మంచు విష్ణు హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం 'ఓటర్' శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. యూనివర్సల్ సబ్జెక్ట్‌తో ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఈ సినిమా ఉంటుందని చిత్ర దర్శక నిర్మాతలు అంటున్నారు. 'ఓటర్ - హీరో ఆఫ్ ది నేషన్' అనే టైటిల్‌లోనే సినిమా కథేంటో చెప్పేశారు. అందాల భామ సురభి ఈ సినిమాలో విష్ణు సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. సమాజంలోని అక్రమాలపై, అవినీతిపై ఓ యువకుడి పోరాటమే ఈ 'ఓటర్' సినిమా అట. సినిమా చిత్రీకరణ దాదాపూ పూర్తయ్యింది.
పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చిత్ర దర్శక నిర్మాతలు వెల్లడించారు. అతి త్వరలో టైటిల్ లోగో, ఫస్ట్ లుక్ విడుదల చేస్తారట. యువ సంగీత తరంగం తమన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. కలెక్షన్ కింగ్ మోహన్‌బాబుకి 'అసెంబ్లీ రౌడీ'లా, ఆయన తనయుడు మంచు విష్ణుకి 'ఓటర్' కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందని అంచనా వేస్తున్నారు. సుధీష్ కుమార్ పూదోట ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి.ఎస్. కార్తీక్ దర్శకుడు. టైటిల్‌ని బట్టి ఇదొక పొలిటికల్ సెటైర్ అనే భావన కలుగుతోంది. అయితే వ్యవస్థను జాగృతం చేసేలా సినిమా ఉంటుందని చిత్ర దర్శకుడు చెప్పారు. 'ఓటర్' సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచు విష్ణు 'పవర్' చూపిస్తాడనే ఆశిద్దాం.
|