Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sakshi chowdary ready to item song

ఈ సంచికలో >> సినిమా >>

చిన్నదానిపై కన్నేసిన బన్నీ

namdita sweta enter in mega compound

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమాలో హీరోయిన్‌గా నటించింది ముద్దుగుమ్మ నందితా శ్వేతా. తొలి సినిమాతోనే టాలీవుడ్‌లో మార్కులు కొట్టేసింది. తన నటనతో అందర్నీ ఎట్రాక్ట్‌ చేస్తోంది. ఈ సినిమాని చూసిన అల్లు అర్జున్‌ కూడా ఆమె నటనకి ఫిదా అయిపోయి ఆమెకి ఫోన్‌ చేసి టాలీవుడ్‌కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పాడట. దాంతో ఈ ముద్దుగుమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఏకంగా మెగా హీరోనే ఇంప్రెస్‌ చేసేసింది ఈ ముద్దుగుమ్మ. అంటే త్వరలోనే మెగా కాంపౌండ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చేలానే ఉంది. ఇప్పటికే అల్లు శిరీష్‌, వి.ఐ.ఆనంద్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట. ఆ సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఛాన్స్‌ కొట్టేసిందని సమాచారమ్‌.

ఒక్కసారి మెగా కాంపౌండ్‌లో అడుగు పెడితే అది బంగారమే. వరుస పెట్టి మెగా హీరోలు అందర్నీ చుట్టేయ్యెచ్చు. మరి ఈ ముద్దుగుమ్మ లక్‌ ఎలా ఉందో చూడాలి. ఫస్ట్‌ ఇంప్రెషన్‌ ఈజ్‌ ద బెస్ట్‌ ఇంప్రెషన్‌ అన్నట్లుగా ఫస్ట్‌ ఫస్టే బన్నీ దృష్టిలో పడింది. ఇక్కడే సగం లక్‌ అమ్మడిని వరించేసినట్లే. తమిళంలో చాలా సినిమాలు చేసిన ఎక్స్‌పీరియన్స్‌ ఉంది ఈ ముద్దుగుమ్మకి. తొలి సినిమాతోనే తెలుగు ఆడియన్స్‌నీ ఎట్రాక్ట్‌ చేసింది. అందంతో పాటు చలాకీతనం కూడా ఉంది ఈ భామలో. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ఇంతకన్నా కావల్సిందేముంది. హీరోయిన్‌గా దూసుకుపోవాల్సిన లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి అమ్మడికి. మరింకేం జోరుగా రేస్‌లో నిలబడడమే తరువాయి. నిలదొక్కుకుందా ఇక అంతే. ఇప్పుడు టాలీవుడ్‌లో హవా చూపుతోన్న ముద్దుగుమ్మలందరికీ గట్టి పోటీనే ఇవ్వగలదు ఈ చిన్నది. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam