Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
chamatkaram

ఈ సంచికలో >> శీర్షికలు >>

22- 09-2017 నుండి28-09-2017 వరకు - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది, చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేసే ఆస్కారం కలదు. పెద్దలతో కలిసి నూతన ఆలోచనలు చేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. నలుగురిలో ఆశించిన మేర గుర్తింపును పొందుతారు, రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. శ్రమకు తగిన ఫలితం పొందుతారు, దూరప్రదేశప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో అధికారులనుండి గుర్తింపును పొందుతారు, మధ్యవర్తిత్వం పనికిరాదు.

 

 

 వృషభ రాశి : ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో నూతన ఆలోచనలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో కలిసి కొత్త కొత్త ప్రయత్నాలు మొదలు పెడతారు. పెద్దలతో ఏ విషయంలోనూ విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. విదేశీప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు, వాటికీ నూతన ప్రయత్నం చేస్తారు. కుటుంబపరమైన విషయాల్లో కొంత అసంతృప్తిని కలిగి ఉంటారు, తమ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయుట మంచిది. సోదరులతో మీ ఆలోచనలను తెలియజేస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సర్దుబాటు విధానము మంచిది.


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద ఉద్యోగంలో చేసిన నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు చేయునపుడు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదావేయుట సూచన. చర్చాపరమైన విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండుట అన్నివిధాలా ఉత్తమం. కొంత ఉద్యోగంలో ఒత్తిడి కలియుగీ ఉంటారు, సరైన ప్రణాళిక కలిగి ఉండుట సూచన. పెద్దలతో తమ ఆలోచనలను పంచుకుంటారు. గతంలో చేపట్టిన పనులకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. వ్యాపారంలో సర్దుబాటు విధానం అలాగే పెట్టుబడుల విషయంలో తొందరపాటు లేకపోవడం సూచన. 


కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద బంధువులను కలుస్తారు, వారితో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం వలన నలుగురిలో గుర్తింపును పొందుతారు. దూరప్రదేశంలో ఉన్న మిత్రులకు మీ ఆలోచనలు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. మిత్రుల మూలన ఇబ్బందులు పొందుతారు. ప్రయాణాల విషయంలో బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. చిన్న చిన్న పనులకు ముందుగా ప్రాధాన్యం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. పెద్దలతో తమ ఆలోచనలను పంచుకుంటారు. కుటుంబంలో నలుగురి నుండి ఆశించిన సహకారం లభిస్తుంది.

 



 సింహ రాశి : ఈవారం మొత్తం మీద కుటుంబపరమైన విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. గతంలో చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు కలుగుతాయి. ముఖ్యముగా ఆర్థికపరమైన విషయాల్లో పెద్దలతో మీ ఆలోచనలను పంచుకొనే ప్రయత్నం చేయుట సూచన. మిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. శక్తికి మించిన పనులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయుట అలాగే చిన్న చిన్న పనులను ముందుగా పూర్తిచేయుట మంచిది. కాస్త ఆందోళన చెందుతారు. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి, సంతానం వలన ఇతరులకు మాటచెప్పవల్సి వస్తుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు తప్పకపోవచ్చును, జాగ్రత్త. ప్రయాణాలు చేయకండి.

 


కన్యా రాశి : ఈవారం మొత్తం మీద మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుటకు ఆసక్తిని చూపిస్తారు. సాధారణంగా మీ ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వలన ఇబ్బందులు ఏర్పడే ఆస్కారం ఉంది జాగ్రత్త. ఇష్టమైన వ్యక్తులతో మీ ఆలోచనలు పంచుకుంటారు, అలాగే వారినుండి వచ్చిన సూచనలను పరిగణలోకి తీసుకొనే ప్రయత్నం మంచిది. ఉద్యోగంలో తమ ఆలోచనలను అధికారులకు తెలియజేస్తారు,బంధువుల కోసం ఖర్చులు జరుగుతాయి.జీవితభాగస్వామితో మనస్పర్థలు రాకూండా జాగ్రత్తలు తీసుకోండి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులనుండి నూతన విషయాలు చర్చచేస్తారు, సంతానం విషయంలో ఒత్తిడి ఉండుటకు అవకాశం ఉంది..

