ఈ క్రమంలోనే ఎవరైనా పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోకుండా చూసుకోవాలి.
పొట్ట దగ్గర అధికంగా పేరుకుపోయే కొవ్వుతో ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో అందరికీ తెలిసిందే. చాలామందిలో పొట్ట దగ్గర అధికంగా కొవ్వు పేరుకుపోతుంటుది. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వుని కరిగించడం కష్టం. దీని వల్ల గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. జిమ్ లో ఎన్ని రకాల కుస్తీలు పట్టినా ఒక్కోసారి పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వు మాత్రం తగ్గదు. అయితే కొవ్వు చేరకుండా ఉండాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు కింద సూచించిన పలు పదార్థాలను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో చాలా త్వరగా కొవ్వు కరిగేందుకు అవకాశం ఉంటుంది. ఉదర భాగంలో కొవ్వు పేరుకుంటే అందానికే కాదు ఆరోగ్యానికీ ఇబ్బంది కలుగుతుంది. ఇది హార్మోన్లనూ ప్రభావితం చేస్తుంది. అందుకే ఈ కొవ్వును తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. అందుకోసం ఈ 31 ఆహార పదార్థాలు తీసుకుంటే చాలు.
1. వెల్లుల్లి:
వెల్లుల్లి అనగానే ఇష్టపడేవాళ్లు కొందరుంటే, దాని వాసన కూడా నచ్చని వాళ్లు మరికొందరుంటారు. కానీ మనిషి ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని లాంటిది. వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్‌గా తగ్గిస్తుంది. రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కెళ్లినంత లాభం. రోజూ ఉదయాన్నే వెల్లుల్లి తింటే పొట్ట భాగంలో ఏర్పడిన కొవ్వు తగ్గిపోతుంది. ఉదర ప్రాంతంలో ఉండే కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది.
2. జీలకర్ర :
వంటింట్లో మనం నిత్యం వాడే పదార్థాల్లో జీలకర్ర ఒకటి. దీని వల్ల వండే వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాకుండా, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది.జీలకర్ర రెండు స్పూన్ల జీలకర్ర తీసుకోండి. దాన్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టండి. ఉదయాన్నే విత్తనాలను తీసివేయండి. లేదంటే వడకట్టండి. అందులో సగం నిమ్మకాయను తీసుకుని రసాన్ని పిండండి. ఆ నీటిని తాగండి. దీన్ని పరగడుపున తాగితే వెంటనే బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. మీ నడుము చుట్టు ఉన్న కొవ్వు మొత్తం కరిగిపోతుంది.
3. వేడి నీరు :
ఉదయం లేచి మొదట కాస్త వేడి నీరు తాగండి. ఇది మీ శరీంలోని ఫ్యాట్ ను మొత్తం కరిగిస్తుంది. దీంతో మీరూ ఈజీగా మీ పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ ను కరిగించుకోవొచ్చు.
4. వెచ్చని నీరు & నిమ్మకాయ:
కాస్త గోరు వెచ్చని నీటిలో నిమ్మ రసాన్ని కలపండి. ఆ నీటిని తాగడం వల్ల కూడా ఉదర భాగంలోని కొవ్వు ఈజీగా తొలిగిపోతుంది.
5. తేనె :
తేనె ద్వారా ఈజీగా మీరు బరువు తగ్గొచ్చు. రోజూ కొద్దిపాటి తేనేను మీరూ తీసుకుంటూ ఉండండి. మీరు తీసుకునే కొన్ని రకాల్లో పానీయాల్లోనే చక్కెరకు బదులుగా తేనె కలుపుకుని తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. దీని ద్వారా మీరు ఈజీగా బరువు తగ్గుతారు.
6. టమాట:
యాంటీ ఆక్సిడెంట్'లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్'లను భయటకు పంపటమే కాకుండా, క్యాన్సర్, గుండె వ్యాధులు మరియు శరీర బరువులు తగ్గిస్తాయి. అన్ని రకాల ఆహారాలలో ఇవి ఉంటాయి కానీ, ఇక్కడ తెలుపిన ఆహారాలలో అధిక మొత్తంలో ఉండి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. టమాటాలు టొమాటో జ్యూస్ కూడా శరీరంలోని కొవ్వుని తగ్గించేందుకు బాగా ఉపయోగపడుతుంది. కొద్దిపాటి టమాటాల జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకుంటే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారు.
7.అల్లం :
లావుగా మారిన విషయం ఈ భాగాల్లో పేరుకున్న కొవ్వుని చూస్తేనే అర్థమవుతుంది. అయితే ఇలాంటప్పుడు అల్లం చక్కటి పరిష్కారంగా ఉపయోగపడుతుంది. అల్లం మాత్రమే వేగంగా కొవ్వుని కరిగించగలదు. అల్లంను ప్రతి వంటింట్లో ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇందులో ఉన్న ఔషధ గుణాలు అనేక అనారోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడతాయి. అయితే అధిక కొవ్వుని కరిగించడంలో కూడా అల్లం సమర్థవంతంగా పనిచేస్తుంది.అల్లం పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో అల్లం బాగా పని చేస్తుంది. దీన్ని మీరు రోజూ తినే ఆహారంలో ఉండేలా చూసుకోండి.
8. ఏలకులు :
తీపి పదార్థాలకు రుచినీ, సువాసననూ ఇచ్చే యాలకులు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి.యాలకులు జీర్ణశక్తి పెంచే శక్తి కలగి ఉంటాయి. అలాగే పొట్ట చుట్టు పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి కూడా యాలకులకు ఉంటుంది.
9. దాల్చిన చెక్క :
దాల్చిన చెక్కలో సాధారణ యాంటీఆక్సిడెంట్లతో పోలిస్తే పాలీఫినాల్ అనే శక్తిమంతమైన పోషకం ఉంటుంది. అందుకే దీనిని సూపర్‌ఫుడ్ అంటారు. ఇది రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువ తక్కువ కాకుండా క్రమబద్ధీకరిస్తుంది.
10. పుదీనా :
ఘాటైన సువాసనతో పాటు.. కమ్మని రుచితో నోరూరించే పుదినలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదినా ఆకును డైట్ లో చేర్చుకుంటే.. రకరకాల సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు.పోషకాలు పుష్కలంగా ఉన్న పుదిన ఆకు క్రిములను నాశనం చేస్తుంది.పొత్తికడుపు వద్ద పేరుకుపోయిన కొవ్వును పుదీనా సులభంగా తొలగిస్తుంది. మీరూ రోజూ పుదీనాను తీసుకుంటూ ఉండాలి.
మరికొన్ని ఆహార పదార్థాలు వచ్చేవారం తెలుసుకుందాము....
|