Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

'సైరా' షూటింగ్‌లోకి నయనతార

nayanatara in sira shooting

చిరంజీవి 151వ చిత్రం 'సైరా నరసింహారెడ్డి' సినిమా తొలి షెడ్యూల్‌ ఈ మధ్యనే పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో చిత్రీకరించిన సన్నివేశాలు చాలా బాగా వచ్చాయట. రెండో షెడ్యూల్‌ కోసం చిత్ర యూనిట్‌ భారీగా రంగం సిద్దం చేస్తోంది. ఫిబ్రవరి 20 నుండి రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. హైద్రాబాద్‌లోని కొన్ని ప్రత్యేక లొకేషన్స్‌లో ఈ షెడ్యూల్‌లోని కొంత భాగం చిత్రీకరించనున్నారట. అలాగే పొలాచ్చిలోని కొన్ని లొకేషన్స్‌ని ఇప్పటికే చిత్ర యూనిట్‌ సెలెక్ట్‌ చేసి ఉంచింది. హైద్రాబాద్‌లో కొంత భాగం చిత్రీకరణ తర్వాత, 'సైరా' యూనిట్‌ పొలాచ్చికి బయలుదేరనుంది. ఇది పెద్ద షెడ్యూల్‌ అట. కొన్ని యుద్ధ సన్నివేశాలు, కీలక సన్నివేశాలను ఈ షెడ్యూల్‌లో పూర్తి చేయనున్నారట. హీరోయిన్‌గా నటిస్తున్న నయనతార ఈ షెడ్యూల్‌లో పాల్గొననుందట.

'సైరా' సినిమా నుంచి నయనతార తప్పుకుందంటూ ప్రచారం జరుగుతున్నా, ఆ వార్తల్ని చిత్ర యూనిట్‌ కొట్టి పారేసింది. విలక్షణ పాత్రలు చేస్తూ, కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తోన్న నయనతార, ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నిట్లోకీ 'సైరా' చాలా ప్రత్యేకమైన సినిమా అంటోంది. తొలి తెలుగు స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రమిది. యుద్ధ సన్నివేశాలకే కాదు, దేశభక్తిని పెంపొందించే ఎమోషన్‌తో కూడిన సన్నివేశాలకీ అత్యంత ప్రాధాన్యత ఉంటుంది ఈ సినిమాలో. ఈ సినిమా కోసం చిరంజీవి గెటప్‌ కొత్తగా ఉండనున్న సంగతి తెలిసిందే. గెటప్‌ విషయంలో చిరంజీవి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. నిన్న మొన్నటి దాకా గెడ్డం, పొడవాటి మీస కట్టుతో కనిపించిన చిరంజీవి ఇప్పుడు నీట్‌ షేవ్‌తో కనిపిస్తున్నారు. అంటే ఈ షెడ్యూల్‌ కోసం చిరంజీవి మరో కొత్త గెటప్‌లో కనిపించనున్నారనీ భావించాలేమో. కొణిదెల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో రామ్‌చరణ్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

మరిన్ని సినిమా కబుర్లు
cine churaka