Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sarasadarahasam

ఈ సంచికలో >> శీర్షికలు >>

06-10-2017 నుండి 12-10-2017 వరకు వారఫలాలు - - శ్రీకాంత్

మేష రాశి : ఈవారం మొత్తం మీద మొదట్లో చిన్న చిన్న విషయాలే ప్రతిదానికి కారణం అవుతాయి. కాస్త నెమ్మదిగా ఆలోచించి ముందుకు వెళితే పనులను విజయవంతంగా పూర్తిచేసే అవకాశం కలదు. ఆర్థికపరమైన విషయాల్లో మీ ఆలోచనల్లో మార్పులకు అవకాశం కలదు. సాధ్యమైనంత వరకు ప్రయాణాలు చేయకండి. వాయిదా వేయుట సూచన. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. కుటుంబపరమైన ఆలోచనలను పెద్దలకు తెలియజేసే ప్రయత్నం మంచిది. ఉద్యోగంలో అధికారులతో కలిసి నూతన పనులను చేపట్టుటకు ఆస్కారం ఉంది. మిత్రులతో కలిసి చేసే పనుల విషయంలో జాగ్రత్త.

 

 వృషభ రాశి :  ఈవారం మొత్తం మీద ఆరంభంలో పనులు వేగంగా పూర్తిఅయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనుల విషయంలో మీ స్పష్టత తగినట్లుగా ఫలితాలు పొందుతారు. అనుకోకుండా ప్రయాణాలు చేయవల్సి వస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో పెద్దలతో కలిసి నూతన పనులను మొదలు పెట్టుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో కొంత పుష్టి ఉంటుంది. గతంలో మీకు రావాల్సిన ధనము సమయానికి చేతికి అందుతుంది. మిత్రులతో కలిసి చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేయుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణాలు చేయాలనేకొనేవారికి అనుకూలమైన సమయం. చర్చలకు అవకాశం ఇవ్వకండి. 


మిథున రాశి :  ఈవారం మొత్తం మీద సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు. ఉద్యోగంలో అధికారులనుండి వచ్చు ఆలోచనల విషయంలో సందిగ్దత వీడుతుంది. చేసేప్రతిపని విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీయొక్క నిర్ణయాలు కొంతమందిని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది సర్దుబాటువిధానం మేలుచేస్తుంది. ఎవ్వరితోను మాటపట్టింపులకు పోకండి,పెద్దల నుండి వచ్చు సూచనల విషయంలో సరైన దృక్పథం కలిగి ఉండుట మంచిది. కుటుంభసభ్యులతో అధికసమయాన్ని గడుపుతారు.

 



కర్కాటక రాశి : ఈవారం మొత్తం మీద చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అధికారులతో వారంచివరలో మనస్పర్థలు కలుగుటకు అవకాశం ఉంది కావున మాటలు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించుట సూచన. చిననాటిమిత్రులతో కలిసి సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది విందుల్లో పాల్గొంటారు. విదేశీప్రయత్నాల విషయంలో కలిసి వస్తాయి వాటికోసం చేయుప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇచ్చుటకు అవకాశం కలదు. సరైన ప్రణాళిక లేకపోతే అనవసరమైన ఒత్తిడికి లోనయ్యేఅవకాశం ఉంది జాగ్రత్త. జీవితభాగస్వామి నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు.



 సింహ రాశి : ఈవారం మొత్తం మీద దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగంలో ఉన్నతస్థాయి నుండి ప్రశంశలు లభించే అవకాశం కలదు అదేవిధంగా అధికారులకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది. కుటుంభంలో మీయొక్క ఆలోచనలను స్వాగతించే అవకాశం ఉంది అందరి సహకరం లభించుట వలన మంచి ఫలితాలు వస్తాయి. ప్రయాణాలు చేయునపుడు స్వల్ప ఇబ్బందులు పొందుటకు అవకాశం ఉంది తగిన జాగ్రత్తలు తీసుకోవడం వలన మేలుజరుగుతుంది.

 

 


కన్యా రాశి :  ఈవారం మొత్తం మీద అధికారులతో మనస్పర్థలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. సోదరులకు అనుగుణంగా వ్యవహరించుట సూచన. స్వల్పదూర ప్రయాణాలకు సమయం ఇస్తారు ప్రయాణాల పట్ల మక్కువను కలిగి ఉంటారు. నచ్చిన వారితో సమయాన్ని గడుపుటకు ఆస్కారం కలదు వారినుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. పెద్దలనుండి ఆశించిన సహాకారం పొందుటకు అవకాశం ఉంది. సమయానికి భోజనం చేయుట సూచన. ఉద్యోగంలో బాగానే ఉంటుంది గుర్తింపు లభిస్తుంది.

 

 


తులా రాశి : ఈవారం మొత్తం మీద చేసిన పనులను మల్లి మల్లి చేసే అవకాశం ఉంది జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వద్దు. మిత్రులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది వారి సహకారం ఆశించిన మేర లభిస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుండి నూతన విషయాలను తెలుసుకొనే అవకాశం ఉంది. మీయొక్క మాటతీరు తోటివారిని నప్పించేఅవకాశం ఉంది కావున బాగాఆలోచించి నిర్ణయం తీసుకోండి మంచిది. విదేశీప్రయత్నాలు కలిసి వస్తాయి గతకొంతకాలంగా ఆగిఉన్న పనులు పోర్తిఅవుతాయి.

 

 

వృశ్చిక రాశి : ఈవారం మొత్తం మీద విదేశీప్రయాణాలు చేయాలను కొనే వారికి అనుకూలమైన సమయం. నూతన పరిచయాలు కలుగుతాయి వారితో సమయాన్ని సంతోషంగా గడిపే అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తడిని కలిగి ఉంటారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు పెట్టుబడుల విషయంలో మాత్రం నిదానంగా వ్యవహరించుట సూచన. కుటుంభంలో మీరు తీసుకొనే నిర్ణయాల మూలాన ఊహించని ఖర్చులకు అవకాశం ఇస్తుంది ఈ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి. 

 

ధనస్సు రాశి : ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనలు పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్ళుట మంచిది. నలుగురిలో ఆశించిన గుర్తింపును పొందుటకు అవకాశం కలదు. సమయానికి భోజనం చేయుట మంచిదిఆరోగ్యపరమైన విషయాల్లో బాగనే ఉంటుంది. నూతన వ్యాపారపెట్టుబడులకు సమయం అనుకూలిస్తుంది. మిత్రుల నుండి అందవలసిన సహాయం సమయానికి అందుట అనేది ఊరటచెందు విషయం. దూరప్రదేశం నుండి విలువైన విషయలు తెల్సుకొనే ఆస్కారం కలదు.



మకర రాశి : ఈవారం మొత్తం మీద బాగుంటుంది, ప్రణాళిక అవసరం. ఉద్యోగంలో అధికారులకు అనుగుణంగా నడుచుకొనుట వలన మేలుజరుగుతుంది. తీసుకొనే నిర్ణయాలు కీలకమైన మార్పులకు అవకాశం ఇస్తుంది. బంధుమిత్రులతో కలిసి చేసిన చర్చలు ఒక కొలికి వస్తాయి. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది,తగిన జాగ్రత్తలు అలాగే ముందుచూపు ఉండుట అనేది సూచన. ఉద్యోగంలో కొంత ఒత్తిడిని కలిగి ఉండే అవకాశం కలదు.స్వల్ప అనారోగ్య సమస్యలు వేధిస్తాయి సమయానికి భోజనం చేయండి విశ్రాంతి అవసరం.

 

 


కుంభ రాశి : ఈవారం మొత్తం మీద కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వలన మేలుజరుగుతుంది. తలపెట్టిన పనులలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి కావున ఈవిషయంలో నిదానంగా ముందుకు వెళ్ళు ప్రయత్నం చేయండి. వ్యతిరేకవర్గం నుండి వచ్చిన ఇబ్బందులను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతనప్రయత్నాలు కలిసి వస్తాయి. సోదరవర్గం నుండి చర్చాసంభందమైన విషయాలకు సమయం ఇస్తారు వాటిమూలన నూతన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.

 

మీన రాశి : ఈవారం మొత్తం మీద ఆర్థికపరమైన విషయాల్లో నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి,సంతృప్తికరమైన ఫలితాలు కలుగుతాయి. తలపెట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు, ఊహించని విధంగా కొన్న్ని విషయల్లో చివరినిమిషంలో ఫలితాలు అనుకూలంగా వచ్చుటకు అవకాశం కలదు. ఉద్యోగంలో బాగుంటుంది తోటివారి నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి దూరబంధువుల నుండి నూతన విషయలు తెలుసుకొనే అవకాశం కలదు. చర్చాసంభందమైన విషయల్లో మాత్రం బాగా ఆలోచించి ముందుకు వెళ్ళండి.      

మరిన్ని శీర్షికలు
bat...bat...bad...bad