Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
'Padmavathi' is going on?

ఈ సంచికలో >> సినిమా >>

నిరాశ మిగిల్చిన సినీ సంక్రాంతి

sankranti movie

సంక్రాంతి సీజన్‌లో భారీ అంచనాలతో సినిమాలు వరుస కట్టాయి. వాటిలో అతి భారీ అంచనాలతో వచ్చిన 'అజ్ఞాతవాసి' అంచనాల్ని అందుకోలేకపోయింది. అలాగే ఆ తర్వాత వచ్చిన బాలయ్య 'జై సింహా' కూడా అనుకున్న అంచనాల్ని రీచ్‌ కాలేకపోయింది. సంక్రాంతి బాలయ్యకు బాగా కలిసొచ్చే పండగ. అలాంటిది ఎందుకో ఈ సారి బాగా నిరాశ పరిచాడు బాలయ్య. చిన్న సినిమా అయిన 'రంగుల రాట్నం'తో రాజ్‌తరుణ్‌ కూడా రేస్‌లో దూసుకొచ్చి, వెనకబడిపోయాడు. టోటల్‌గా వసూళ్ల పరంగా అన్ని సినిమాలు నిరాశ పరిచాయి ఈ సంక్రాంతికి. ఉన్నంతలో 'జై సింహా' మాస్‌ ఆడియన్స్‌ని కొంతమేర అలరిస్తోందని సరిపెట్టుకోవాలి.

సంక్రాంతి సీజన్‌లో ఎలాంటి సినిమాలైనా వసూళ్ల పంట పండిస్తాయి. అలాంటిది ఈ ఏడాది సీజన్‌ని క్యాష్‌ చేసుకోలేకపోయాయి ఏ సినిమాలు. లాస్ట్‌ ఇయర్‌ సంక్రాంతి బాక్సాఫీస్‌కి కాసుల పంట పండించింది. తొమ్మిదేళ్ల గ్యాప్‌ తర్వాత వచ్చిన చిరంజీవి 150వ సినిమా మంచి బోణీ కొట్టింది. మెసేజ్‌తో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా 'ఖైదీ నెం150' బాక్సాఫీస్‌ వసూళ్లు తిరగ రాసింది. తర్వాత చారిత్రక నేపథ్యంలో వచ్చిన బాలయ్య 'గౌతమీ పుశ్ర శాతకర్ణి' కూడా మంచి వసూళ్లు రాబట్టింది. చిన్న చిత్రంగా వచ్చిన 'శతమానం భవతి' కాసుల పంట పండించడంతో పాటు, ఆ తర్వాత జాతీయ అవార్డు కూడా అందుకుంది. ఇలా లాస్ట్‌ ఇయర్‌ మూడు సినిమాలు పెద్ద హిట్స్‌గా నిలిచి, దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి. అయితే ఈ ఏడాది మొదట్లో నెగిటివ్‌ ట్రెండ్‌ స్టార్ట్‌ అయ్యింది. మళ్లీ జనవరి 26 నుండి సినిమాల జాతర మొదలు కానుంది. తర్వాత ఫిబ్రవరిలోనూ చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్‌ కానున్నాయి. వీటిలో మెగా ఫ్యామిలీ నుండే రెండు సినిమాలు రానున్నాయి. ఇక మార్చి, ఏప్రిల్‌లో మళ్లీ స్టార్‌ హీరోల సినిమాలు జోరందుకోనున్నాయి. సో సంక్రాంతి నిరాశ పరిచినా, రానున్న సీజన్‌ అయినా టాలీవుడ్‌ బాక్సాఫీస్‌కి హాట్‌ హాట్‌ వసూళ్లు రాబడుతుందేమో చూడాలిక. 

మరిన్ని సినిమా కబుర్లు
Raghu Kunche 'Likes' - Exciting!