Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
special attraction for goutam nanda

ఈ సంచికలో >> సినిమా >>

టాలీవుడ్‌లో డ్రగ్స్‌: సినీ జనాల నజర్‌

drugs in tollywood

తెలుగు సినీ పరిశ్రమలో డ్రగ్స్‌ వినియోగంపై మీడియాలో వెల్లువెత్తుతున్న కథనాలు సినీ ప్రముఖుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. అయితే సమాజంలో డ్రగ్స్‌ లేదనే విషయం సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరికీ తెలుసు. కాబట్టి డ్రగ్స్‌ ఏరివేత కార్యక్రమాన్ని ఎవరూ వ్యతిరేకించలేకపోతున్నారు. అలాగే సినీ పరిశ్రమలో కొందరికి డ్రగ్స్‌తో సంబంధాలు ఉండవచ్చుననే అనుమానాలతో సినీ ప్రముఖులు ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. డ్రగ్స్‌ని సినీ పరిశ్రమ మొత్తంగా వ్యతిరేకిస్తుందని ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు స్పష్టతనిచ్చారు. అయినప్పటికీ కూడా సినీ పరిశ్రమ చుట్టూనే అనుమానాలు వ్యక్తమవుతుండడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. సినీ పరిశ్రమపై ఇంతటి కుట్రపూరిత విధ్వేషం వెల్లగక్కడమెంతవరకు సబబు? అని వాపోతున్నారు సినీ ప్రముఖులు.

ఒకరిద్దరు దోషులు ఉంటే ఉండొచ్చునుగాక, వారిని కనుగొని శిక్షిస్తే అభ్యంతరం లేదని, సినీ పరిశ్రమకు ఆ పాపాన్ని అంటగట్టడం సబబు కాదన్న వారి వాదనతోనూ ఏకీభవించాల్సిందే. సినీ పరిశ్రమను అద్దాల మేడతో కొందరు పోల్చుతున్నారు. నిజమే తారలకు పాపులారిటీ సంపాదించుకోవడం చాలా కష్టం. దాన్ని నిలబెట్టుకోవడం ఇంకా కష్టం. ఎవరో ఒక్క రాయి విసిరితే అప్పటిదాకా కష్టపడి సంపాదించుకున్న ఇమేజ్‌ నాశనమైపోవడం జరుగుతుంటుంది. ఇదే సినీ పరిశ్రమలో ప్రతి ఒక్కరి ఆవేదన. సినీ ప్రముఖులు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సామాజిక బాధ్యత విషయంలో సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుంటుంది. ఈ విషయం అందరికీ తెలుసు. అందుకే ఒకరిద్దరు చేసిన పాపాన్ని సినీ పరిశ్రమకు ఆపాదించడం ఏమాత్రం సరికాదు.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam