Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
nitin act with arjun

ఈ సంచికలో >> సినిమా >>

శ్రద్ధాకపూర్‌ పరకాయ ప్రవేశం

sraddhakapoor act different roals

నటన అంటే పరకాయ ప్రవేశం లాంటిదేనంటారు. ఆ స్థాయిలో ప్రశంసలు దక్కించుకోవాలంటే నటీనటులెవరైనా చాలా చాలా కష్టపడాలి. ఆ కష్టం చాలా ఇష్టంగా ఉంటుందని చెప్పడమే కాకుండా చేసి చూపిస్తోంది బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌. ఫిల్మీ బ్యాక్‌గ్రౌండ్‌ నుంచే వచ్చినా, సినిమా సినిమాకీ తనదైన స్టైల్లో యాక్టింగ్‌ టాలెంట్‌ ప్రదర్శిస్తోంది. తద్వారా విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ స్టార్‌డమ్‌ పెంచుకుంటోంది ఈ బ్యూటీ. గ్లామరస్‌ పాత్రలకే పరిమితం కాకుండా విలక్షణ పాత్రల్ని ఎంచుకుంటున్న శ్రద్ధా కపూర్‌ ఎవరికీ అందనంత ఎత్తుకు అతి త్వరలోనే చేరుకునేలా ఉంది. 'హసీనా' సినిమాలో అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ ఇబ్రహీం సోదరిగా నటిస్తోంది. ఆ పాత్ర కోసం ఆమె ఎంతో కష్టపడింది. స్వయంగా దావూద్‌ ఇబ్రహీం సోదరిని కలిసి, వివరాలు సేకరించింది. ఈ సినిమాలో రెండు డిఫరెంట్‌ షేడ్స్‌లో తన నటన ప్రదర్శించబోతోంది ఈ ముద్దుగుమ్మ. గతంలోనే ఈ పాత్రకి సంబంధించిన పోస్టర్‌తో శ్రద్దా ఏంటో నిరూపించేసుకుంది. తాజాగా విడుదలైన మరో పోస్టర్‌ ఆమె గొప్పతనాన్ని ప్రూవ్‌ చేసేలా చేసింది. ఈ సినిమానే కాకుండా తాజాగా ఈ బ్యూటీ 'సైనా' అనే సినిమాకి సైన్‌ చేసింది. బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ ఇది. సైనా నెహ్వాల్‌తో సినిమా గురించి ఇంతకు ముందే చర్చించి, ఆమె గురించి పూర్తిగా తెలుసుకుందట. బ్యాడ్మింటన్‌లో కోచింగ్‌ తీసుకుని, సైనాకి తన టాలెంట్‌ చూపించి, ఆ తర్వాతే కెమెరా ముందుకు వెళతానంటోంది. డెడికేషన్‌ అంటే ఇదే. దీన్నే పరకాయ ప్రవేశం అంటారేమో. 

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam