Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
SIIMA awards in Sharjah

ఈ సంచికలో >> సినిమా >>

పేమెంట్లు డాలర్లలో కావాలట

need payments in dollars

డాలర్ తో రూపాయి మారకం విలువ పడిపోవడంతో, డాలర్ కి గిరాకీ బాగా ఎక్కువైపోయింది. విదేశాల్లో సినిమా షూటింగులంటే నిర్మాతలకి తడిసి మోపెడైపోతోంది. ఇది చాలదన్నట్టు కొందరు సినీ తారలు నిర్మాతలకు రెమ్యునరేషన్ లో కొంత మొత్తాన్ని డాలర్లలో చెల్లించమని కోరుతున్నారట.

అలా చేస్తే, విదేశాల్లో షాపింగ్ తమకు వీలుగా వుంటుందనేది వారి ఆలోచన. ముంబై హీరోయిన్లలో కొంతమంది, టాలీవుడ్ నటుల్లో కొంతమంది ఈ తరహా కోరికల చిట్టాను నిర్మాతల ముందుంచడంతో ఏం చేయాలో పాలుపోవడంలేదు నిర్మాతలకి. అసలే నిర్మాణ ఖర్చులు పెరిగిపోయి, లాభాలపై ఆశలు సన్నగిల్లి నిర్మాత పరిస్థితి దయనీయంగా తయారైపోయింది.

గొంతెమ్మ కోర్కెలు అంటే ఇలాగే ఉంటాయి. షాపింగ్ కోసం, డాలర్లను అడుగుతున్న నటీనటులు, నిర్మాత శ్రేయస్సును గురించీ కొంచెం పట్టించుకుంటే బావుంటుంది. అంతే తప్ప వేలం వెర్రి ప్రదర్శిస్తే కష్టమే.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam