Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

జయజయదేవం - - డా . ఎస్ . జయదేవ్ బాబు

 

అన్న: జుట్టు పట్టి బర బర లాగు!
తమ్ముడు: చాతీ కేసి గట్టిగా ఒక్క తన్ను తన్ను!
అన్న: చావు కేక వేస్తాడు!
తమ్ముడు: నేను పీక నులిమి చంపేస్తాను!
ఒక చిలుక: ఎవరు వాళ్ళు? ఏమిటీ మాట్లాడుకుంటున్నారు?
రెండో చిలుక: బలరామ కృష్ణులు! కంసుడి ఆయుషు మూడింది!!

 

************

 

 

కిష్కిందలో ఒక కోతి:  తోక సిం హాసనం గురించి విన్నావా?
రెండో కోతి: లంక లో చూసినవాళ్ళు ఖంగు తిన్నారని కూడా విన్నాను!!
జై హనుమాన్!!

 

************

 

పౌరుడు సుబ్బన్న: రహదారిలో ఘోర ప్రమాదం జరిగిందటగా?
పౌరుడు వెంకన్న: రెండు గుర్రాల రథం, నాలుగు గుర్రాల రథం తో ఢీ
  కొంది!
పౌరుడు సుబ్బన్న: ప్రాణహాని ఏవన్నా?
పౌరుడు వెంకన్న: ఒక గుర్రం "స్పాట్" లో మరణంచింది.

 

 

 

 

************

 

 

పవనుడు: చండాలుది ఆత్మ తొలగిందా? శరీరం తొలగిందా?
యవనుడు: శంకరుల వారి శంక తొలగింది!!

 

 

 

 

***********

 

భేతాళుడు: విక్రమార్కా నా నీడ పొడవెంతో చెప్పు చూద్దాం?
విక్రమార్కుడు: చూడ్డానికి కనిపిస్తేగా... పొడవెంతో కొలవడానికి?

 

 

 

***********

మంత్రి:  మహారాజా, యువరాణి గారి వివాహానంతరం, పూర్తి రాజ్య పరిపాలన, మీ అల్లుడి గారిదే కదా?
మహారాజు: సందేహమేల? రాజ్యం అల్లుడి గారికి అప్పజెప్పి నేను సన్యాసం స్వీకరించబోతున్నాను కదా?
మంత్రి: నాకు చాలా సంతోషంగా వుంది ప్రభూ?
మహారాజు: ఎందుకూ, నేను సన్యాసిని కాబోతున్నందుకా?
మంత్రి: మీ అల్లుడిగారైనా, నా జీతం పెంచుతారన్న ఆశ కలిగింది ప్రభూ!!

***********

వ్యాపారి: ఇన్నేసి కాలిగజ్జెలూ, ఇన్ని మూరల మల్లెపూల సరాలు కొంటున్నావ్? ఎవరికోసమమ్మా?
కొనుగోలుదారురాలు: నా కోసమే!
వ్యాపారి: ఎవరు నువ్వు
కొనుగోలుదారు రాలు:  మోహినీ పిశాచాన్ని!!

 

 

***********

 

రాకుమారుడు: నేను కామించిన ఆ ముగ్ధమనోహర సౌందర్యరాశిని చూడాలి! ఎలా?
చెలికాడు: ఆమె నా స్వప్న సుందరి కదా? ఆమెని స్వప్న లోకం లోనే చూడాలి!
రాకుమారుడు: సరే... ఆ స్వప్నలోకానికి దారెటు? చెప్పు!
చెలికాడు: స్వప్న లోకానికి వెళ్ళాలంటే నిద్రపోవాలిగా? నీతో ఈ సొల్లుకబుర్లాడుతూ, నాకు నిద్రపట్టక చస్తున్నా!

 

 


***********

సేనాధిపతి: పొరుగు రాజ్యం మన మీద యుద్ధం ప్రకటించింది ప్రభూ!
రాజు: ఎందుకంటా?
మంత్రి: మనం, మద్యం సేవించడం, పొగ త్రాగడం ఆరోగ్యానికి హానికరం అని ప్రచారం మొదలుపెట్టాం!
రాజు: మంచిదేగా?
సేనాధిపతి: ఆ రాజ్య పాలకులు, విప్పసారా, పొగాకూ మనకి ఎగుమతి చేసి లాభాలు సంపాదిస్తున్నారు గదా! ఈ మధ్య వాళ్ళ ఎగుమతులుమందగించాయి!!

 

 

***********

 

ఒక పౌరుడు: నిన్ను పర్వతం  మీది నుంచి  లోయలోకి తోయమని, రాజుగారు శిక్ష విధించారు గదా? ఎలా తప్పించుకున్నావ్?
విదూషకుడు: నన్ను పర్వత శిఖరానికి తీసుకు వెళుతున్న భటులకి కథలు చెప్పి నవ్విస్తూ, దారి మల్లించి, వాళ్ళని లోయకి తీసుకువచ్చేశాను! శిక్ష నెరవేరిందని, భటులు నన్ను వొదిలేసి వెళ్ళిపోయారు!!

మరిన్ని శీర్షికలు
cheppagalaraa..cheppamantara