మాస్ మసాలా డైరెక్టర్ సంపత్ నంది డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'గౌతమ్ నందా'. ఈ సినిమా ప్రమోస్ డిఫరెంట్‌గా ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ట్రైలర్ వచ్చాక సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. గోపీచంద్‌కి యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగా సూటవుతాయి. ఈ సినిమాలో వాటికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు డైరెక్టర్ సంపత్ నంది. రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న గెటప్స్‌లో కనిపిస్తున్నాడు గోపీచంద్. ట్రైలర్ ద్వారా ఆ విషయం తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో హన్సిక, కేథరీన్‌లు హీరోయిన్లుగా హీరోయిన్లుగా నటిస్తున్నారు.
హన్సిక పల్లెటూరి అమ్మాయిలా కనిపిస్తుంటే, కేథరీన్ అల్ట్రా మోడ్రన్ అమ్మాయిలా కనిపిస్తోంది. ముఖ్యంగా కేథరీన్ బికినీ అందాలు ఈ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయట. ట్రైలర్‌లో స్విమ్మింగ్ పూల్‌లో కేథరీన్ బికినీతో స్విమ్ చేస్తున్నట్లుగా ఉన్న సీన్ చాలా కొద్దిగా చూపించారు. అయితే సినిమాలో ఈ సీన్ కెవ్వు కేక అని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ విన్నా అమ్మడి బికినీ గురించే చర్చ.
సిట్యువేషన్‌కి తగ్గట్టుగా ఏ తరహా గ్లామర్ రోల్‌కైనా తాను రెడీ అంటోంది ఈ హాట్ బ్యూటీ. అలాగే తన పాత్రకి కొంచెం ఇంపార్టెన్స్ కూడా ఉండేలా చూసుకుంటోంది ముద్దుగుమ్మ కేథరీన్. ఈ సినిమాలో అయితే కేథరీన్, సూపర్ గ్లామర్‌గా కనిపిస్తూనే చాలా పవర్ ఫుల్ రోల్ ప్లే చేస్తుందట. మరో స్పెషల్ ఏంటంటే ఈ సినిమాలో తొలి సారిగా తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుందీ ముద్దుగుమ్మ. తెలుగు నేర్చుకోవడం కోసం ఓ టీచర్‌ని పెట్టుకుని ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుందట . ఈ సినిమాలోని తన పాత్ర అందరికీ బాగా నచ్చుతుందని అంటోంది కేథరీన్. అలాగే తేజ డైరెక్షన్‌లో వస్తోన్న 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాలోనూ కేథరీన్ నటిస్తోంది.
|