'ముకుందా' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ముద్దుగుమ్మ పూజా హెగ్దే. తొలి సినిమాతోనే హిట్ అందుకుంది . కానీ అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే అయ్యాయి. ఆ తర్వాత 'ఒక లైలా కోసం' సినిమాలో నాగ చైతన్య సరసన నటించి మెప్పించింది. అయితే ఆ సినిమా ఆశించినంతగా విజయం అందుకోలేదు. ఆ తర్వాత ఈ బ్యూటీ బాలీవుడ్‌కి చెక్కేసింది. బాలీవుడ్ గ్రీకు గాడ్ హృతిక్ రోషన్‌కి జంటగా 'మొహంజోదారో' సినిమాలో నటించింది. అక్కడా హిట్ అందుకోలేకపోయింది కానీ అమ్మడికి ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. మళ్లీ టాలీవుడ్‌లో ది బెస్ట్ ఆఫర్ చేజిక్కించేసుకుంది. అమ్మడి అందం అలాంటిది.
హరీష్ శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న 'డీజె - దువ్వాడ జగన్నాధమ్' సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్‌గా నటస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా టీజర్‌తోనే అమ్మడి అందాల దాడి అర్ధమైపోయింది అందరికీ. తాజాగా వచ్చిన ఆడియో సింగిల్ టీజర్‌తో పూజా మరింత హీట్ పుట్టించేస్తోంది. బీట్‌కి తగ్గట్లుగా క్యూట్ క్యూట్‌గా వేస్తోన్న స్టెప్పులతో అందర్నీ కట్టిపాడేస్తోంది. టీజర్‌లోనే అమ్మడు ఇంత అందంగా ఉంటే, హరీష్ శంకర్ సినిమాలో ఈ బ్యూటీ అందాల్ని ఇంకెంత అందంగా చూపించి ఉంటాడో అనిపిస్తోంది. వరుస హిట్లతో దూసుకెళ్లిపోతోన్న అల్లు అర్జున్ ఈ సినిమాతో మరో హిట్ అందుకోవడం ఖాయమంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. అలాగే ఈ బ్యూటీ పూజాకి కూడా ఈ సినిమాతో సక్సెస్ వచ్చేసినట్లే అంటున్నారు.
|