Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

బేతాళ ప్రశ్న - ..

bhetaala prasna

1) న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం పూర్తిగా పాశ్చాత్య సంస్కృతి. అవి మనవి కానే కావు...తాగడానికీ, చిందులేయడానికీ ఇదొక కారణంగా ఎంచుకోవడం తప్ప ఎందుకు జరుపుకుంటున్నామో చాలామందికి తెలీదు...మనం వేడుకలు జరుపుకోవలసింది ఉగాదికి. అది కూడా సంప్రదాయబద్ధంగా..న్యూ ఇయర్ వేడుకలను పూర్తిగా బహిష్కరించాలి...మన ఉగాదికి ఇచ్చే ప్రాముఖ్యతలో వందో వంతు కూడా వాటికి ఇవ్వనేవద్దు.

2) న్యూ ఇయర్ వేడుకలు విశ్వవ్యాప్తం. అంతర్జాతీయ కాలమానాన్ని అనుసరించినప్పుడు, కొత్తసంవత్సరం వేడుకలు జరుపుకొవడంలో తప్పేముంది..? భాషా బేధాల్లేకుండా ప్రాంతాలతో సంబంధం లేకుండా, ప్రపంచదేశాలన్నీ జరుపుకునే వేడుకలలో మనమూ పాలు పంచుకుంటే తప్పేంటి? మన సంప్రదాయాల్ల్ని గౌరవించడమంటే అంతర్జాతీయ స్థాయి విషయాలను విస్మరించడం కాదు. దానికీ, దీనికీ సంబంధమే లేదు. ఉగాదిని సంప్రదాయబద్ధంగా జరుపుకుందాం, న్యూ ఇయర్ వేడుకలను సంబరంగా జరుపుకొందాం.

పై రెండింట్లో ఏది కరెక్ట్...?

మరిన్ని శీర్షికలు
chamatkaaram