Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
gotelugu story reviews

ఈ సంచికలో >> శీర్షికలు >>

శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి కధ "ఆఖరు మాట" సమీక్ష - అంబడిపూడి శ్యామసుందర రావు

akarumata story review

మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి పేరు చెప్పగానే మనకు గుర్తుకు వచ్చేది  "బారిష్టర్ పార్వతీశము"  నవల.  హాస్య కధ వ్రాయటం కన్నా హాస్య నవల  ఆద్యంతము పాఠకులను హాస్య రసములో ఓలలాడించే రచన చేయటము బహు కష్టమైనా పని. తెలుగు సాహిత్యములో రచయితలలో "హాస్య త్రయము" గా పేరుతెచ్చుకున్న వారు శ్రీ పానుగంటి లక్ష్మీ నరసింహం .శ్రీ చిలకమర్తి లక్ష్మి నరసింహం . శ్రీ
మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు.  వీరి కంఠా భరణము, గణపతి,బారిష్టర్ పార్వతీశాము నవలలు నేటికీ ప్రముఖ హాస్య నవలలుగా తెలుగు పాఠకుల మన్ననలు పొందుతు చదవబడుతున్నాయి. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు 1892లో తూర్పు గోదావరిజిల్లాలోని గండ్రేడు అనే గ్రామములో జన్మించి బందరులో  విద్యాభ్యాసము పూర్తిచేసి ఎడింబర్రో విశ్వవిద్యాల యము లో వ్యవసాయ శాస్త్రములో అధ్యానము చేసి వచ్చారు. నవలలు, కధలు, ఏకాంకికలు ,రేడియో నాటకాలు రచించారు హాస్య రసము గురించి పెద్ద గ్రంధమే చేసినారు. హాస్య రచనలకు ప్రసిద్ధి చెందిన మొక్కపాటి నరసింహ శాస్త్రిగారు ఈ కధలో హాస్యము ఏమి లేకుండా చాలా ప్రత్యేకమైన పద్దతిలో ఆత్మహత్య చేసుకొబోయే
ముందు ఒక పెద్ద మనిషి తన కొడుకు కు ఉత్తరము ద్వారా తెలిపే ఆఖరు మాటలు ఈ కధలో రచయితా వివరిస్తాడు ఎక్కడ అయన హాస్యానికి తావు లేకుండా చాలా సీరియస్ గా జరిగే కధ  ఇది. ఈ కధలో ఆత్మహత్య  చేసుకోబోయే వ్యక్తి తన జీవితకాలంలో
చాలా ధైర్యముగా ఏ మాత్రము పాపభీతి లేకుండా పశ్చాత్తాపము పడకుండా  చేసిన అన్యాయాలను అక్రమాలను, ఆ తరువాత అప్రయత్నముగా అనాలోచితముగా చేసిన రెండు  పనులను అవి ఈవిధముగా తనను ఆత్మహత్యకు పురిగొల్పినాయో  తన కొడుకుకు
వివరిస్తాడు ఈ కధలో ఆఖరు మాట చెప్పే వ్యక్తి పార్ధసారధి నాయుడు ఒక ప్రముఖ వ్యక్తి త్వరలోనే ప్రభుత్వము వారి నుండి "సర్ "బిరుదును పొందబోయే వ్యక్తి. అదికాక ఈ సారి ఎన్నికలలో తనకు మంత్రి పదవి తప్పదని పార్టీ వారు ఏకగ్రీవంగా అంటున్నారు. అదికాక పోతే మేయర్ గా ఎన్నిక అవటానికి అవకాశాలు లేకపోలేదు.  

ఇంతకాలము ఉండి  తన కోర్కెలుకొద్దొగొప్పో సిద్దించే సమయానికి తాను ప్రాణ త్యాగము చేయవలసి వస్తున్నందుకు కొంచెము భాధ  పడుతున్నాడు పార్ధసారధి నాయుడు. కొంచము సేపుటికి అవే  తీరుతాయి అని నిర్ణయించుకున్నాడు. తన కడసారి ప్రయాణానికి అన్ని సిద్దము  చేసుకున్నాడు. ఈ అవతారము చాలించాలి అని నిశ్చయించుకున్నాక భయము గియము అన్ని పోయినాయి ప్రస్తుతము అధైర్యము కానీ బెంగ కానీ  ఏమీలేవు. రాత్రి రెండు అయింది.వాతావరణము తన్ను సంతోషముతో  సాగనంపుతున్నట్లుగా అనిపించింది. తన కాగితాలు రికార్డులు అన్ని  జాగ్రత్త పెట్టాడు.  ఉత్తరాలు అన్ని వ్రాసాడు.కానీ ఇంకా ఆఖరు ఉత్తరము కొడుక్కురాయటానికి' చేతులు రావటంలేదు. పంచప్రాణాలు వాడిమీదే పెట్టుకొని వాడిని మహా మహుణ్ణి చేద్దామనుకొని వాడిలో అనేక అశలు, వాంఛలు కల్పించి ఇప్పుడవన్నీ మట్టిలో కలిపి వాడిని ఫకీరును చేసి పోతూ ఏమిరాయాలా  ఆని కొంచెము సందేహించాడు కానీ రాయక తప్పదుకదా అని ఆరంభించాడు.  ఆత్మ హత్య చేసుకోవటము చాలా కష్టమే కానీ బ్రతుకు కంటే చావే సులభంగా తోచినప్పుడు ఇంక చెయ్యతగినది ఏమున్నది ,పిరికితనమే కావచ్చు ,ఈ కర్మ ఫలము ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదు అని అంటారు. ఈ అస్తి అంతా నా చేతులతో సంపాదించాను నా చేతులతోనే తగలేసాను కానీ ఇక విషయము అప్పుడు ఎవరు చెప్పిన ఒప్పు కోలేదు కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పదు. అది ఏమిటి అంటే  న్యాయముగా సంపాదించినది ఏది నిలవదు. ఎంతోమంది కూలినాలి చేసుకొనే వాళ్ళు తిండి మానుకొని కూడబెట్టిన సొమ్మును నన్ను నమ్మి ఎదో వడ్డీ వస్తుందని నా దగ్గర దాస్తే నేను వాటిని కాజేసాను ఏ కోర్టు నన్ను శిక్షించలేదు కానీ ఇంతమంది ఉసురు తగలకుండా పోతుందా?

న్యాయము విచారించి శిక్షించగలిగే సాహసమైన ప్రభువే ఉంటె ఈ విధముగా అన్యాయముగా సంపాదించిన ధనికులలో ఎంతమంది ద్వీపాంతర వాసమనుభవిస్తుందురో కదా. కానీ ధనికుల బదులు ఈ శిక్షలన్నీనిరుపేదలు అనుభవిస్తున్నారు. ధనార్జన చేయాలనీ బుద్ధి  పుట్టినప్పుడు మంచి చెడ్డ ఉచ్చ నీచ అనే ఆలోచన లేకుండా సంపాదించాను స్త్రీ వాంఛ కలిగినప్పుడు రకముగా నైనా అనుభవించాను. పుణ్యమో  పాపమో వాటి ఫలితాలునేను అనుభవించి ఎరుగను ఇక ముందు అనుభవిస్తాను అనే నమ్మకము నాకు లేదు. చేసిన తప్పులన్నీ తెలిసి చేసినవే అందువల్ల పశ్చాత్తాపము అనే మాట నేను ఎరుగను .కానీ అప్రయత్నముగా అనాలోచితముగా చేసిన
రెండు పనులకు మాత్రము నాటి నుంచి విచారిస్తున్నాను భయపడుతున్నాను. శాపమన్నా పాపమన్నానమ్మకము లేనినాకు శాపభీతి పాప భీతి కలిగించాయి. 

ఇన్నాళ్లు ఈ ప్రస్తావన ఎవరి దగ్గరా తేలేదు కానీ ఆఖరు క్షణములో నీతో చెపితే కొంత హృదయ భారము తీరడమే కాకుండా నీ ముందు జాగ్రత్తకు కొంత ఉపయోగముగా ఉంటుందన్న నా నమ్మకము. కొన్నాళ్ళ క్రితము మన ఇంట్లో దొగతనము జరిగి దాదాపు పదివేల రూపాయల విలువైన వస్తువులు దోచుకెళ్లారు. నాటికి నేటికీ ఆ వస్తువుల జాడగాని దొంగల జాడగాని తెలియదు. మన ఇంటికి ఎదురుగా మర్రి చెట్టు క్రింద  ఒక నిరుపేద కుటుంబము ఉండేది వాళ్ళు ఎన్నాళ్ళనుంచి అక్కడ ఉంటున్నారో ఏమిచేస్తున్నారో ఎలా
బ్రతుకుతున్నారో నేను ఏనాడు పట్టించుకోలేదు కానీ మన ఇంట్లో దొంగతనము తరువాత నా అనుమానము వాళ్ళమీదకు పోవటము  పోలీసులకు చెప్పటం జరిగింది పోలీసులు చెట్టుక్రింది వాడి సంసారాన్ని అంటే కుండలు,మూకుళ్ళు సీనారేకు గొట్టాలు అన్ని క్షుణ్ణముగా వెతికారు వాడి దురదృష్టము,నా దురదృష్టము కొద్దీ వాడి సామాన్లలో ఒక రవ్వల దిద్దు ,రెండు రవ్వల ఉంగరాలు దొరికాయి ఇంకేముంది వాడిని పోలీసులు లాకెళ్లి కుళ్లబొడిచారు. వాడేమో  అవి, "నాకు దొరికాయి ఎవరివో తెలియదు నేను దొంగతనము చేయలేదు", అని మొత్తుకున్నా పేదవాడి మాటలు వినేది ఎవరు పోలీసుల దెబ్బల ధాటికి వాడి లోపలి అవయవాలు దెబ్బతిని అనారోగ్యము పాలు అయినాడు కోర్టు కేస్ పుణ్యామా అని చేయని దొంగతనానికి రెండేళ్లు జైలు శిక్ష పడింది జైలులో ఉన్న వాడికి సరిగా వైద్యము అందక జైలులో నానా ఇబ్బందులు పడి కొనఊపిరితో బయటకు వచ్చాడని తెలిసింది ఈ లోపు వాడి పెళ్ళాము పిల్లలు వేరోచోటికి మకాము మార్చారని తెలిసింది  నేను వాళ్ళ సంగతి పూర్తిగా మరచిపోయాను. 

