Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
megastar 151 movie title mahaveera

ఈ సంచికలో >> సినిమా >>

అందాల చందమామ రాజకీయం

kajal agarwal act in  nene raju nene mantri movie

అందాల చందమామ కాజల్‌ అగర్వాల్‌ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోంది ఈ సినిమా. ఈ సినిమాలో రానా ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. సినిమా ప్రమోషన్స్‌, ట్రైలర్‌ అన్నీ ఆకట్టుకునేలా డిజైన్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఇదిలా ఉండగా, కాజల్‌ పాత్రకు ఈ సినిమాలో అత్యంత ప్రాధాన్యత ఉండబోతోందట. రానాకి భార్యగా నటిస్తోంది కాజల్‌ ఈ సినిమాలో. ఇంతవరకూ కాజల్‌ చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు. ఈ సినిమాలో ఆమె పాత్ర ఒక ఎత్తు అనేంతగా ఉండబోతోందట.

ఇదిలా ఉండగా, కాజల్‌ నటిస్తున్న మరో చిత్రం 'ఎమ్మెల్యే'. కళ్యాణ్‌రామ్‌ ఈ సినిమాలో కథానాయకుడు. ఈ సినిమా పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌ మూవీ కాకపోయినా కానీ, టైటిల్‌ చూస్తే అదే ఫ్లేవర్‌ అనిపిస్తోంది. వరుసగా రెండు పొలిటికల్‌ తలంపు ఉన్న సినిమాల్లో కాజల్‌ నటిస్తోందన్న మాట. కాజల్‌ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు వ్యక్తులతో వరుసగా ఇప్పుడు రెండు సినిమాలు చేయడం విశేషం. డైరెక్టర్‌గా తేజ డైరెక్షన్‌తోనే చందమామ బ్యూటీ తెరంగేట్రం చేసింది. అలాగే కాజల్‌ నటించిన తొలి సినిమా 'లక్ష్మీ కళ్యాణం'. అందులో హీరో కళ్యాణ్‌రామ్‌. ఈ ఇద్దరితోనూ చెరో సినిమాలోనూ నటిస్తోంది ఇన్నాళ్ల గ్యాప్‌ తర్వాత కాజల్‌. నిజంగా ఇది విశేషమే కదా. కాజల్‌కి 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా 50వ సినిమా కావడం మరో విశేషం.

మరిన్ని సినిమా కబుర్లు
anu emmanuel got lucky chance