1) భాగ్యనగర వాసులు ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న మెట్రోరైలు ప్రారంభం అయ్యింది....మొదటిరోజు లక్షలాది ప్రజలు ఉత్సాహంగా ప్రయాణించి ఎంజాయ్ చేసారు. ఇక ట్రాఫిక్ కష్టాల నుండీ, వాయు కాలుష్యం నుండీ తమకిక పరిష్కారం దొరికినట్టేనని సంబరపడిపోతున్నారు....అంతవరకు బానే ఉంది కానీ, మిగతా ప్రజా రవాణా చార్జీలతో పోల్చితే టిక్కెట్ల రేట్లు ఎక్కువగా ఉన్నాయనే మాట సర్వత్రా వినిపిస్తోంది...ఇవి మధ్యతరగతి వారికి అందేస్థాయిలో లేవు....మిగతా దార్లలో మెట్రో రైలు ఆదాయన్ని సమకూర్చుకుని, చార్జీలు తగ్గించాలి లేకుంటే ఢిల్లీ మెట్రోరైలు తరహాలోనే నష్టాలను చవిచూడవలసివస్తుంది.
2) అతితక్కువ సమయంలో, ఏసీలో హాయిగా ప్రయాణించాలనుకునే వారికి చార్జీలు ఏమంత పెద్ద విషయం కాదు...ఏమాత్రం తగ్గించవలసిన అవసరం లేదు....మరింత పెంచినా ఆశ్చర్యపోనవసరం లేదు. చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి.
పై రెండింట్లో ఏది కరెక్ట్..?
|