ఒకసారి బజారులో వస్తువులు కొనుక్కుని కారు దగ్గరకు వస్తుంటే వీధుల్లో తిరిగే  ముగ్గురు ఒక బొచ్చె పట్టుకొని వాళ్ళ మనిషి ఒకడు చనిపోయాడని దహనము చేయటానికి  డబ్బులు ధర్మమూ చేయమని అడిగారు. ముష్టి ఎత్తుకోవటానికి ఇదొక  మార్గము అని కసురుకొని పొమ్మన్నాను ఇట్లాటి దొంగవేషాలు వేస్తే పోలీసులకు పట్టిస్తానని కేకలు వేసాను. వాళ్లలో ఒకడు ,"ఏంటండీ ఒక ప్రక్క చనిపోయిన వ్యక్తి అంత్యక్రియలకు మేము అడుక్కుంటే మీరు పోలీసులకు పట్టిస్తామంటారు మాకేమన్న భయమా పిలవండి పోలీసులను ", అని గట్టిగా మాట్లాడే సరికి తప్పదనుకొని జేబులోనుంచి పది రూపాయలు తీసి ఇవ్వబోయినాను ఇంతలో జుట్టు విరబోసుకున్న ఒక ఆడమనిషి వచ్చి నన్ను చూసి ,"వీడే నా మొగుడి  చావుకు, మేము రోడ్డుమీద పడటానికి కారణము మా ఉసురు ఊరికే  పోదు వీడు వీడి   సంసారము నాశనము అవుతారు వీడి డబ్బులు తీసుకోవద్దు ", అని తిట్లు శాపనార్ధాలు పెడుతూ  ఇద్దామనుకున్నా పదిరూపాయలను లాక్కుని నామొహానా కొట్టింది. అర్ధమయింది ఆవ్యక్తి ఎవరోనేను జైలుకు  పంపిన వాడి భార్య అని.  చుట్టూ జేరిన జనము మహా బాగా అయిందిలే అన్నట్టు చూస్తున్నారు ఇంతలో పోలీసులు  జనాన్ని పంపించారు అప్పుడు ఆ ఆడమనిషి శాపనార్ధాలు నాకు తగిలి తీరుతాయని అనిపించింది. ఇంక రెండో విషయము ముక్కొటి ఏకాదశి నాడు పార్ధసారధి గుడికి   వెళ్లాను గుడికి వెళ్ళింది దేవుడి మీద భక్తితో కాదని వేరే చెప్పనవసరము లేదనుకుంటా  దీపపు వెలుగుల్లో ఆ స్త్రీ సమూహాలు వారి శరీర కాంతులు  ,ప్రయత్నముగానో  అప్రయత్నముగానో లభించే స్త్రీ స్పర్శ వల్ల   కలిగే ఆనందము   కోసము గుడికి వెళ్ళాను. రాత్రి ఒంటి గంట సమయములో ఇంటిదారి పట్టే టప్పుడు ఒక ఆడమనిషిని ఏడిపిస్తూ కొంత మంది కుర్రాళ్ళు కనిపించారు. నేను పోలీసులను పిలుస్తానని వాళ్ళను భయపెట్టి పంపించివేసాను. ఆ  ఇరవై సంవత్సరాల వయస్సు ఉండవచ్చు బహు  చక్కనిది. ఆమెను ఓదార్చి అమ్మాయి విషయాలు అడిగాను  బ్రాహ్మణ బాలికనని గోదావరి జిల్లా నుంచి  చుట్టాల ఇంటికి  వచ్చి వాళ్ళతో పాటు ఉత్సవాలు  చూడటానికి వచ్చి జనసమూహములో దారితప్పానని దేవుడల్లే  ఆదుకున్నానని కళ్లనీళ్లు పెట్టుకుంది ఇంటికి దారికూడా తెలియదని వాపోయింది. సరే కాసేపు ఓదార్చి వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతానని చెప్పి కారులో ఎక్కించుకున్నాను .నా కామాగ్నికి తగ్గ ఆహుతి దొరికిందన్న ఆనందముతో ఉన్నా ఎప్పుడు అనుభవిద్దామా అన్న ఆలోచనలలో ఉండి కారును సముద్ర తీరాన ఆపాను ఆ  ఎందుకు ఆపారు అని అడిగితె చల్లగాలికి అని చెప్పానుపాపము అమాయకురాలు నమ్మింది. ప్రక్కన కూర్చుని చేయి పట్టుకున్నాను అరవబోయింది రెండవ చేత్తో నోరు మూసాను 

"మీరు  తండ్రి లాంటి వారని నమ్మి  వస్తే మీరు నన్ను బలాత్కారానికి ప్రయత్నిస్తున్నారు మీకిది తగదు" అని ఆ అమ్మాయి ప్రాధేయ పడింది. నిర్ఘాంతపోయింది . ఆ అమ్మాయి చుసిన చూపుకు వేరే వాళ్ళు అయితే ఆ ప్రయత్నము విరమించుకొనేవారు  కానీ నేను ఆప్పుడు న్యాయా న్యాయ విచక్షణ కోల్పోయి ఆ అమ్మాయిని బలాత్కారము చేశాను గత్యంతరము లేక  నాకు శరీరము అప్పగించిందని
అనుకున్నాను కానీ నాచేతుల్లో నుంచి  ఆమె శరీరము జారిపోవటం మొదలైంది క్రింద పడుకోబెట్టి  గమనిస్తే శరీరము చల్ల బడటాన్ని బట్టి ఆమె చనిపోయిందని అర్ధము చేసుకున్నాను.  పాపభీతి  భయము నన్ను ఆవరించాయి ఆ శవాన్నిఎవరికంటా బడకుండా ఎలా మాయము చేయాలి అన్న ఆలోచనలో పడ్డాను శవాన్ని కారులో కొంత దూరము  తీసుకెళ్ళి సముద్రములో పడవేశాను  కానీ ఆ అమ్మాయి కడసారి చుసిన చూపులు నన్ను ఈ క్షణము వరకు వెంటాడుతూనే ఉన్నాయి  ఆ పాపానికి తగ్గ ప్రాయశ్చిత్తము అనుభవించేంత వరకు ఆ చూపులు నన్ను వెంటాడుతూనే ఉంటాయి  కారెక్కిన నేను ఎటుపోతున్నానో ఏమి చేస్తున్నానో తెలియని స్థితిలో
బెంగుళూరులోని మన  ఇంటికి చేరాను .

ఆ తరువాత ఒక నెల రోజుల పాటు ఒళ్ళు తెలియని  జ్వరము ,హాఠాత్తుగా వృద్ధాప్యపు ఛాయలు కనిపించటము ,20రోజుల తరువాత డాక్టర్లు ప్రాణభయము లేదని చెప్పినా తీవ్ర ఆలోచనల వల్ల నెర్వస్ బ్రేక్ డవున్ అని తేల్చారు దేశాటనము చేస్తే  మనస్సుకు శాంతి దొరొకవచ్చని డాక్టర్లు సలహా ఇచ్చారు అయినా ఫలితము ఏమి లేదు. ఇంకా నీతో  చెప్పవలసినది, అప్పజెప్పవలసిన  ఆస్తులు ఏమి లేవు నేను విపరీతముగా డబ్బు  సంపాదించాలని,  నిన్ను ఎదో ఒక ఉన్నత స్థానములో ఉంచాలని నాకు కోరికలు ఉండెవీ , వాటిలో  ఏది పూర్తిగా చేయలేక పోయానన్న దిగులు కొంత ఉండేది ,ఇప్పుడు ఆ దిగులు కూడా లేదు. నేను ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నాక  నా అభిప్రాయాలలో చాలా మార్పు వచ్చింది ఇప్పటివరకు ప్రధానమనుకున్నవి అప్రధానముగా అనిపిస్తున్నాయి. నీకు తత్వోపదేశము చేద్దామని నా ఉద్దేశ్యము కాదు, నా పెద్దవాళ్ళు చెప్పిన మాటలు నేను విన్నానా  నీవు నా మాటలు వినడానికి . ఇదివరకెప్పుడు ఈ రహస్యాలను ఎవరితో ముఖ్యముగా నీతో చెప్పటానికి చాలా సిగ్గు పడ్డాను,ఇప్పుడు చెప్పకుండా ప్రాణము విడవ లేకపోతున్నాను ఇంక ఎవరు  నన్ను ఏమనుకున్నా ఈ దూషణ భూషణ తిరస్కారాలు అందని చోటుకు వెళ్ళిపోతున్నాను కాబట్టి నాకు విచారము లేదు ధన మదంతో ఒక దరిద్రుడి చావుకు,కామాంధతతో ఒక అమాయకురాలైన స్త్రీ చావుకు కారణము అయినాను ఇంతకంటే ఈ జీవితములో దుర్మార్గము ఏమి చేయాలి. ఇటువంటి రెండు మహా అపరాధాలు నీవు నీ జీవితములో చేయకూడదని నా తుది కోరిక .ఈ విధముగా ఉత్తరము ముగించిన పార్ధసారధి నాయుడు ఉత్తరాన్ని అంటించి బల్లమీద పెట్టి కడసారి ఇల్లంతా తిరిగి జేబులోని మాత్ర నోట్లో వేసుకొని కాసిని నీళ్లు త్రాగి మంచము మీద పడుకొని ఆఖరు నిద్రకు ఉపక్రమించాడు .

మరిన్ని శీర్షికలు
how to protectect kidney