Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
sankranti movie

ఈ సంచికలో >> సినిమా >>

రఘు కుంచె 'ఇష్టంగా' - అద్భుతంగా!

Raghu Kunche 'Likes' - Exciting!

బుల్లితెరపై యాంకరింగ్‌ నుంచి, వెండితెరపై మ్యూజిక్‌ డైరెక్షన్‌ దాకా రఘు కుంచె తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. సింగర్‌గా ఎన్నో సూపర్‌ హిట్‌ సాంగ్స్‌ని ఆలపించిన రఘు కుంచె, 'మల్టీ టాలెంటెడ్‌' అని గుర్తింపు సంపాదించుకున్న విషయం తెల్సిందే. అయితే, ఆయన టాలెంట్‌కి తగిన స్థాయిలో గుర్తింపు ఇంకా దక్కలేదనేవారూ ఉన్నారు. ఆ విషయం పక్కన పెడితే, తాజాగా రఘు కుంచె ఓ వీడియో సాంగ్‌ని రూపొందించారు. తనే రాసి, తనే సంగీతం అందించి, తనే ఆలపించి, తనే ఆ సాంగ్‌ని చిత్రీకరించి, తనే నిర్మించిన ఈ సాంగ్‌ ఇప్పుడు యూ ట్యూబ్‌లో వైరల్‌గా మారింది. స్టార్టింగ్‌ టు ఎండింగ్‌ ఈ రొమాంటిక్‌ సాంగ్‌ స్క్రీన్‌ మీద నుంచి మన దృష్టి పక్కకు వెళ్ళనీయకుండా చేస్తుంది. సంగీతానికి తోడు సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా కుదిరింది. అన్నిటికీ మించి లిరికల్‌ వాల్యూస్‌, దాంతోపాటుగా పెక్యూలియర్‌గా ఉండే రఘు కుంచె వాయిస్‌ ఈ మ్యూజిక్‌ వీడియోకి మరింతగా ప్రత్యేకతల్ని అద్దాయని చెప్పక తప్పదు.

అందమైన లొకేషన్స్‌ని ఇంకా అద్భుతంగా చూపించడం ఒక ఎత్తయితే, మేల్‌ - ఫిమేల్‌ లీడ్‌ మధ్య రొమాంటిక్‌ టచ్‌ మరో హైలైట్‌గా చెప్పవచ్చు. రఘు కుంచే మ్యాన్లీ అప్పీయర్స్‌ ఈ మ్యూజిక్‌ వీడియోకి ఇంకో హైలైట్‌. తన టాలెంట్‌తో ఓ పక్క అవకాశాలు దక్కించుకుంటూనే, ఇంకో వైపు 'అంతకు మించి' ఏం చేయాలనే దిశగా రకరకాల ప్రయోగాలు చేస్తూ, ఈ క్రమంలో మ్యూజిక్‌ వీడియోని ఎంచుకుని మరో మెట్టు పైకెక్కారు రఘు కుంచె. నిజానికి ఆల్బమ్స్‌ ఏ మ్యూజిక్‌ డైరెక్టర్‌కి అయినా కొత్త కాదు. కానీ, ఆ ఆల్బమ్‌ రూపకల్పనకి సంబంధించి అన్ని విభాగాలపైనా కమాండ్‌, అన్నిటికీ మించి చాలా విభాగాల్ని డీల్‌ చేయడమంటే అది అందరికీ చెల్లుబాటయ్యే విషయం కానే కాదు. గతంలోనూ రఘు కుంచె పలు మ్యూజిక్‌ వీడియోస్‌ విడుదల చేశారు. 'కుంచె చార్డ్స్‌' పేరుతో 'ఇష్టంగా' మ్యూజిక్‌ వీడియోని రూపొందించారు రఘు కుంచె.

మరిన్ని సినిమా కబుర్లు
cheppukondi chooddam