సంక్రాంతి శర్వానంద్‌కి బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. గతేడాది 'ఎక్స్‌ప్రెస్ రాజా' సినిమాతో దూసుకొచ్చి, సింపుల్‌గా, సైలెంట్‌గా హిట్టు కొట్టుకెళ్లిపోయాడు. అదే జోరుతో ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచాడు. మామూలుగానే సంక్రాంతి పెద్ద పండగ. అలాంటిది ఈ ఏడాది సంక్రాంతికి మరిన్ని ప్రత్యేకతలున్నాయి. ఎందుకంటే ఈ సంక్రాంతికి ఇద్దరు స్టార్ హీరోలు ప్రతిష్ఠాత్మక చిత్రాలతో బరిలో నిలిచారు. మెగాస్టార్ 150, బాలయ్య 100వ చిత్రాలతో పోటీలో ఉండగా ఆ రెండు భారీ చిత్రాల నడుమ శర్వానంద్ కూడా ఉన్నాడు. ఏ మాత్రం తగ్గని ఉత్సాహంతో ఈ రెండు పెద్ద సినిమాల జోరులోనూ నిలదొక్కుకున్నాడు ఈ యంగ్ హీరో. ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి శర్వానంద్ నటనతో పాటు కథ, కథనాలు ఒక కారణం అయితే మరో కారణం దిల్‌రాజు అనే చెప్పాలి.
ఎందుకంటే వీలైనన్ని ఎక్కువ ధియేటర్లు, రిచ్ పబ్లిసిటీ ఇలా ఒకటేమిటీ ఈ సినిమాకి ఇవన్నీ బాగా కలిసొచ్చాయి. ఉత్తమ కథా చిత్రాల ప్రొడ్యూసర్‌గా దిల్‌రాజుకున్న పేరు ఈ సినిమాతో మరింత రెట్టింపయ్యింది. ఈ ఏడాది సంక్రాంతికి 'శతమానం భవతి' సినిమా రూపంలో ఓ మంచి సినిమాను అందించాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించింది. సంక్రాంతికి అచ్చతెలుగు సినిమాగా ఈ సినిమా నిలిచింది. అలాగే ప్రకాష్ రాజ్, జయసుధలతో పాటు, హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ క్యూట్ లుక్స్ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి సహకరించాయి.
|