 

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచన విధానం వలన నస్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో వచ్చే సమస్యలను పెద్దగా చేసుకుంటారు. అనుకోకుండా ప్రయాణాలు వాయిదా పడుతాయి. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం కలిగి ఉండుట సూచన. పెద్దలతో చర్చలు చేయునపుడు జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. మీ మాటతీరు మూలాన ఇబ్బందులు కలుగుటకు అవకాశం ఉంది. చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద మీ ఆలోచనలను పెద్దలకు తెలియజేస్తారు. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా పూర్తిచేసే ఆస్కారం కలదు. ఇష్టమైన వ్యక్తుల నుండి కీలకమైన విషయాలు తెలుస్తాయి. గతంలో మొదలు పెట్టిన పనులు కార్యరూపం దాల్చుటకు అవకాశం ఉంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం వలన మేలుజరుగుతుంది. పెద్దలతో తమ ఆలోచనలు తెలియియజేస్తారు, నూతన పనులను మొదలు పెడతారు, పనులు కార్యరూపం దాల్చుతాయి. చర్చల్లో పాలగొంటారు. పెట్టుబడుల విషయంలో మాత్రం తొందరపాటు ఆలోచనలు చేయకండి. అధికమైన ఆలోచనలు కలిగి ఉంటారు, కొంత ఉద్విగతతకు లోనవుతారు.  స్పస్టమైన ఆలోచనలు కలిగి ఉంటారు.

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద సాధ్యమైనంత వరకు పనులకు సంబంధించి ప్రాముఖ్యత ప్రకారం ముందుకు వెళ్ళండి. ఉద్యోగంలో మీ ఆలోచనలను అధికారులకు తెలియజేసే అవకాశం ఉంది. కొన్ని కొన్ని ఫలితాలు మీకు అనుకూలంగా రావడానికి ఆస్కారం ఉంది. వాహనముల కొనుగోలు విషయంలో సర్దుబాటు విధానం మంచిది. నూతన ఆలోచనలు కలిగిఉంటారు, ఆరోగ్యపరమైన విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పెద్దలతో మీ ఆలోచనలను పంచుకుంటారు.నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటును కలిగి ఉంటారు, కుటుంబంలో భాద్యతలు పెరుగుతాయి. వాహనముల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు, చర్చలకు అవకాశము ఇవ్వకండి. 

 



మకర రాశి : ఈవారం మొత్తం మీద ఇష్టమైన వ్యక్తులను కలిసే అవకాశం ఉంది, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. చేపట్టిన పనులకు గాను నలుగురిలో ఆశించిన మేర గుర్తింపు లభిస్తుంది, కాకపోతే పనిఒత్తిడి పెరుగుతుంది. కుటుంబపరమైన విషయాల్లో అనుకోని ఇబ్బందులు కలుగుతాయి, జాగ్రత్త. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. మిత్రులతో కలిసి నూతన పనులను మొదలుపెట్టుటకు అవకాశం ఉంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. తమఆలోచనలను పెద్దలతో పంచుకుంటారు. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. అనుకోని ఆర్థికపరమైన ఇబ్బందులు పొందుతారు, సాధ్యమైనంత వరకు చర్చలకు అవకాశం ఇవ్వకండి.

 

 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద సంతానపరమైన విషయాలలో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. మిత్రులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. పెద్దలతో మీకున్న పరిచయం మరింత బలపడే అవకాశం ఉంది.  సోదరులతో మనస్పర్థలు కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం సూచన. సంతానం విషయంలో కొంత ఆందోళన తప్పక పోవచ్చును. నలుగురిలో మంచి గుర్తింపును పొందుతారు, ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. అధికారులనుండి గుర్తింపును పొందుతారు, రావాల్సన ధనం సమయానికి చేతికి అందుతుంది.

 

మీన రాశి :  ఈవారం మొత్తం మీద మానసికపరమైన ఒత్తడిని కలిగి ఉంటారు. గతంలో చేపట్టిన పనులకు గాను సమాధానం చెప్పవలసి రావోచ్చును. చర్చాపరమైన విషయాలకు సాధ్యమైనంత దూరంగా ఉండుట సూచన. ప్రయాణాలు వాయిదాపడే సూచన. మిత్రులనుండి మీకు నూతన విషయాలు తెలుస్తాయి. వారికి సమయం ఇవ్వడం మంచిది. అధికారులతో తమ ఆలోచనలను పంచుకుంటారు. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో సభ్యులకు తమఆలోచనలు తెలియజేస్తారు. ప్రయాణాలు వాయిదా పడే అవకాశం ఉంది. కుటుంబసభ్యులనుండి ఆశించిన మేర సహకారం పొందుతారు. స్త్రీ పరమైన విషయాల్లో కాస్త జాగ్రత్త అవసరం

 

     

మరిన్ని శీర్షికలు
prize-for-best-comment/