Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
bhetaala prasna

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా. ఎస్. జయదేవ్ బాబు

.

 

పంది పెళ్ళాం: ఏవండీ... భోజనం తయారుగా వుంది!
పంది మొగుడు: వొంటికి బురద పూసుకుని వస్తానుండు!!

 

 

 

 

................................

 

వేగు నాగులు: మహా మంత్రీ, రాజ్యం లో దుండగులు ప్రవేశించారు. చౌర్యాలు జరుగుతున్నాయి, రేపో మాపో ధనాగారానికి కన్నం వేయబోతున్నారట!!
మంత్రి ( రాజుగారి చెవి వైపు వంగి) : మనం అప్రమత్తంగా వుండాలి మహారాజా!!
రాజుగారు: ఊర్కోవయ్యా... ఆ పని చెయ్యమన్నది నేనే !! నా సరదా ఖర్చులకి చేతిలో చిల్లి గవ్వ  లేదు!!

.................................

 

ఒకటో వింజామర కన్య: ఏమిటే ఆ ముసి ముసి నవ్వులు?
రెండో వింజామర కన్య: నాకు నవ్వాగడం లేదే?
ఒకటో వింజామర కన్య: రాజు గారికి మతిమరుపెక్కువైందే!
రెండో వింజామర కన్య: ఏం జరిగిందీ?
ఒకటో వింజామర కన్య: రాజు గారు , పంచ కట్టుకోవడం మరిచారు బాబూ!!

 

 

.................................

 సరస్వతి: దిక్కులు చూస్తూ కూర్చున్నారేమిటండీ?
బ్రహ్మ: దిక్కు తోచని వాడెవడైనా వస్తాడా... వరాలిద్దామని ఎదురు చూస్తున్నాను, సరూ!

 



 

 

..................................

అల్లం శెట్టి:  దాశరధీ, కరుణాపయోనిధీ అని పద్యాలు పాడారే గోపరాజు గారూ? రాముడంటే అంత గొప్పా?
బెల్లం నాయుడు: సముద్రడంతడి వాడే, శ్రీ రాముడ్ని స్తుతించి, వారధి కట్డానికి సహకరించాడు కదా! తన అలలతో రామ పాదాలని స్పృషించి పునీతుడయ్యాడు కదా?!
అల్లంశెట్టి: సముద్రుడు కితాబిస్తే చాలా?
బెల్లం నాయుడు: సముద్రుడి కంటే విస్తారమైన సంసార కడలిని మనం సులభంగా ఈదేలా చేసే కరుణామయుడు రాముడు, అర్ధమైందా?

.................................

రతి: ఏవండోయ్.. మన పక్కింటావిడ విలపిస్తున్నది, ఆవిడ భర్త, ఆలస్యంగా ఇంటికొస్తాడట.. వెంటనే నిద్రపోతాడట! ఆయన మీద రెండు బాణాలు వెయ్యండి పాపం!!
మన్మధుడు : రోజూ వేస్తున్నానునుగా... అతడు పక్కింటావిడగారి పక్కింటావిడ ఇంటికి వెళ్తున్నట్లుంది! దానికి నేనేం చెయ్యనూ??

 


 

................................

మంత్రివర్యుడు: మహారాజా, మహారాణి గారికి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయట!
రాజశేఖరుడు: సరే... వెంటనే మంత్రసానికి కబురుచెయ్యండి. రప్పించండి!!
మంత్రివర్యుడు: ఆమెకి కూడా పురిటి నొప్పులట రాజా
రాజశేఖరుడు: (ముసి ముసి నవ్వులు నవ్వి... దొంగ చూపులు చూసి, సిగ్గు పడిపోయాడు)
మంత్రివర్యుడు: ఎందుకా సిగ్గు మహారాజా?
రాజశేఖరుడు: సర్లేవయ్యా...  నా అంతరంగిక విషయాలన్నీ నీతో పంచుకోవాలా??

.................................

రాణి: ఏవండీ... నగర శోధనకి మీరు గాక, మంత్రిని పంపిస్తున్నారెందు చేత?
రాజు: నేను వెళితే... నన్ను రాజు... అని ఎవ్వరూ నమ్మటం లేదు రాణీ

 

 

 

.................................

 

సోమా శర్మ: నీకు లంకె బిందలు దొరికాయి కదా.. ఐనా అప్పులడుగుతూ తిరుగుతున్నావేం?
శ్యామా శర్మ: నాకు బిందెలు మాత్రమే దొరికాయి ! వాటిని పూత పూసి అమ్ముకుందామనీ!!



 

 

 

.................................

సేనాధిపతి: మహారాజా, శత్రు రాజు యుద్ధరంగం లో గుండె ఆగి హఠాన్మరణం చెందాడట!!
రాజు: ఈ మంచి కబురు కాస్త మెల్లగా చెప్పవయ్యా... నా గుండె ఆగిపోయేలా వుందీ!!    

మరిన్ని శీర్షికలు
uttarakhand