అభిమానుల ఆశలు నెరవేరాయి. ఎంత కాలంగానో వేచి చూస్తున్న టీజర్ రానే వచ్చింది. రోబో స్పైడర్ హీరో కాలు మీద నుండి ఫ్యాంటు మీదుగా పాకి ఆయన భుజం మీదికి చేరుతుంది. అప్పుడు హీరో ష్! అంటూ దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్‌లో మ్యూజిక్ అదిరిపోతోంది. ఇదీ 'స్పైడర్' టీజర్ కథ. మురుగదాస్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమా 'స్పైడర్'. మహేష్ హీరోగా వస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్న మాట వాస్తవమే. అయితే ఆ అంచనాలు టీజర్ వచ్చాక మరింత రెట్టింపయ్యాయి.
టీజర్ చూస్తుంటే ఈ సినిమా ఓ టిపికల్ సబ్జెక్ట్‌తో తెరకెక్కుతోందన్న సంగతి అర్ధమవుతోంది. స్పై కాప్‌గా నటిస్తున్నాడు మహేష్‌బాబు ఈ సినిమాలో. టీజర్‌ని చాలా కొత్తగా చూపించారు. మహేష్ క్యారెక్టర్ కూడా కొత్తదే. అత్యంత భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాతో తొలి సారిగా మహేష్‌తో జత కడుతోంది. తమళ డైరెక్టర్ ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్నాడు. తమిళ యంగ్ హీరో భరత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇదో బైలింగ్వల్ మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ఈ సినిమాతో మహేష్ తమిళ ప్రేక్షకులకు పరిచయం కానున్నాడు. మరో పక్క కొరటాల శివతో మహేష్ చేయబోయే చిత్రం కూడా సెట్స్ మీదికెళ్లింది. 'భరత్ అను నేను' అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ఉండబోతోందని తెలియవస్తోంది.
|