Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
bujjeemaa.. got lucky chance

ఈ సంచికలో >> సినిమా >>

ఐటెం వేసుకున్న నరేష్‌ హీరోయిన్‌

sakshi chowdary ready to item song

నరేష్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు చిత్రాల్లో నటించింది ముద్దుగుమ్మ సాక్షి చౌదరి. 'జేమ్‌ బాండ్‌ నేను కాదు నా పెళ్లాం', సెల్ఫీరాజా చిత్రాల్లో హాట్‌ హాట్‌ అందాలతో అలరించింది. మంచు మనోజ్‌తో 'ప్యార్‌ మే పడిపోయామే' అంటూ పాటందుకుంది 'పోటుగాడు' సినిమాలో. ఇప్పుడు గోపీచంద్‌తో రొమాన్స్‌ చేస్తూ స్టెప్పులు ఇరగదీస్తోంది. ఎం.ఎం.జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఆక్సిజన్‌' సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఐటెం సాంగ్‌లో మెరిసింది. హైద్రాబాద్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ సినిమాలో ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. 'మజ్ను' ఫేం అను ఇమ్మాన్యుయేల్‌: మరో హీరోయిన్‌గా నటిస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది.

యాక్షన్‌ హీరో గోపీచంద్‌ కటౌట్‌కి తగ్గట్లుగా ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ దుమ్ము రేపనున్నాయట. ప్రముఖ స్టంట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్స్‌ డైరెక్షన్‌లో అబ్బురపరిచే యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తున్నారట. విలన్‌గా ఎంట్రీ ఇచ్చి హీరోగా సెటిలైన హ్యాండ్‌సమ్‌ గోపీచంద్‌ కెరీర్‌లోనే ఈ సినిమా డిఫరెంట్‌ మూవీగా రూపొందనుంది. యాక్షన్‌తో పాటు, సైంటిఫిక్‌ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఈ సినిమాలో కీలకం. ఇవి కాక బి.గోపాల్‌తో గోపీచంద్‌ 'బలం' చిత్రంలోనూ నటిస్తున్నారు. సీనియర్‌ ముద్దుగుమ్మ నయనతార ఈ సినిమాలో గోపీచంద్‌తో జోడీ కడుతోంది. ఈ సినిమా త్వరలోనే విడుదలకు రెడీగా ఉంది. 

మరిన్ని సినిమా కబుర్లు
namdita sweta enter in mega compound