Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
fidaa movie review

ఈ సంచికలో >> సినిమా >>

హాట్‌ సెన్సేషన్‌ సమంత

hot sensation samanta

త్వరలోనే నాగ చైతన్యని పెళ్లాడనుంది ముద్దుగుమ్మ సమంత. అక్కినేని ఇంట కోడలిగా అడుగు పెట్టనుంది. అయితే పెళ్లికి ముందు ఈ ముద్దుగుమ్మ హాట్‌ అప్పీల్‌ బాగా పెంచేసిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అవును నిజమే, 'జెఎఫ్‌డబ్య్లు - జస్ట్‌ ఫర్‌ విమెన్‌' అనే మ్యాగజైన్‌ కవర్‌ పేజీ కోసం సమంత ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. ఈ షూట్‌లోని పిక్స్‌ అన్నీ చాలా చాలా హాట్‌గా ఉన్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి ఈ ఫోటోలు. అయితే ఆ ఫోటోల్లో హాట్‌నెస్‌ని చూడొద్దంటోంది సమంత. ఎందుకలా చేశానంటే అని వివరణ కూడా ఇస్తోంది. తెలంగాణా చేనేత వస్త్రాలకు సమంత బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

సమంత తాజాగా ఫోటో షూట్‌లో అన్నీ చేనేత చీరలనే ధరించింది. ఈ చీరలను అల్ట్రా మోడ్రన్‌ లుక్‌లో సమంత ధరించడం వల్ల తాను అనుకున్న కాన్సెప్ట్‌ జనానికి బాగా రీచయ్యిందంటోంది ముద్దుగుమ్మ సమంత. అలాగే ఆ తర్వాత సమంతని అందరూ మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కూడా. సమంత ఉద్దేశ్యం అర్ధమయ్యాక, అందరూ ఆమెని అభినందించారు. ఇది మంచి ప్రయత్నమే అని ప్రశంసించారు. సమంత చేసిన ఈ ప్రయత్నంతో చేనేతకు మంచి ప్రమోషన్‌ దక్కింది. మరో పక్క సమంత రామ్‌ చరణ్‌తో 'రంగస్థలమ్‌ 1987' సినిమాలో నటిస్తోంది. నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న 'రాజుగారి గది -2' లో గెస్ట్‌ రోల్‌లో నటిస్తోంది. ఇవి కాక రెండు, మూడు తమిళ సినిమాల్లోనూ సమంత నటిస్తోంది.

మరిన్ని సినిమా కబుర్లు
megastar 151 movie title mahaveera