఞుల సూచనల మేర నడుచుకోండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి సర్దుబాటు విధానం చాలావరకు మంచిది. ఊహించని ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు,చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వలన ఇబ్బందులు తొలగుతాయి. కుటుంబసభ్యుల నుండి మీరు ఆశించిన మేర సహాయసహకారాలు రాకపోవడం మూలాన కొంత అసంతృప్తిని కలిగి ఉండే అవకాశం కలదు. ఉద్యోగంలో చేపట్టిన ఆలోచనలు అధికారులకు అనుగుణంగా ఉండేలా చర్యలు తీసుకోవడం అలాగే తోటివారి కలుపుకొని వెళ్ళడం మంచిది. 

కుంభ రాశి : ఈవారం మొత్తంమీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. వీలైనంత వరకు వారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకొనుట మంచిది. తలపెట్టిన పనులలో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. పెద్దల నుండి ఊహించిన విధంగానే సహకారం రావడం మూలాన మరింత ఉత్సాహం పెరుగుతుంది. కుటుంభభాద్యతలు పెరుగుతాయి అలాగే మీవైన ఆలోచనలు కలిగి ఉండుట మంచిది. ఇష్టమైన పనులకు సమయం ఇస్తారు. ఆర్థికపరమైన విషయాల్లో బాగానే ఉంటుంది అదేవిధంగా ఖర్చులు కూడా మీ శక్తిని దాటిపోవుటకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణాలు సాధ్యమైనంత వరకు వాయిదావేయుట వలన మేలుజరుగుతుంది. దూరప్రదేశం నుండి వచ్చు వార్తలు మీలో కొత్త కొత్త సందేహాలను పెంచుటకు అవకాశం ఉంది.

మీన రాశి : ఈవారం మొత్తంమీద చర్చల విషయంలో నిదానం అవసరం. మీ విధానాలు తెలియజేయండి అంతే కాని పట్టుబట్టడం వలన నష్టపోయే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. సామజికరంగాలలో పాల్గొనాలనే మీ ఆలోచన మరింత బలపడుతుంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన గుర్తింపును పొందుతారు. మీయొక్క లాక్ష్యలను చేరుకొనే విధంగా కాస్త శ్రమించుట అవసరం. బంధుమిత్రుల నుండి నూతన విషయాలను తెలుస్కోనే ఆస్కారం కలదు.ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ద వద్దు తగిన జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయకండి సర్దుబాటు విధానం కలిగి ఉండుట మంచిది. ప్రయాణాలు చేస్తారు అందులో చిననాటి మిత్రులను కలిసే అవాకాశం ఉంది.      

 

టి. శ్రీకాంత్ 
వాగ్దేవిజ్యోతిషాలయం  
మరిన్ని శీర్షికలు
sahitee vanam