Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
spider technical work  fantastic

ఈ సంచికలో >> సినిమా >>

'డిజె - దువ్వాడ జగన్నాథమ్‌' వచ్చేస్తున్నాడు

DJ, duvvada jagannaadham is comming

ఇంతవరకూ మాస్‌, క్లాస్‌ గెటప్స్‌తో ఆకట్టుకున్న అల్లు అర్జున్‌ సరికొత్త గెటప్‌లో నటిస్తున్న చిత్రం 'డీజె - దువ్వాడ జగన్నాధమ్‌'. ముందుగా ఈ సినిమాకి సంబంధించి బన్నీ మాస్‌ లుక్‌ని రిలీజ్‌ చేసి సినిమాపై హైప్‌ పెంచేసింది 'డిజె దువ్వాడ జగన్నాథమ్‌' టీమ్‌. ఆ తర్వాత బ్రాహ్మిణ్‌ గెటప్‌లో అల్లు అర్జున్‌ అందర్నీ ఎట్రాక్ట్‌ చేసేశాడు. సెకెండ్‌ లుక్‌ని సీక్రెట్‌గా ఉంచుదామనుకున్నా, దాన్నీ విడుదల చేసేశారు. క్లాస్‌ లుక్‌తో అలరించేస్తున్నాడు ఈ సీక్రెట్‌ లుక్‌లో అల్లు అర్జున్‌. అంటే ఈ సినిమాలో క్లాస్‌, మాస్‌ అన్నీ పుష్కలంగా ఉంటాయన్న సంగతి తెలిసిపోయింది.

హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌తో మ్యాజిక్‌ చేయనున్నాడు మరోసారి ఈ సినిమాతో. జూన్‌ 23వ తేదీన సినిమా రిలీజ్‌ని కన్‌ఫామ్‌ చేస్తూ విడుదల చేసిన కొత్త లుక్‌ సినిమాపై అంచనాల్ని అమాంతం రెట్టింపు చేసేసింది. 'ముకుందా' ఫేంఒ పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది ఈ సినిమాలో. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్‌ని కూడా చాలా ప్లాన్డ్‌గా చేస్తున్నారట. పబ్లిసిటీని పీక్స్‌కి తీసుకెళ్ళేందుకు అన్ని వ్యూహాలతో సిద్ధమయ్యింది 'డిజె దువ్వాడ జగన్నాథమ్‌' టీమ్‌. వరుస విజయాలతో దూకుడు మీదున్నాడు బన్నీ. 'సరైనోడు' సినిమాతో సెన్సేషనల్‌ హిట్‌ అందుకున్న బన్నీ ఈ సినిమాతోనే అదే స్థాయి విజయాన్ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్‌. 

మరిన్ని సినిమా కబుర్లు
nitin act with arjun