Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
intreview with  d. suresh babu

ఈ సంచికలో >> సినిమా >>

అప్పట్లో ఒకడుండేవాడు చిత్రసమీక్ష

appatlo okadundevadumovie review

చిత్రం: అప్పట్లో ఒకడుండేవాడు 
తారాగణం: నారా రోహిత్‌, శ్రీవిష్ణు, తాన్యా హోప్‌, బ్రహ్మాజీ, రాజీవ్‌ కనకాల, ప్రభాస్‌ శ్రీను, జీవీ, సత్యదేవ్‌ తదితరులు. 
సినిమాటోగ్రఫీ: నవీన్‌ యాదవ్‌ 
నిర్మాణం: అరుణ్‌ మీడియా వర్క్స్‌ 
నిర్మాత: ప్రశాంతి, కృష్ణ విజయ్‌ 
దర్శకత్వం: సాగర్‌ కె చంద్ర 
సంగీతం: సాయి కార్తీక్‌ 
విడుదల తేదీ: 30 డిసెంబర్‌ 2016 

క్లుప్తంగా చెప్పాలంటే 

రైల్వే రాజు (శ్రీవిష్ణు)కి క్రికెటర్‌ కావాలన్నది డ్రీమ్‌. క్రికెట్‌ని ప్రాణం కన్నా ఎక్కువగా ఇష్టపడతాడు. అనుకోకుండా అతని జీవితంలోకి ఇంతియాజ్‌ అలీ (నారా రోహిత్‌) ఎంటరవుతాడు. ఇంతియాజ్‌ అలీ ఓ పోలీస్‌ అధికారి. నక్సలైట్లను ఏరివేయడమే అతని లక్ష్యం. అనుకోకుండా ఇంతియాజ్‌ అలీకీ, రైల్వే రాజుకీ మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ఆ తర్వాత రైల్వే రాజు క్రిమినల్‌గా మారతాడు. ఇంతియాజ్‌ అలీకీ, రైల్వే రాజుకీ మధ్య జరిగే ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? రైల్వే రాజు క్రికెటర్‌ అవ్వాలనే తన డ్రీమ్‌ని నెరవేర్చుకున్నాడా? నక్సలైట్లంటే ఇంతియాజ్‌ అలీకి ఎందుకంత కసి? ఇవన్నీ తెరపై చూస్తేనే బాగుంటాయి. 

మొత్తంగా చెప్పాలంటే 

ఇప్పటిదాకా చిన్న చిన్న సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన శ్రీవిష్ణు, ఈ సినిమాతో హీరోగా పూర్తిస్థాయిలో తెరపై కనిపించాడు. విభిన్నమైన కోణాలున్నాయి ఆయన పాత్రలో. అన్ని కోణాల్నీ అద్భుతంగా చూపించగలిగాడు. నటుడిగా సత్తా చాటాడు. శ్రీవిష్ణు కంటే నారా రోహిత్‌కి హీరోగా గుర్తింపు ఎక్కువ కావడంతో ప్రమోషన్స్‌లో నారా రోహిత్‌ ఎక్కువ కనిపించాడు. అయితే సినిమాలో అతనిది హీరోతో పోల్చితే కాస్త చిన్న పాత్ర, నిడివి పరంగా. కానీ ఉన్నంతలో తానే సినిమాకి వెన్నెముక అన్పించాడు. పోలీస్‌ పాత్రలు నారా రోహిత్‌కి కొట్టిన పిండి. తన బేస్‌ వాయిస్‌తో తెరపై ఉన్నంతసేపూ అద్భుతంగా ఆకట్టుకుంటాడు. 

హీరోయిన్‌ తాన్యా హోప్‌ ఓకే. బ్రహ్మాజీ, సత్యప్రకాష్‌, ప్రభాస్‌ శ్రీను, రాజీవ్‌ కనకాల ఇలా మిగతా పాత్రధారులంతా సినిమాకి అవసరమైన మేర ఉపయోగపడ్డారు. 

కథ గురించి చెప్పాలంటే 90ల నాటి కథ ఇది. దాన్ని దర్శకుడు చెప్పిన విధానం బాగుంది. ఇప్పుడొస్తున్న చిత్రాలతో పోల్చితే కాస్త భిన్నమైనదే. కథనం బాగుంది. డైలాగ్స్‌ ఆకట్టుకుంటాయి. కొన్ని సీన్లు బోర్‌ కొట్టిస్తాయిగానీ ఓవరాల్‌గా సినిమా మంచి ఫీల్‌ ఇస్తుంది. సంగీతం బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ఓకే. సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌, ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమాకి ప్లస్‌ అయ్యాయి. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ అవసరం అనిపిస్తుంటుంది. 

టైటిల్‌ దగ్గర్నుంచి ప్రమోషన్స్‌ వరకూ అన్నీ డిఫరెంట్‌గా ప్లాన్‌ చేయడంలోనే దర్శకుడు సగం సక్సెస్‌ సాధించాడు. ఇంతా చేసి, థియేటర్లలో ప్రేక్షకులకు ఆ కొత్తదనం కన్పించకపోతే ఫలితం తేడా కొట్టేస్తుంది. కానీ దర్శకుడు ఛాన్స్‌ తీసుకోలేదు. ప్రేక్షకుల్ని థియేటర్లలో కట్టిపడేయడానికి కష్టపడ్డాడు. ఆ కష్టం తెరపై కన్పిస్తుంది. కొన్ని సీన్స్‌ డల్‌గా అనిపించినా, ఎత్తుకోవాల్సిన చోట బాగానే ఎత్తుకున్నాడు. క్లయిమాక్స్‌ సినిమాకి బలం. ఓవరాల్‌గా కొత్త కాన్సెప్ట్‌తో, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో సినిమాని నడిపించాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ అలా అలా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో వేగం తగ్గినట్లే కన్పిస్తుంది, అంతలోనే మళ్ళీ పుంజుకుని సినిమాలో ప్రేక్షకుడు లీనమైపోతాడు. ఓవరాల్‌గా దర్శకుడు ఓ మంచి సినిమా తీశాడనే ఫీలింగ్‌ ఆడియన్స్‌లో కలుగుతుంది. ప్రమోషన్‌ బాగా చేయడం, సినిమాలో కొత్తదనం ఉండటం ప్లస్‌ పాయింట్స్‌. మౌత్‌ టాక్‌ బాగా పెరిగి, ప్రమోషన్‌ ఇంకా బాగా చేయగలిగితే సినిమా మంచి విజయాన్ని అందుకోగలదు. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
అప్పట్లో ఒకడు కాదు, ఇద్దరూ ఆకట్టుకున్నారు 

అంకెల్లో చెప్పాలంటే: 3.25/5

మరిన్ని సినిమా కబుర్లు
too much