Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kadi movie  celebretions in bejawada

ఈ సంచికలో >> సినిమా >>

అతి ఖరీదైన సినీ విడాకులు ఇవేనా?

costly divorce

బాలీవుడ్‌ బ్యూటీ మలైకా అరోరా ఖాన్‌. బాలీవుడ్‌లో పాపులర్‌ ఐటెం భామ. తొలిసారిగా తెలుగులో 'గబ్బర్‌ సింగ్‌' సినిమాలో ఐటెం సాంగ్‌లో నటించింది. 'కెవ్వు కేక' అంటూ నిజంగానే కేక పుట్టించింది ఆ సాంగ్‌తో. బాలీవుడ్‌లోనే పాపులర్‌ ఐటెం బాంబ్‌ అయిన ఈ ముద్దుగుమ్మ ఈ పాటతో తెలుగులో కూడా ఐటెంగా బాంబ్‌ పేల్చింది. పవన్‌ కళ్యాణ్‌తో కలిసి గ్లామరస్‌గా స్టెప్పులేసింది ఆ సినిమాలో. అయితే ఈ భామ ఇప్పుడు వార్తల్లోకెక్కింది. ఎందుకంటే ఐటెం పరంగా కాదు. తన భర్త అర్భాజ్‌ ఖాన్‌తో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది.

అయితే సెలబ్రిటీస్‌ పెళ్లి చేసుకోవడం, విడాకుల తీసుకోవడం  ఇవన్నీ మామూలు విషయాలే కానీ, ఈ భామ విడాకుల గొడవ మరోలా ఉంది. ఎందుకంటే మలైకా విడాకుల కోసం 15 కోట్ల దాకా డిమాండ్‌ చేస్తోందట. వామ్మో ఇది చాలా పెద్ద అమౌంటే విడాకుల పరంగా. ఇంతవరకూ ఇలా ఎవ్వరూ డిమాండ్‌ చేయలేదు. అందుకే ఈ న్యూస్‌ హాట్‌ టాపిక్‌ అయ్యింది. అయితే అగ్రిమెంట్‌ దాదాపుగా ఓకే అయిపోయిందని సమాచారమ్‌. మొత్తానికి ఈ విడాకుల తతంగం మాత్రం అటు బాలీవుడ్‌కీ, ఇటు టాలీవుడ్‌కీ కూడా మెల్లగా పాకేసింది. బాలీవుడ్‌ నెంబర్‌ వన్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ సోదరుడే ఈ అర్భాజ్‌ఖాన్‌.

మరిన్ని సినిమా కబుర్లు
akkieni hero with mega director