1. వందల, వేల కోట్లలో జరిగే కార్పోరేట్ స్థాయి కుంభకోణాలు వెలుగులోకి రావడం వాటి దర్యాప్తు చేపట్టడం ఆర్ధక నేరగాళ్ళను పట్టుకోవడం, శిక్షించడం చాలా సమయం తీసుకునే ప్రక్రియ. ఎందుకంటే, ప్రతీ ఒక్కరూ చట్టానికి లోబడే పనిచేయాల్సి వుంటుంది కనుక. అందరూ చట్టాన్ని గౌరవించాల్సిందే! అంతిమ తీర్పులు వెలువడి నేరస్థులకు శిక్ష పడే దాకా వేచిచూడాల్సిందే..
2. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అనేది ఒట్టి మాట. దర్యాప్తు సంస్థల పగ్గాలన్నీ పూర్తిగా అధికార పార్టీ చేతిలోనే వుంటాయనేది బహిరంగ రహస్యం. చట్టాలలో వున్న లొసుగులే ఆర్ధిక నేరగాళ్ళకు బలాన్నిస్తున్నాయి. తక్షణమే చట్ట సవరణలు చేసి జాతి సంపదను దోచుకోకుండా ఆర్ధిక నేరగాళ్ళను కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా వుంది.
పై రెండిట్లో ఏది కరెక్ట్?
|