Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ యువతరం శీర్షికలు సినిమా కార్టూన్లు
captionless cartoon compitetion

ఈ సంచికలో >> శీర్షికలు >>

మీ అందం రెట్టింపు కావాలంటే... - ..

Want to double your beauty ..

రోజు ఇంట్లో వంట చేస్తాం. వంట చేసే సమయంలో మొదట అన్నం వండుతారు కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అన్నాన్ని వాండాలంటే.. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడగాలి. అయితే, బియ్యం కడిగిన నీళ్ళను బయట పారబోస్తుంటారు. లేదంటే మొక్కలకు పోస్తుంటారు.

అయితే, బియ్యం కడిగిన నీటిని బయట ఎక్కడో పారబోయకుండా లేదా, మొక్కలకు వేయకుండా.. ముఖాన్ని శుభ్రంగా కడగాలి.. అలా ముఖాన్ని బియ్యం కడిగిన నీళ్ళతో కడిగితే.. మొటిమల బాధ తగ్గుతుంది. అంతేకాదు, ముఖంపై ఉన్న రాషెస్ తగ్గిపోయి ముఖం అందంగా తయారవుతుంది.

అయితే, బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని ఎలా శుభ్రం చేయాలి. ఇప్పుడు తెలుసుకుందాం. బియ్యం నీళ్ళను ఒక చిన్న బౌల్ లో తీసుకొని.. దూదితో ముంచి ముఖంపై అప్లై చేయాలి. అలా అప్లై చేస్తే.. అది అందానికి ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు ఆరోగ్యనిపుణులు.

ఇంతేనా అనుకోకండి. దీని వలన ఇంకా ఉపయోగాలు ఉన్నాయి. బియ్యం కడిగిన ఎన్న్ళ్లలో జుట్టుకు మేలుచేసే అనేక రకాలైన విటమిన్లు, మినరల్స్ ఉన్నాయట. బియ్యం కడిగిన నీటిని జుట్టుకు అప్లై చేస్తే జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరుగుతుంది.

కొంతమందికి మోకాళ్ళు, మోచేతులు నల్లగా ఉంటాయి. ఎంత శుభ్రం చేసినా ఆ నలుపు పోవడం లేదని వాపోతారు. బియ్యం కడిగిన నీరు ఆ నలుపును పోగొడుతుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

బియ్యం కడిగిన నీటిలో కొన్ని కాటన్ ముక్కలు వేయండి. అవి ఆ నీళ్ళను పీల్చుకోగాని ఆ ముక్కలను తీసుకొని మోకాళ్ళు, మోచేతులపై సున్నితంగా రుద్దండి. ఇలా కొన్ని రోజులు చేయడం వలన మీ మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపు మాయమౌతుంది. ఇక కొందరు బియ్యంతో జావా చేసుకొని తాగుతారు. ఇది ఆరోగ్యానికి ఎంత మంచిది అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పక్కరలేదు. 

మరిన్ని శీర్షికలు
Yummy Drumsticks-Mutton Village Style