Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
Is eyes need to make films

ఈ సంచికలో >> సినిమా >>

షార్జాలో సైమా అవార్డులు

SIIMA awards in Sharjah

షార్జాలో  సైమా అవార్డుల మహోత్సవం జరుగుతోంది. సౌత్ ఇండియాకి సంబంధించి దాదాపు అన్ని సినీ పరిశ్రమలకు చెందినవారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ వేడుకను తిలకించేందుకు సౌత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులు ఆసక్తి ప్రదర్శిస్తారు. చాలా ఆతృతగా ఎదురు చూస్తారు కూడా. అందుకే ఇంత గొప్పగా, అత్యంత ఖరీదైన వేడుకలుగా ‘సైమా అవార్డ్స్’ ఫంక్షన్ని నిర్వహిస్తున్నారు.

ఈ  ఉత్సవాల్లో దక్షిణ  భారత చలన చిత్రాలకు, నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు అవార్డులు ఇస్తారు. రెండు రోజులు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు నిన్న ముగిసింది. నిన్న అవార్డులు అందుకున్న తెలుగు సినిమా సాంకేతిక నిపుణులు వీరే:

ఉత్తమ కొరియోగ్రాఫర్  - శేఖర్ (జులాయి)
ఉత్తమ యాక్షన్ డైరెక్టర్ - రామ్ లక్ష్మణ్ (గబ్బర్ సింగ్)
ఉత్తమ సినిమాటోగ్రఫీ - సెంథిల్ కుమార్ (ఈగ)
ఉత్తమ నూతన నటుడు  - సుధీర్ బాబు (SMS)
ఉత్తమ నూతన నటి - రెజినా (SMS)
ఉత్తమ నూతన దర్శకుడు  - మారుతి  (ఈ రోజుల్లో)
ఉత్తమ గేయ రచయిత - భాస్కరభట్ల (బిజినెస్ మాన్)

మరిన్ని సినిమా కబుర్లు
need payments in dollars