Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
happiness  with daughters

ఈ సంచికలో >> సినిమా >>

'కడప' వెబ్‌ సిరీస్‌తో వర్మ మరో సంచలనం సృష్టిస్తాడా?

kadapa web series by varma

సంచలనాల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మరోసారి సంచలనాలకు తెరలేపారు 'కడప'తో. ఇది సినిమా కాదు. ఓ వెబ్‌ సిరీస్‌. గతంలో వర్మ ‘గన్స్ అండ్ థైస్‘ పేరుతో ఓ వెబ్ సిరీస్ స్టార్ట్ చేశారు. తాజాగా 'కడప‘ వెబ్ సిరీస్ తీస్తున్నారు. ఇది  రాయలసీమ రెడ్ల చరిత్ర.  అక్కడి ఫ్యాక్షన్ చరిత్ర. వర్మ తెరకెక్కిస్తున్న తొలి తెలుగు అంతర్జాతీయ వెబ్‌ సిరీస్‌ ఇదే . ఇటీవలే దీనికి సంబంధించి టీజర్‌ విడుదలైంది. తాజాగా 'కడప.. కడప.. ఇది యమద్వారపు గడప..' అంటూ టైటిల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు. ఈ పాటని ప్రముఖ సినీ గేయ రచయిత సిరాశ్రీ రచించారు. గతంలో వర్మ తెరకెక్కించిన 'బెజవాడ', 'వంగవీటి' సినిమాలకూ సిరాశ్రీ రాసిన సాంగ్స్‌ మెయిన్‌ అట్రాక్షన్‌ అయ్యాయి.

అలాగే ఈ వెబ్‌ సిరీస్‌కి కూడా సిరాశ్రీ పాట స్పెషల్‌ అట్రాక్షన్‌ అయ్యింది. ఇది సినిమా కాకపోయినా, సినిమా స్థాయిలో హైప్‌ క్రియేట్‌ అవుతోందీ పాట కారణంగా. తిరుపతి పవిత్ర పుణ్య క్షేత్రం రాయలసీమలోనే ఉంది. ఆ పవిత్ర పుణ్య క్షేత్రం గడపగా కడపకి పేరుంది. ‘కడప’ వెబ్ సిరీస్ విషయానికొస్తే, పాటలో, టీజర్ లో రాయలసీమ ఫ్యాక్షన్‌ చావుల్ని అత్యంత భయానకంగా, క్రూరంగా చూపించారు. ఈ హింస, హాట్ కంటెంట్ సంగతి పక్కన పెడితే, కడప టైటిల్‌ సాంగ్‌లో 'కడపను తిరగేస్తే పడక. కానీ అది చావు పడక. బలిపీఠపు గడప.. 'అంటూ 'కడప', 'గడప', 'పడక' అనే పదాలు వాడి, పాటకి అందం తెచ్చాయి. టెక్నికల్‌ వాల్యూస్‌ పరంగా వర్మకు సాటి ఇంకెవరూ లేరన్పించేలా 'కడప' వెబ్‌ సిరీస్‌ టీజర్‌, సాంగ్‌ రూపొందాయి. పాట, ట్రైలర్‌ రెండూ ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌ అయ్యాయి. మరో పక్క వర్మ, నాగార్జునతో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ సెట్స్‌పై ఉంది ఈ సినిమా. ఎన్టీఆర్‌ జీవిత గాధ ఆధారంగా 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అనే మరో సినిమాని వర్మ ఫిబ్రవరిలో ప్రారంభించనున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
that is pavwanijam