Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

కిట్టు ఉన్నాడు జాగ్రత్త చిత్ర సమీక్ష

kittu unnadu jagrattha movie review

చిత్రం: కిట్టు ఉన్నాడు జాగ్రత్త 
తారాగణం: రాజ్‌ తరుణ్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌, అర్భాజ్‌ఖాన్‌, పృద్వీ, రఘుబాబు, నాగబాబు, రాజా రవీంద్ర, తాగుబోతు రమేష్‌, ప్రవీణ్‌, సుదర్శన్‌ తదితరులు 
నిర్మాణం: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 
సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ 
దర్శకత్వం: వంశీకృష్ణ ఆకెళ్ల 
విడుదల తేదీ: 03 మార్చి, 2017

క్లుప్తంగా చెప్పాలంటే 
స్నేహితులతో హ్యాపీ హ్యాపీగా తిరిగే ఓ మెకానిక్‌ కుర్రోడు కిట్టు (రాజ్‌తరుణ్‌). స్నేహమంటే ప్రాణం ఇస్తాడు. అలాంటి కిట్టు అనుకోకుండా జానకి (అనూఇమ్మాన్యుయేల్‌) అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కోసమే కుక్కల్ని కిడ్నాప్‌ చేస్తూ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. ఏఆర్‌ (ఆర్భాజ్‌ ఖాన్‌) సెలబ్రిటీస్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేస్తూ తన అవసరాలను తీర్చుకుంటూ ఉంటాడు. ఈ విషయాలు తెలిసి జానకి, కిట్టుతో బ్రేక్‌ అప్‌ చేసుకుంటుంది. మరోవైపు వేరే కారణంగా ఏఆర్‌ జానకిని కిడ్నాప్‌ చేస్తాడు. అనుకోకుండా ఆ కిడ్నాప్‌ కేసులో కిట్టు ఇరుక్కుంటాడు. ఈ కేసు నుండి కిట్టు ఎలా బయటపడ్డాడు? అసలు తన ప్రేమని దక్కించుకున్నాడా? లేదా అనే విషయాలు తెరపై చూడాల్సిందే! 

మొత్తంగా చెప్పాలంటే 
రాజ్‌ తరుణ్‌ ఎనర్జీ లెవల్స్‌ గురించి ఆల్రెడీ తెలిసిందే. అలాగే తన ఎనర్జీకి ఏ మాత్రం మించకుండా, క్యారెక్టర్‌లో లీనమైపోయాడు. తన డైలాగ్‌ డిక్షన్‌తో మరో సారి రాజ్‌తరుణ్‌తో ఆకట్టుకున్నాడు. హీరోగానే కాకుండా ఈ సారి రాజ్‌తరుణ్‌ కొంచెం అడ్వాన్స్‌ అయ్యాడు. ఈ సినిమాలో ఓ పాట కూడా రాశాడు. కుక్కల్ని కిడ్నాప్‌ చేసే కుర్రాడి పాత్రలో రాజ్‌ తరుణ్‌ నటన బాగా ఆకట్టుకుంది. 

హీరోయిన్‌ విషయానికి వస్తే, 'మజ్ను' సినిమాలో కన్నా ఈ సినిమాలో గ్లామర్‌ డోస్‌ బాగా పెంచేసింది. నటన పరంగా బాగానే నటించింది. కానీ ఆమె పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉన్నట్లు అనిపించలేదు. టోటల్‌గా ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలో అందంగా కనిపించింది. కానీ తన టాలెంట్‌ పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం అయితే ఆమెకు రాలేదు. 

బాలీవుడ్‌ నటుడు అర్భాజ్‌ఖాన్‌ తొలి పార్ట్‌లో కొంచెం పవర్‌ ఫుల్‌గా కనిపించాడు. చివరికి తేలిపోయాడు. ఈ పాత్రకు డబ్బింగ్‌ కూడా అంతగా సెట్‌ అయినట్లు లేదు. బేస్‌ వాయిస్‌తో చెప్పించారు. కానీ అక్కడక్కడా డైలాగ్‌లో క్లారిటీ మిస్సయ్యింది. నాగబాబు, వెన్నెల కిషోర్‌, రాజా రవీంద్ర తమ వరకూ తమ పాత్రలకు న్యాయం చేశారు. పృద్వీ కామెడీ ఆకట్టుకుంటుంది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు అలరించేలా ఉన్నాయి. హంసా నందిని ఐటెం సాంగ్‌ అంతగా కిక్‌ ఇవ్వలేదు. కెమెరా, ఎడిటింగ్‌ అన్నీ ఓకే అనిపించాయి. బుర్రా సాయిమాధవ్‌ మాటలు బాగున్నాయి. 
ప్రథమార్థంలో హీరో కుక్కల్ని కిడ్నాప్‌ చేయడం, కిట్టు - జానకిల మధ్య లవ్‌ స్టోరీతో సరదా సరదాగా సాగిపోతుంది. కొంచెం రొమాన్స్‌, కావాల్సినంత ఫన్‌తో సెకెండాఫ్‌ ముగుస్తుంది. కిట్టు - జానకి విడిపోయాక కథ కొత్త మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి కథలో వేగం ఇంకాస్త పెరుగుతుంది. అయితే అక్కడక్కడా స్లో అవుతున్నట్లనిపించడం మామూలే. ఓవరాల్‌గా సినిమా ఎంటర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అనూ ఇమ్మాన్యుయేల్‌ గ్లామర్‌, రాజ్‌ తరుణ్‌ ఎనర్జీ సినిమాకి హైలైట్స్‌గా చెప్పాలి. విలన్‌ పాత్రని చివరల్లో తేలిపోవడం ఏమంత బాగా అనిపించదు. మొత్తంగా చూసినప్పుడు సినిమా పైసా వసూల్‌గానే అనిపిస్తుంది. 

ఒక్క మాటలో చెప్పాలంటే 
కిట్టుగాడి దగ్గరకెళ్ళొచ్చు 

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka